Mohan Juneja Died: కేజీఎఫ్(KGF) సినిమాతో జాతీయ స్థాయిలో పాపులర్ అయిన ప్రముఖ కన్నడ నటుడు మోహన్ జునేజా శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగుళూరులో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మోహన్ జునేజా సిరీయల్ నటుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన కొద్ది కాలంలోని సినిమాల్లోకి ప్రవేశించి సుమారు100కు పైగా మూవీల్లో యాక్ట్ చేశాడు. ఆయన నటించిన చివరి చిత్రం కేజీఎఫ్ చాప్టర్-2. మోహన్ జునేజా మృతి పట్ల కన్నడ చిత్ర పరిశ్రమ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
కర్ణాటకలోని తుమ్కూర్ జిల్లాలో జన్మించిన మోహన్ జునేజాకు మంచి పేరు తెచ్చిన మూవీ ‘చెల్లాట’. దాంతో పాటు ‘మస్తీ’, ‘రామ్లీలా’,’బచ్చన్’, ‘కేజీఎఫ్’ వంటి సినిమాలో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కేజీఎఫ్ ద్వారా ఈయనకు తెలుగులో కూడా మంచి గుర్తింపు వచ్చింది.
Also Read…