Kiara Advani Hot Photos: బాలీవుడ్ అందాల భామ కీయరా అద్వానీ బాలీవుడ్ తోపాటు తెలుగు చిత్ర పరిశ్రమలోనూ తన మార్క్ యాక్టింగ్ తో సినీ ప్రియుల హృదయంలో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హిట్ మూవీ భరత్ అనే నేను సినిమా ద్వారా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన కీయరా ఆ తర్వాత రామ్ చరణ్ బోయపాటి కాంబినేషన్లో వచ్చిన వినయ విధేయ రామలో నటించింది.

కానీ వాటి ద్వారా ఆమె అనుకున్నంత స్థాయిలో పాపులారిటీ పొందలేకపోయింది. అయితే ఇప్పుడు రామ్ చరణ్ తేజ్ – శంకర్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా మూవీపై కీయరా అద్వానీ బోలెడంత ఆశలు పెట్టుకుందంటా. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాలో కీలకమైన రోల్ లో నటిస్తున్నట్టు తెలుస్తోంది.

మరో పక్క సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో.. గ్లామర్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ కు హీట్ పుట్టిస్తూ వైరల్ అవుతూ ఉంది. దాంతో పాటు ఈ మధ్య లవ్ బ్రేకప్ వార్త తెగ చెక్కెర్లు కొడుతుంది. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కీయరా అద్వానీ ప్రేమలో ఉన్నారని ఎప్పటినుంచో టాక్ ఉంది. అయితే కొద్దీ రోజులుగా వారిద్దరూ విడిపోయారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది.

అయితే సిద్ధార్థ్ మల్హోత్రా చేసిన పనితో ఆ ప్రచారమంతా అబద్దమని, వారు విడిపోవడం లేదని చెప్పకనే చెప్పినట్లుగా ఉంది. కియరా అద్వానీ ఇన్ స్టాలో చేసిన ఫ్యాషన్ ఫోటో షూట్ కు లవ్ సింబల్ ను ప్రెస్ చేశాడు సిద్ధార్థ్.. ఇక దాంతో మేం రిలేషన్లోనే ఉన్నాం అనే ఇన్ డైరెక్ట్ మెసేజ్ ను పాస్ చేశాడు.
Also Read…