Site icon Telugadda

Jeevitha-Rajasekhar: జీవితా రాజశేఖర్ కు నాన్ బెయిలబుల్ వారెంట్

Jeevitha-Rajasekhar: నటి జీవితా రాజశేఖర్‌కు నగరి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జీవితపై జ్యోస్టర్ ఎండీ హేమ దంపతుల ఆరోపణలు చేశారు. గరుడ వేగ సినిమా నిర్మాణం కోసం జీవితారాజశేఖర్ దంపతులకు రూ.26 కోట్లు అప్పు ఇచ్చామని తెలిపారు. అప్పుకోసం ఆస్తి డాక్యుమెంట్లు తనఖా పెట్టారని, అయితే తమకు తెలియకుండా ఆ ప్రాపర్టీని మరొకరికి అమ్మారని తెలిపారు. జీవితా రాజశేఖర్‌ రూ.26 కోట్లు ఎగ్గొట్టారని చెప్పారు. ఈ వ్యవహారంపై తిరువాళ్లూరులో కేసు పెట్టామని ఆమె పేర్కొన్నారు. జీవితా రాజశేఖర్‌పై చెక్‌బౌన్స్‌ కేసు నడుస్తోందని హేమ తెలిపారు.

Also Read:

Disha Patani: కళ్ళు చెదిరే అందాలతో‌ కవ్విస్తున్న దిశా పటాని

Movie News Today

Exit mobile version