సినిమా సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ కు బహిరంగ లేఖ

సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ కు బహిరంగ లేఖ

(గాంధీ, నెహ్రూలు స్వాతంత్ర పోరాట యోధులు కాదన్న సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ కు డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ రాసిన బహిరంగ లేఖ యధాతధంగా.. తెలుగడ్డ పాఠకుల కోసం)

తమరు ఒక టీవీ ఇంటర్వ్యూలో జాతిపిత మహాత్మా గాంధీ మరియు పండిట్ జవహర్ లాల్ నెహ్రూలు స్వాతంత్ర పోరాట యోధులు కాదని చెప్పారు. అందుకే RRR సినిమాలోని ఒక పాటలో స్వాతంత్ర సమరయోధుల ఫోటోలు వేస్తూ వీరిరువురి ఫోటోలు వేయలేదని తెలిపారు.

1857 తిరుగుబాటు విఫలమైన తరువాత, బ్రిటిష్ ప్రభుత్వం తన సైన్యం బలాన్ని మరింతగా పెంచింది. రైల్వేలను విస్తృత పరచడం ద్వారా మరియు టెలిగ్రామ్ సౌకర్యం అన్ని ప్రాంతాలకు విస్తరించి ‘కీలక సందేశాలను’ ఎప్పటికప్పుడు వివిధ ప్రదేశాలకు చేరవేయడం ద్వారా, 1857 తిరుగుబాటు తరహాలో పెద్ద ఎత్తున హింసాత్మక తిరుగుబాటులు తలెత్తకుండా, కొన్ని ప్రాంతాలలో మొదలయిన అతివాద – హింసాత్మక విధానాలున్న స్వాతంత్ర సమరయోధుల చిన్న చిన్న గ్రూప్ లను ఎక్కడికక్కడ ఉక్కుపాదంతో అణచివేశారు. బలమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థను నెలకొల్పి, తిరుగుబాటులను మొగ్గలోనే అణచివేస్తూ’ మరొక తిరుగుబాటు’ తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది.

ఆ దశలో సామాన్య రైతులను, కార్మికులను, గడపదాటని ఆడవాళ్లను, సామాన్య ప్రజలను స్వాతంత్రోద్యమంలో భాగస్వాములను చేస్తూ…. అహింసాయుత మార్గంలో భారత స్వాతంత్య్రోద్యమం ” గాంధీజీ నాయకత్వంలో ” జరిగింది. తద్వారా రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యపు పాలన భారతదేశంలో అంతం అయ్యింది.

1920లలో నుండి గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ప్రతి సంవత్సరం ఎన్నికలు జరిపి, తద్వారా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు కూడా ఎన్నిక ద్వారానే ఎంపిక అయ్యే అంతర్గత ప్రజాస్వామ్య ఎన్నికల విధానాలను తీసుకువచ్చి, వాటిని అమలు జరిపి, ప్రజాస్వామ్యానికి – ప్రజాస్వామ్య సంస్కృతికి భారతదేశంలో పునాది వేశారు, మరియు ఆ సంప్రదాయాలను కొనసాగించే విధంగా ప్రజలను, వారి మనస్సులను సమాయత్తపరిచారు.

  • గాంధీజీ …. సామాన్యుడి ఆర్థిక ఇబ్బందులకు, పరాయి పాలనకు -. వారి ఆర్థిక విధానాలకు గల సంబంధాన్ని ప్రజలకు తెలియపరచారు. తద్వారా అతి సామాన్యులు సైతం తమ ఇళ్లల్లో ‘ నూలు వడకటం ‘ ద్వారా , అత్యంత బలమైన బ్రిటీష్ సామ్రాజ్యపు ఆర్థిక పునాదులు కదిలించారు.
  • సాంఘిక దురాచారం అయినటువంటి అంటరానితనాన్ని రూపుమాపడంలో ” మెజారిటీ ప్రజలకు నైతిక – సామాజిక బాధ్యత ఉందని ” నొక్కి చెప్పి , ఆ దిశగా దేశవ్యాప్తంగా హరిజన యాత్ర చేసి, ప్రజలను కదిలించి అంటరానితనం పునాదులు పెకిలించారు.

దేశ విభజన ముందు ” నౌకాలి ” లో హిందూ – ముస్లిం గొడవలలో, ప్రాణరక్షణ కోసం హిందూ స్త్రీలు బొట్టు తీసేసి ముస్లింలుగా చెప్పుకుంటుంటే… ” ప్రాణాలు పోయినా సరే బొట్టు తీయొద్దు, హిందువుగానే చనిపోండి ” అని పిలుపునిచ్చి, వారిలో ధైర్యాన్ని నింపి…. ఆ ప్రాంతంలో ప్రజలతోపాటు నివసించి, వారి మనసుల్లో మార్పు తీసుకువచ్చి… అతికొద్ది రోజుల్లోనే శాంతి నెలకొల్పారు.
అప్పటివరకూ కత్తులు దూసుకున్న హిందూ – ముస్లింలు, ఒకరి చేతులు ఒకరు పట్టుకొని శాంతి యాత్రలు జరిపి సమాజ శాంతి కోసం ముందుకు కదిలే విధంగా చేయగలిగారు. అటువంటి యుగపురుషుడిని, మీరు పోరాటయోధుడు కాదు అని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది !!


అయినా హింసే ప్రధాన మార్గంగా, అంశంగా సినిమా కథలు రచించే మీరు …. తెలుగు జాతి ప్రజలకు ఫ్యాక్షనిజాన్ని ‘ హీరోయిజం ‘ గా చూపించి, మెప్పించి, వారి మనసులను మార్చి ( ఎరిక్ ఫ్రామ్ మాటలలో pathology of normalcy స్థితికి తీసుకువచ్చి ), ఆంధ్ర రాష్ట్ర వినాశనానికి కారణం అయ్యారు.

ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త అయిన జే.బీ.ఎస్ హాల్డేన్ అత్యంత క్లిష్టమైన శాస్త్ర సాంకేతిక అంశాలు కూడా అతి సామాన్యులకు అర్థమయ్యేటట్లుగా వివరించేవారు. ఆయన చెప్పిన ఒక మాట ” ఏదైనా ఒక విషయాన్ని వివరించి చెప్పాలంటే, వారి స్థాయికి వెళ్లి … వారి భాషలో వివరించాలని “.

మీరు సినిమా రచయిత కాబట్టి సినిమా రంగంలోని ఉదాహరణ తీసుకొని ‘ రీల్ ‘ పోరాటానికి మరియు ‘ రియల్ ‘ పోరాటానికి గల తేడా వివరిస్తాను.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు డబ్బు కోసం, తమ అహంభావం తృప్తి పరచుకోవడం కోసం ” పేదల పేరున ” సినిమా టికెట్ రేట్లు తగ్గించారు. అప్పుడు ఇద్దరు వ్యక్తులు తమ తమ సినిమా రిలీజ్ మరియు వాటి టికెట్ల రేట్ల గురించి ప్రవర్తించిన తీరు పరిశీలిస్తే రీల్ పోరాటానికి – రియల్ పోరాటానికి తేడా తెలుస్తుంది.

  1. ‘ అఖండ ‘ సినిమా రిలీజ్ కి ముందు, ఈ విషయంపై నందమూరి బాలకృష్ణ మేము ఎవరినీ కలవం, టికెట్లు రేట్లు పెంచమని ఎవరినీ అడగం. మా సినిమా ఆడుతుంది అని ధైర్యంగా సినిమా రిలీజ్ చేశారు, చేయించారు.
  2. ‘ ఆర్.ఆర్ ఆర్ ( RRR ) ‘ సినిమా రిలీజ్ ముందు సినిమా దర్శకుడు రాజమౌళి ప్రత్యేకంగా ఒక్కరే వెళ్లి అత్యంత అవినీతిపరుడు, కుల పిచ్చి – కుల ద్వేషం మరియు మత పిచ్చి- మత ద్వేషం కలగలిసిన ఒక ప్రభుత్వాధినేత ముందు మోకరిల్లి సినిమా టికెట్లు రేట్లు పెంచుకునే వెసులుబాటును తెచ్చుకున్నారు.

కష్టమో నష్టమో నమ్మింది చేయడం , దాని వలన వచ్చే సాధక బాధకాలు భరించే గుండె ధైర్యం, తెగింపు నిజజీవితంలో చూపించడమే పోరాటయోధుడు లక్షణం. ఆ లక్షణం ఎవరికి ఉందో వారే నిజమైన పోరాట యోధులు.

‘క్షమాబిక్ష ప్రసాదించమని’ బ్రిటిష్ వారికి ఉత్తరాలు రాసిన వారు మీకు ఆదర్శ మూర్తులు కావచ్చేమో!!

నిజమైన నాయకుడికి ఉండవలసింది పరుష పదజాలంతో, విద్వేషంతో , అసత్యాలతో ఘాటయిన ఉపన్యాసాలు ఇచ్చే అలవాటు కాదు. త్రికరణశుద్ధిగా నమ్మింది, చెప్పింది , చేసేది ఒకటిగా అవలంబించి, సత్యమే పునాదిగా, మార్గంగా భావించి.. ప్రజలను ఆ మార్పు దిశగా నడిపించగలిగిన వాడే నిజమైన నాయకుడు. ఈ లక్షణాలకు నిలువెత్తు రూపమే గాంధీజీ. ఆయన యుగపురుషుడు.

Also Read…

CBSC: సీబీ ఎస్ సి పాఠ్యపుస్తకాల నుండి ఫైజ్ అహ్మద్ ఫైజ్ కవితలు తొలగింపు

ఆధిపత్యవాదాలను కూల్చి వేయాలి: ‘ఇక ఇప్పుడు’ పుస్తకావిష్కరణ సభలో జూలూరి

RELATED

Avani: ఘనంగా జయరాజు ‘అవని’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ…

Jayaraju: ప్రజా వాగ్గేయకారులు, ప్రకృతి కవి జయరాజు రచించిన "అవని" ఇంగ్లీష్ పుస్తకావిష్కరణ కార్యక్రమం శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ పుస్తకాన్ని ప్రముఖ దర్శకులు బి నర్సింగరావు,...

మతాలను రాజకీయం చేయొద్దు

మతం ఉచ్చులో బందీ అయ్యి అన్య మతస్తులను రెచ్చగొట్టే విధానాలకు స్వస్తి పలకాలి. రాజకీయ పార్టీలు, ఆధ్యాత్మిక సంస్థలు మతాలను రాజకీయం చేయొద్దు. మతం వ్యక్తిగతమని, సామూహిక మైన దైనా సమ్మతమైన జీవన విధానానికి...

KTR: ప్రధాని మోడీ గారు.. తెలంగాణ నుంచి పాఠాలు నేర్చుకోండి

● ఆవో-దేఖో-సీకో (Aao-Dhekho-Seekho) అంటూ ప్రధానమంత్రి మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ● జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి వికాసం...

Avani: ఘనంగా జయరాజు ‘అవని’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ…

Jayaraju: ప్రజా వాగ్గేయకారులు, ప్రకృతి కవి జయరాజు రచించిన "అవని" ఇంగ్లీష్ పుస్తకావిష్కరణ కార్యక్రమం శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ పుస్తకాన్ని ప్రముఖ దర్శకులు బి నర్సింగరావు,...

మతాలను రాజకీయం చేయొద్దు

మతం ఉచ్చులో బందీ అయ్యి అన్య మతస్తులను రెచ్చగొట్టే విధానాలకు స్వస్తి పలకాలి. రాజకీయ పార్టీలు, ఆధ్యాత్మిక సంస్థలు మతాలను రాజకీయం చేయొద్దు. మతం వ్యక్తిగతమని, సామూహిక మైన దైనా సమ్మతమైన జీవన విధానానికి...

KTR: ప్రధాని మోడీ గారు.. తెలంగాణ నుంచి పాఠాలు నేర్చుకోండి

● ఆవో-దేఖో-సీకో (Aao-Dhekho-Seekho) అంటూ ప్రధానమంత్రి మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ● జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి వికాసం...

కార్పొరేషన్ చైర్మన్లుగా ఆ ముగ్గురు నియామకం

రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. తెలంగాణ ఫుడ్స్ చైర్మన్‌గా మేడె రాజీవ్ సాగర్, తెలంగాణ అధికార భాషా సంఘం చైర్మన్‌గా మంత్రి శ్రీదేవి, తెలంగాణ ఉర్దూ అకాడమీ...