తెలంగాణ Jr NTR: ఇంటర్ పరీక్షా పత్రంలో ఎన్టీఆర్‌పై ప్రశ్న.. ఏం అడిగారో తెలుసా?

Jr NTR: ఇంటర్ పరీక్షా పత్రంలో ఎన్టీఆర్‌పై ప్రశ్న.. ఏం అడిగారో తెలుసా?

Jr NTR – Intermediate Question Paper: జక్కన్న చెక్కిన అద్భుత చిత్రం ఆర్ఆర్ఆర్ (RRR)సినిమాలోని కొమరం భీముడొ.. పాట ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. దానిలో జూనియర్ ఎన్టీఆర్‌ నటనకు కేవలం ఆయన ఫ్యాన్స్ మాత్రమే కాకుండా వరల్డ్ వైడ్ సినీ ప్రేమికులు ఫిదా అయ్యారు. ఇప్పటికి ఆ పాట సోషల్ మీడియాను షాక్ చేస్తుందంటే ఆయన ఎంతలా ఆకట్టుకున్నారో అర్ధం చేసుకోవచ్చు. బహుశా దాని ఇంపాక్ట్ తోనే కావచ్చు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్‌లో ఎన్టీఆర్‌పై ప్రశ్న అడిగారు. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ పేపర్ ను సోషల్ మీడియాలో భారీగా షేర్ చేస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెలితే… తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ (Telangana Intermediate Exams) ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్‌లో ‘ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరంభీం పాత్రలో తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఎన్టీఆర్‌తో.. మీరు ఓ రిపోర్టర్‌గా ఇంటర్వ్యూ చేసి ప్రశ్నలు అడిగి.. సమాధానాలు తెలుపుతూ ఓ వ్యాసం రాయండి’ అంటూ ప్రశ్న ఇచ్చారు. అది చుసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ “తగ్గేదే.. లే” అంటూ ఆ క్వశ్చన్ పేపర్‌ను తెగ వైరల్ చేస్తున్నారు. ‘దటీజ్ పవర్ ఆఫ్ ఎన్టీఆర్ యాక్టింగ్’ అంటూ, ‘అట్లుంటది తారక్ అన్నతోని’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ట్వీట్లు చేస్తూ రచ్చ చేస్తున్నారు.

రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్లో మార్చి 24న విడుదలైన ఆర్ఆర్ఆర్ రికార్డ్స్ షాక్ చేసింది. ఇక మరి కొద్ది రోజులలో యాభై రోజులు పూర్తి చేసుకోబోతున్న ఆర్ఆర్ఆర్ తాజాగా హైదరాబాద్లో మరో రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటివరకు ఈ మూవీ సిటీలోని సుదర్శన్ 35mm థియేటర్ లో 5 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించింది.

Also Read…

Sonakshi Sinha: త్వరలో స్టార్ హీరోయిన్ పెళ్ళి..? నిశ్చితార్థం ఫోటోలు వైరల్…

ముస్లింలు ‘కుల’ భేదాలను అధిగమించాలి

RELATED

Avani: ఘనంగా జయరాజు ‘అవని’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ…

Jayaraju: ప్రజా వాగ్గేయకారులు, ప్రకృతి కవి జయరాజు రచించిన "అవని" ఇంగ్లీష్ పుస్తకావిష్కరణ కార్యక్రమం శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ పుస్తకాన్ని ప్రముఖ దర్శకులు బి నర్సింగరావు,...

మతాలను రాజకీయం చేయొద్దు

మతం ఉచ్చులో బందీ అయ్యి అన్య మతస్తులను రెచ్చగొట్టే విధానాలకు స్వస్తి పలకాలి. రాజకీయ పార్టీలు, ఆధ్యాత్మిక సంస్థలు మతాలను రాజకీయం చేయొద్దు. మతం వ్యక్తిగతమని, సామూహిక మైన దైనా సమ్మతమైన జీవన విధానానికి...

KTR: ప్రధాని మోడీ గారు.. తెలంగాణ నుంచి పాఠాలు నేర్చుకోండి

● ఆవో-దేఖో-సీకో (Aao-Dhekho-Seekho) అంటూ ప్రధానమంత్రి మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ● జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి వికాసం...

కార్పొరేషన్ చైర్మన్లుగా ఆ ముగ్గురు నియామకం

రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. తెలంగాణ ఫుడ్స్ చైర్మన్‌గా మేడె రాజీవ్ సాగర్, తెలంగాణ అధికార భాషా సంఘం చైర్మన్‌గా మంత్రి శ్రీదేవి, తెలంగాణ ఉర్దూ అకాడమీ...