Samantha Ruth Prabhu Birth Day Special: గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఏమాయ చేశావే’ తో తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రవేశించి, అందం అభినయంతో అందరిని మాయ చేసిన సమంత రూత్ ప్రభు తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. టాలీవుడ్ లో స్టార్ హీరోస్ అందరితో ఆడిపాడిన సామ్.. అటు తమిళంలో కూడా అగ్రస్థానం సంపాదించుకుంది. ఆమె పేరుతో పాటు కోట్లు కూడా బాగానే కూడబెట్టుకుంది.

ఇక అసలు విషయానికి వస్తే ఈరోజు( ఏప్రిల్ 28) సమంత పుట్టిన రోజు. ముప్పై అయిదులోకి అడుగుపెడుతుంది. ఈ సందర్బంగా తన బర్త్ డే సెలెబ్రేషన్స్ ను సామ్ కాశ్మీర్ లో జరుపుకుంది. కెరీర్ పరంగా మంచి పామ్ లో ఉన్న సామ్.. షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉంది. ఓ మూవీకి సంబందించిన షూటింగ్లో భాగంగా కాశ్మీర్ వెళ్లిన తను అక్కడే టీం సభ్యుల మధ్య కేక్ కట్ చేసింది.

అలాగే సమంత బర్త్ డే సర్ ప్రైజ్ గిఫ్ట్ గా ‘శాకుంతలం’ చిత్ర యూనిట్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. దానిలో సమంత తెల్ల దుస్తుల్లో మెరిసిపోతూ ఎవరికోసమో ఎదురుచున్నట్టుగా ఉన్న ఆ పోస్ట్ వైరల్ అవుతుంది. ‘శాకుంతలం’ ఆమె తొలి పౌరాణిక చిత్రం. ఇది గుణశేఖర్ డైరెక్షన్ లో భారీ అంచనాల నడుమ రూపుదిద్దుకుంటుంది. దుష్యంతుడు–శాకుంతల ప్రేమకథ ఆధారంగా వస్తున్న ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ ను మే 5న ఉదయం 11.07 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.

Also Read…