Sonakshi Sinha Engagement: “నాకెంతో ప్రత్యేకమైన రోజు. నా కల నిజమైంది. ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు ఆనందిస్తున్నా’’ అంటూ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు అర్థం వచ్చేలా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సోనాక్షి వేలికి ఉంగరం ధరించి, పక్కన ఉన్న వ్యక్తిని పట్టుకుని ఉన్న పిక్స్ లను ఇన్ స్టాలో షేర్ చేసింది. దాంతో ఆమె రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందని, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందని చర్చ మొదలైంది.
వేలికి ఉన్న రింగ్ ఫోకస్ అయ్యేలా ఉన్న ఫోటోలో సోనాక్షి తన పక్కన ఉన్న వ్యక్తి ఎవరు అనేది మాత్రం తెలియడం లేదు. పక్కనున్న వ్యక్తిపై చేయి వేసిన ఆమెకు నిజంగా నిశ్చితార్థం అయిందా… లేదా షూట్లో భాగంగా స్టిల్ ఇచ్చి సినిమా ప్రమోషన్లో భాగంగా అలా పోస్ట్ చేసిందా అనేది అర్థం కావడం లేదు. అసలు వాస్తవం ఏమిటనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. సోనాక్షి ‘దబాంగ్’ సినిమాతో హీరోయిన్ కెరీర్ ప్రారంభించి, ‘రౌడీ రాథోడ్’, ‘జోకర్’, ‘సన్నాఫ్ సర్ధార్’, ‘ఆర్.. రాజ్‌కుమార్’, ‘లింగా’, ‘వెల్కమ్ టు న్యూయార్క్’, ‘భుజ్’ వంటి మూవీల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.
Also Read…
Rashmika Mandanna: రష్మిక అందాన్ని పెంచే డైట్ ప్లాన్ ఇదే.. ట్రై చేస్తారా?