జాతీయం Communist Manifesto: వందేళ్ల కమ్యూనిస్టు ప్రణాళిక – 2

Communist Manifesto: వందేళ్ల కమ్యూనిస్టు ప్రణాళిక – 2

తొలి వందేళ్లల్లో కమ్యూనిస్టు ప్రణాళిక ఎలాంటి ప్రభావాన్ని చూపింది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుకోవటానికి మనం ప్రధానంగా తెలిసో తెలియకో మనకు కలిగిన అభిప్రాయాలపైనే ఆధారపడతాము.

తమను తాము మార్క్సిస్టులుగా పరిగణించుకునేవాళ్లల్లో కొందరు కమ్యూనిస్టు ప్రణాళికను పవిత్ర గ్రంధంగానో భావిస్తారు. బైబిల్‌లో అక్షరం అక్షరం పాటించే ఛాందస క్రైస్తవుల్లాగా ఈ గ్రంధాన్ని చూస్తారు. కమ్యూనిస్టు ప్రణాళిక విషయంలో కూడా ప్రతి అక్షరం ప్రతి ప్రతిపాదన రాసేనాటికి సత్యమైనదనీ, దాంట్లో ఒత్తులు పొల్లులు కూడా మార్చాల్చిస అవసరం లేదని వంద సంవత్సరాల ప్రపంచ ఉద్విగ్న చరిత్రను ఈ విధంగానే ప్రణాళిక వెలుగులో మదించాలని ప్రతిపాదిస్తారు. అర్థవంతంగా ఆలోచించేవారికెవరికైనా ఈ విధమైన ఛాంధసత్వం ఆమోదయోగ్యం, అనుసరణీయం కాదని చెప్పటానికి పెద్దగా కష్టపడాల్సిన అసవరం లేదు. వర్గ శతృవులు కూడా కమ్యూనిస్టులను విమర్శించటానికి ఇటువంటి ప్రమాణాలనే ముందుకు తెస్తారు. నూటికి నూరు శాతం తిరుగులేనిదన్న ప్రమాణం ప్రకారం చూస్తే కమ్యూనిస్టు ప్రణాళికు కాలం చెల్లిందని పక్కన పడేయటానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా చూసినప్పుడు మాత్రమే ఏ మేధో అల్పత్వం కలిగిన వారైనా సరే శాస్త్రీయ సోషలిజం పితామహులు తనకంటే గొప్ప మేధావులేమీ కాదని జబ్బలు చరుచుకోవటానికి అవకాశం ఉంటుంది. అటువంటి వ్యక్తులకు అమెరికా మేధో సమాజంలో నేడు కొరత లేదు. ఇటువంటి మేధావులు తమ విజయాల గురించి వేల సార్లు డప్పు కొట్టుకున్నా కమ్యూనిస్టు ప్రణాళిక శాస్త్రీయతకు, సమకాలీనతకు వచ్చిన ముప్పేమీ లేదు. కమ్యూనిస్టు ప్రణాళిక రచయితల కీర్తి ప్రతిష్టలకు వాటిల్లిన ముప్పేమీ లేదు.

కమ్యూనిస్టు ప్రణాళిక ప్రభావాన్ని మదించటానికి పాటించాల్సిన ప్రమాణాలను కూడా మార్క్స్‌ ఏంగెల్స్‌లే ప్రతిపాదించారు. ఈ కోణంలో చూసినప్పుడు వివిధ సంచికలకు మార్క్స్‌ ఏంగెల్స్‌లు రాసిన ముందుమాటలు కూడా కమ్యూనిస్టు ప్రణాళికంత విలువైనవి. ప్రాధాస్యత, ప్రాసంగికత కలిగినవే. (ప్రత్యేకించి 1872 జర్మన్‌ సంచికకు రాసిన ముందుమాట, 1882 రష్యన్‌ ప్రతికి రాసిన ముందుమాట, 1883 జర్మన్‌ ప్రతికి రాసిన ముందుమాట, 1888 ఆంగ్ల ప్రతికి రాసిన ముందుమాట ఈ కోవకు చెందినవి) ఈ ముందుమాటలను అధ్యయనం చేయటం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠాలేమిటన్నది ఈ క్రింది విధంగా సంక్షిప్తీకరించుకోవచ్చు :

  1. కొన్ని కొన్ని సందర్భాల్లో మార్క్స్‌ ఏంగెల్స్‌లే మారుతున్న పరిస్థితులకు కమ్యూనిస్టు ప్రణాళికలోని వివరణలకు మధ్య పొంతన లేదని భావించారు. ప్రత్యేకించి కార్యాచరణ, ప్రపంచ సాహిత్యాలకు సంబంధించిన అధ్యాయాలకు కాలం చెల్లిందని భావించారు.
  2. కమ్యూనిస్టు ప్రణాళికలో ప్రతిపాదించిన మౌలిక సూత్రాలు ‘స్థూలంగా సరైనవేననీ, నేటికీ వర్తించేవేనీ’ భావించారు (1872, 1888 ముందుమాటలు).
  3. పారిస్‌ కమ్యూన్‌ అనుభవంతో కమ్యూనిస్టు ప్రణాళికలో ఓ విలువైన అంశాన్ని మార్క్స్‌ ఏంగెల్స్‌లు జోడిరచారు. ఈ ప్రతిపాదిన మూల రచనలో లేదు. ‘‘ కార్మికవర్గం అప్పటికే అందుబాటులో ఉన్న రాజ్యాంగ యంత్రాన్ని యథాతథంగా స్వీకరించి తమ లక్ష్యాలు సాధించేందుకు వీలుగా ఉపయోగించుకోలేరు.’’అన్నదే మార్క్స్‌ ఏంగెల్స్‌లు జోడిరచిన సూత్రం. మరో విధంగా చెప్పుకోవాలంటే రెడీ మేడ్‌గా విప్లవ శక్తులకు అందుబాటులోకి వచ్చే రాజ్యాంగ యంత్రం సమకాలీన పాలక వర్గ ప్రయోజనాలు కాపాడేందుకు ఉనికిలోకి వచ్చిన రాజ్యాంగయంత్రమే. కార్మికవర్గం విజయం సాధించిన తర్వాత ఈ రెడీమేడ్‌గా అందుబాటులో ఉన్న రాజ్యాంగ యంత్రాన్ని సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందని మార్క్స్‌
    ఏంగెల్స్‌లు నిర్ణయానికి వచ్చారు.
  4. మార్క్స్‌ ఏంగెల్స్‌లు తమ ఉమ్మడిగా రాసిన ముందుమాటలో (1882 రష్యన్‌ ప్రతికి రాసిన ముందుమాటలో) పశ్చిమ యూరప్‌ చారిత్రక అనుభవాల ఆధారంగా కమ్యూనిస్టు ప్రణాళికలో ప్రతిపాదనలు రూపొందించబడ్డాయని అంగీకరించారు. 1882 నాటికి రష్యా విప్లవోద్యమ నాయకురాలిగా ఎదిగే దిశగా ప్రయాణిస్తోందని అంచనా వేశారు. ఈ పరిణామం అనివార్యంగా అనేక కొత్త ప్రశ్నలను మన ముందుకు తెచ్చిందనీ, ఈ ప్రశ్నలు, వాటికి సమాధానాలకు కమ్యూనిస్టు ప్రణాళిక మూల ప్రతిలో స్థానం కల్పించలేదని స్పష్టంగా తెలియచేశారు. ఈ అంశం చాలా కీలకమైనది. ముఖ్యమైనది. అవసరమైనది కూడా.

ఈ ముందుమాటలు పరిశీలిస్తే తామేదో స్వప్నలోకపు సౌధాన్ని నిర్మిస్తున్నామని, ఎల్లకాలం చలామణిలో ఉండే ముడి సూత్రాలను అందిస్తునాన్నమన్న భావనలో మార్క్స్‌ ఏంగెల్స్‌లు లేరన్న వాస్తవం అర్థమవుతుంది. భవిష్యత్‌ తరాల సోషలిస్టులు ఈ సూత్రాలకు లోబడి ఉండాలని కూడా వారేమీ ఆశించలేదు. ప్రత్యేకించి పెట్టుబడిదారీ వ్యవస్థ కొత్త కొత్త దేశాలకు విస్తరిస్తూ పోయే కొద్దీ, ఆయా దేశాలను ఆధునిక ప్రపంచ చరిత్రలో భాగస్వాములను చేసే కొద్దీ కమ్యూనిస్టు ప్రణాళికలో ప్రస్తావించని అభివృద్ధి నమూనాలు, సమస్యలు ముందుకొస్తాయన్న అవగాహనతోనే మార్క్స ఏంగెల్స్‌లు ఉన్నారన్న వాస్తవం మనకు కనిపిస్తుంది.
మరోవైపున కమ్యూనిస్టు ప్రణాళికలో ప్రస్తావించిన మౌలిక సూత్రాలు సమకాలీన ప్రాధాన్యత కలిగినవేనన్న విషయంలో వారిరువురికీ ఎటువంటి సందేహమూ లేదు. తర్వాతి దశాబ్దాల్లో జరిగిన పరిణామాలు, లేదా తదుపరి కాలంలో వాళ్లు సాగించిన అధ్యయనాలు సైతం తమ మౌలిక సైద్ధాంతిక ప్రాతిపదికను, చట్రాన్ని ప్రశ్నార్థకం చేసిన దాఖలాలు లేవు. మార్క్స్‌ ఏంగెల్స్‌లు చివరి కాలంలో సాగించిన అధ్యయనాలు మరింత లోతైనవీ, విస్తృత స్వభావం కలిగినవన్న విషయాన్ని మనం గుర్తించాలి.

ప్రచురణానంతరం శతాబ్దం తర్వాత కమ్యూనిస్టు ప్రణాళికను అంచనా వేయటానికి అనుసరించే ప్రమాణాలు, పద్ధతుల విషయంలో మార్క్స్‌ ఏంగెల్స్‌లు తమ జీవిత కాలంలో కమ్యూనిస్టు ప్రణాళిక ప్రచురణలు సాగిన పాతికేళ్లల్లో పాటించిన ప్రమాణాలే మనం కూడా పాటించాల్సి ఉంటుంది. పాటించాల్సి ఉంది. వివరాల్లోకి వెళ్లి మనం గందరగోళపడాల్సిన అవసరం లేదు. 20వ శతాబ్ది తొలి యాభయ్యేళ్లల్లో వచ్చిన మార్పుల నేపథ్యంలో నేరుగా కమ్యూనిస్టు ప్రణాళిక మౌలిక సూత్రాల పర్యవసానాలను, ఫలితాలను అంచనా వేయవచ్చు.

(తెలుగడ్డా ప్రతి సోమవారం పాఠకలకు కమ్యూనిస్టు ప్రణాళికపై అందిస్తున్న వరుస వ్యాఖ్యానాల కొనసాగింపుగా ప్రణాళిక శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రముఖ మార్క్సిస్టు పాల్‌ స్వీజీ రాసిన సుదీర్ఘ వ్యాసాన్ని చిన్న చిన్న భాగాలుగా ఈ వారం నుండీ మీ ముందుకు తెస్తున్నాము. స్వీజీ వ్యాఖ్యలో ఇది రెండో భాగం ` ఎడిటర్‌, తెలుగడ్డా)

మూలం : పాల్‌ ఎం స్వీజీ
అనువాదం : కొండూరి వీరయ్య

Also Read :

Communist Manifesto: వందేళ్ల కమ్యూనిస్టు ప్రణాళిక – 1

National News Today

RELATED

Avani: ఘనంగా జయరాజు ‘అవని’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ…

Jayaraju: ప్రజా వాగ్గేయకారులు, ప్రకృతి కవి జయరాజు రచించిన "అవని" ఇంగ్లీష్ పుస్తకావిష్కరణ కార్యక్రమం శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ పుస్తకాన్ని ప్రముఖ దర్శకులు బి నర్సింగరావు,...

మతాలను రాజకీయం చేయొద్దు

మతం ఉచ్చులో బందీ అయ్యి అన్య మతస్తులను రెచ్చగొట్టే విధానాలకు స్వస్తి పలకాలి. రాజకీయ పార్టీలు, ఆధ్యాత్మిక సంస్థలు మతాలను రాజకీయం చేయొద్దు. మతం వ్యక్తిగతమని, సామూహిక మైన దైనా సమ్మతమైన జీవన విధానానికి...

KTR: ప్రధాని మోడీ గారు.. తెలంగాణ నుంచి పాఠాలు నేర్చుకోండి

● ఆవో-దేఖో-సీకో (Aao-Dhekho-Seekho) అంటూ ప్రధానమంత్రి మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ● జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి వికాసం...

Avani: ఘనంగా జయరాజు ‘అవని’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ…

Jayaraju: ప్రజా వాగ్గేయకారులు, ప్రకృతి కవి జయరాజు రచించిన "అవని" ఇంగ్లీష్ పుస్తకావిష్కరణ కార్యక్రమం శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ పుస్తకాన్ని ప్రముఖ దర్శకులు బి నర్సింగరావు,...

మతాలను రాజకీయం చేయొద్దు

మతం ఉచ్చులో బందీ అయ్యి అన్య మతస్తులను రెచ్చగొట్టే విధానాలకు స్వస్తి పలకాలి. రాజకీయ పార్టీలు, ఆధ్యాత్మిక సంస్థలు మతాలను రాజకీయం చేయొద్దు. మతం వ్యక్తిగతమని, సామూహిక మైన దైనా సమ్మతమైన జీవన విధానానికి...

KTR: ప్రధాని మోడీ గారు.. తెలంగాణ నుంచి పాఠాలు నేర్చుకోండి

● ఆవో-దేఖో-సీకో (Aao-Dhekho-Seekho) అంటూ ప్రధానమంత్రి మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ● జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి వికాసం...

కార్పొరేషన్ చైర్మన్లుగా ఆ ముగ్గురు నియామకం

రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. తెలంగాణ ఫుడ్స్ చైర్మన్‌గా మేడె రాజీవ్ సాగర్, తెలంగాణ అధికార భాషా సంఘం చైర్మన్‌గా మంత్రి శ్రీదేవి, తెలంగాణ ఉర్దూ అకాడమీ...