జాతీయం వధ్యశిలపైకి మరో 60 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు

వధ్యశిలపైకి మరో 60 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు

తెలుగడ్డా ప్రత్యేకం

కేంద్రం కొత్తగా రూపొందిస్తున్న ప్రభుత్వ రంగ విధానం ఆధారంగా మరో 60 వ్యూహాత్మకం కానీ పరిశ్రమలను అమ్మటానికీ లేదా మూసేయటానికీ కేంద్రం సిద్దం అవుతోంది. ఈ మేరకు నీతి ఆయోగ్ పర్యవేక్షణలో కేంద్ర పరిశ్రమల శాఖ అధికారు ఈ తాజా జాబితాను రూపొందిస్తున్నారు. ఎరువులు, రసాయనాలు, పెట్రో కెమికల్స్, ఔషధ పరిశ్రమలు ఈ జాబితాలో ఉన్నాయి.

వ్యూహాత్మకం కాని రంగాల్లో 175 పరిశ్రమలు కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల పరిధిలో ఉన్నాయి. ఇందులో మూడో వంతు పరిశ్రమలను మూసి వేయటానికి లేదా అమ్మేయటానికి కేంద్రం వ్యూహరచన చేస్తోంది. ఎతావాతా కేంద్రం చేతిలో లాభాపేక్ష లేని రంగాల్లో ఉన్న కొన్ని పరిశ్రమలు మాత్రమే కేంద్రం ఆధీనంలో మిగలనున్నాయి. ఎరువుల శాఖ ఆధీనంలో ఉన్న మద్రాస్ పెర్టిలైజర్స్, నేషనల్ ఫెర్టిలైజర్స్ తో సహా 9 సంస్థలను పూర్తిగా అమ్మేయటానికి రంగం సిద్ధం చేస్తున్నారు. భారత దేశంలో వ్యవసాయానికి కావాల్సిన ఎరువులు దేశీయంగా ఉత్పత్తి చేసుకోవాలన్న నిర్ణయాన్ని గాలికొదిలి విదేశాల నుండి దిగుమతి చేసుకునేందుకు కేంద్రం తలుపు తీసింది. విదేశాల నుండి పెద్ద ఎత్తున ఎరువులు రసాయనాలు దిగుమతి అవుతున్నాయి. గతంలో కాప్టివ్ పవర్ జనరేషన్ తరహాలోనే కాప్టివ్ ఫెర్టిలైజర్స్ ప్రొడక్షన్ పాలసీని కేంద్రం రూపొందిస్తోంది.

జాతీయ జౌళి పరిశ్రమల శాఖ ఆధీనంలో పని చేసే 21 పరిశ్రమలను తెగనమ్మటానికి కేంద్రం సిద్దం అయింది. ఆయా పరిశ్రమల్లో ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం కాలం చెల్లినదని ప్రయివేటు టెక్స్ టైల్స్ రంగం అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తో ముందుకెళ్తోందని నీతి ఆయోగ్ అధికారులు అంటున్నారు. ఈ పరిశ్రమలోని కాలం చెల్లిన యంత్రాలకి గిరాకీ లేకపోయినా ఆయా పరిశ్రమ స్వాధీనంలో ఉన్న భూమికోసం ప్రయివేటు పెట్టుబడిదారులు ముందుకొస్తారని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

కేంద్ర వాణిజ్య శాఖ నియంత్రణలో నడిచే రెండు వాణిజ్య సంస్థలు మూత పడనున్నాయి. రైతాంగానికి అంతో ఇంతో మేలు చేయటానికి ఉపయోగపడే కాటన్ కార్పొరేషన్, జూట్ కార్పొరేషన్ సంస్థలను కేంద్రం కొనసాగించనున్నట్టు తెలుస్తోంది.ఈ రెండు సంస్థలు అమ్మేస్తే రైతాంగానికి కనీస మద్దతు ధర ఊసే ఉండదు.

కేంద్రం 2022 సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్ లో వ్యూహాత్మక పరిశ్రమలు అన్న వర్గీకరణకు తెర తీసింది. మొత్తం నాలుగు కేటగిరీలుగా పరిశ్రమలను వర్గీకరించి పారిశ్రామిక ఉత్పత్తి రంగంలో ప్రభుత్వ పాత్రను నామాత్రం స్థాయికి కుదించనున్నది. మిగిలిన వాటిని అమ్మటమో లేక మూసేయటమో చేయాలని కేంద్రం దృఢ నిర్ణయంతో ఉన్నది.

Also Read:

RELATED

Avani: ఘనంగా జయరాజు ‘అవని’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ…

Jayaraju: ప్రజా వాగ్గేయకారులు, ప్రకృతి కవి జయరాజు రచించిన "అవని" ఇంగ్లీష్ పుస్తకావిష్కరణ కార్యక్రమం శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ పుస్తకాన్ని ప్రముఖ దర్శకులు బి నర్సింగరావు,...

మతాలను రాజకీయం చేయొద్దు

మతం ఉచ్చులో బందీ అయ్యి అన్య మతస్తులను రెచ్చగొట్టే విధానాలకు స్వస్తి పలకాలి. రాజకీయ పార్టీలు, ఆధ్యాత్మిక సంస్థలు మతాలను రాజకీయం చేయొద్దు. మతం వ్యక్తిగతమని, సామూహిక మైన దైనా సమ్మతమైన జీవన విధానానికి...

KTR: ప్రధాని మోడీ గారు.. తెలంగాణ నుంచి పాఠాలు నేర్చుకోండి

● ఆవో-దేఖో-సీకో (Aao-Dhekho-Seekho) అంటూ ప్రధానమంత్రి మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ● జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి వికాసం...

కార్పొరేషన్ చైర్మన్లుగా ఆ ముగ్గురు నియామకం

రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. తెలంగాణ ఫుడ్స్ చైర్మన్‌గా మేడె రాజీవ్ సాగర్, తెలంగాణ అధికార భాషా సంఘం చైర్మన్‌గా మంత్రి శ్రీదేవి, తెలంగాణ ఉర్దూ అకాడమీ...