జాతీయం India: కొత్త వ్యవసాయక చట్టాలు - భూయజమాన్యంలో వ్యత్యాసాలు

India: కొత్త వ్యవసాయక చట్టాలు – భూయజమాన్యంలో వ్యత్యాసాలు

New Agricultural Laws:భారతదేశ ఆర్థిక వ్యవస్థ శతాబ్దాలుగా వ్యవసాయంపై ఆధారపడి ఉంది. మెరుగైన సాంకేతిక విద్య అందుబాటులోకి రావడం వలన ఈ ధోరణి సర్వీస్ బేస్డ్ ఎకానమీ వైపు మారింది. వ్యవసాయ రంగంలో ఉన్న అసమానతలను పరిష్కరించకుండానే ఈ మార్పు జరిగింది. 2010-2011 మరియు 2015-16 వ్యవసాయ గణాంకాల ప్రకారం భారతదేశంలో మొత్తం పంట విస్తీర్ణం 2011 లో దాదాపు 243M హెక్టార్ల నుండి 2016 లో 284M హెక్టార్లకు పెరిగింది. ఇదే లెక్కల ప్రకారం దేశంలోని 16.63% దళితులకు కేవలం 9% వ్యవసాయ భూమి మాత్రమే ఉంది.

దేశంలో అతి ఎక్కువ దళిత జనాభా పంజాబ్, హర్యానాలలో ఉన్నా వారికి అతి తక్కువ భూమి ఉంది. (2015-16) ఈ వాటా మెరుగుపడలేదు,దాదాపు అదే విధంగా ఉంది. మిగితా రాష్ట్రాలు కొంత మెరుగ్గా ఉన్నా 2015 – 16 లో ఈ సంఖ్య క్షీణించింది.

జమీన్ ప్రాప్తి సంఘర్స్ కమిటీ (జెడిఎస్) పంజాబ్ లో ఈ అంతరాన్ని పరిష్కరించడానికి ఏర్పడిన యూనియన్. చాలా కాలంగా ఉన్న కుల ఆధిపత్యం ఈ అంతరానికి కారణం అని యూనియన్ ప్రతినిధి గురుముఖ్ సింగ్ అన్నారు. “మాకు చెందిన భూమి ధనిక, ఉన్నత కులాల వారి దగ్గర ఉంది. వారు వ్యవస్థలో పదవుల్లో ఉన్నా ఈ వ్యత్యాసాన్ని అంతం చేయడానికి ఇష్టపడరు. 55 గ్రామాల్లో 20000 రూపాయలకు పామ్ లాల్ భూములకు వేలం వేశాం. ఇప్పుడు ప్రజలు సంయుక్తంగా వ్యవసాయం చేయగలుగుతున్నారు. భూమిలేని దళితుల కోసం కేటాయించిన మూడవ వంతు పామ్లాట్ మాములను కొన్ని ప్రదేశాలను ఆక్రమించుకుంటున్నారు.

విలేజ్ కామన్ ల్యాండ్ (రెగ్యులేషన్) నిబంధనలు, 1964 ప్రకారం, పామ్రాట్ భూములు గ్రామ పంచాయతీకి చెందినవి. పంజాబ్ గ్రామాల్లోని మూడు రకాలు సాముదాయక భూములలో షాట్ ఒకటి. పంజాబ్లో 1,70,033 ఎకరాల ఫామ్రాట్
భూమి ఉంది. దీనిని ప్రధానంగా సాగుకు ఉపయోగిస్తారు.

ప్రతి సంవత్సరం గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీ శాఖ నిర్వహిస్తున్న బహిరంగ వేలం ద్వారా దీనిని కేటాయిస్తారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామిక యూనిట్లను ఏర్పాటు చేయడానికి పంచాయతీలకు పారిశ్రామిక గృహాలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు మరియు సంస్థలకు పమ్లాల్ భూమిని విక్రయించడానికి అనుమతించే ఈ చట్టానికి 2020 జనవరిలో రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

మా కమిటీ అధ్యక్షుడిపై 32 ఎఫ్.ఐ.ర్ లు ఉన్నాయి. ఈ కమిటీలో 200 మందికి పైగా మహిళలపై కూడా ఎఫ్.ఐ.ర్
దాఖలు చేశారు. సరిహద్దుల వద్ద ఆశ్రయాలు, జెండాలతో నిరసన తెలపడానికి రైతులకు అనుమతి ఉంది. భూమిలేని రైతులు నిరసన కార్యక్రమాల నిర్వహించినప్పుడు ఈ పక్షపాతాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. ‘ అని గురుముఖ్ సింగ్ అన్నారు.

ఎక్కువగా హర్యానా, పంజాబ్ కు చెందిన రైతులు మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఎనమిది నెలలుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. Farmers’ Produce Trade ord Commerce (Promotion and Facilitation) Act. 2020; Essential Commodities (Amendment) Act, 2020 and Farmers (Empowerment and Protection) Agreement on Price Assurance మరియు Form Services Act 2020.

సాంఘిక-ఆర్థిక కుల జనాభా లెక్కల 201 ప్రకారం, చాలా రాష్ట్రాల్లోని షెడ్యూల్డ్ కుటుంబాలలో ఎక్కువ మంది సాధారణ శ్రమలో(casual labor) పాల్గొన్నారు. బిహార్, తమిళనాడు, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని 80 శాతం కుటుంబాలు సాధారణ శ్రమ నుండి తమ ప్రధాన ఆదాయాన్ని పొందుతున్నాయి. పంజాబ్, హర్యానాలో, సాధారణ శ్రమ పై ఆధారపడిచిన్న షెడ్యూల్డ్ కులాల మరియు ఎస్సీ / ఎస్టీయేతర వర్గాల (non SC/ST] కుటుంబాల వారి మధ్య ఇతర రాష్ట్రాల కంటే తేడా ఎక్కువగా ఉంది. మరోవైపు, బీహార్ మరియు తమిళనాడులో రెండు సామాజిక వర్గాలలో ఈ శ్రమలో పాల్గొంటున్నవారి శాతం అధికం.

ప్రధానంగా వ్యవసాయ కార్మికులుగా ఉన్న భూమిలేని దళితులు కూడా నిరుద్యోగానికి భయపడి నిరసనలో చేరారు. వారిని పంజాబ్ నుండి జెడిఎస్సి భారీ ఎత్తున సమీకరించింది. మరోవైపు, హర్యానాకు చెందిన భారతీయ కిసాన్ పంచాయతీ (బికెపీ), జనాన్ని సమీకరించింది.

బికెపి ప్రతినిధి సచిన్ పుస్తెలా మాట్లాడుతూ “ఇక్కడ దళితులకు భూమిలేదు. ఇది వారిలో ఆత్మనూన్యతాభావం కలిగిస్తుంది. హర్యానాలోని రైతు సంఘాలలో వారికి పెద్ద పాత్ర లేదు. ఈ విషయం గురించి ఆలోచించడానికి యూనియన్ సభ్యులలో కూడా అలాంటి అవగాహన లేదు. పంజాబ్ లో ఈ సమస్య గురించి అనేక పోరాటాలు జరిగాయి. కానీ హర్యానా ఇటువంటి ఆందోళనలకు చూడలేదు. నా లాంటి యువ సభ్యులు ఈ సమస్యను గుర్తించి దాని కోసం పనిచేయాలని కోరుకుంటారు. హర్యానా వంటి ప్రదేశంలో ఇది సవాళ్లతో కూడిన పని ఎస్సీ / ఎన్డీయేతర వర్గాల మొత్తం పంట విస్తీర్ణం 2010-2011 లో 190.034 హెక్టార్ల నుండి 2015-2016 లో 230,14M హెక్టార్లకు గణనీయంగా పెరిగింది. దేశంలో ఎస్నీల పంట విస్తీర్ణం 21.35 M హెక్టార్ల నుండి 25 M హెక్టార్లకు, ఎస్టీల పంట విస్తీర్ణం 21.85M హెక్టార్ నుండి 26.98 హెక్టార్లకు పెరిగింది.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బిఎస్పీ అధినేత మాయావతి తన పదవీకాలంలో, మొదటి నాలుగేళ్లలో భూమిలేని 2.67 లక్షల ప్రజలకు 58,000 హెక్టార్ల వ్యవసాయ భూములను పట్టాలుగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. 1.60 లక్షల మంది దళితులు ఇదే సంతకం కింద లబ్ధి పొందారు. (ఇండియన్ ఎక్ష్ప్రెస్స్ రిపోర్ట్)

మన తెలంగాణలో 15.44 శాతం (2011) దళితులు 9 శాతం భూమి మాత్రమే ఉంది. ఇటీవలే జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం కొత్త పథకాన్ని కూడా ప్రకటించింది. ప్రతి నియోజక వర్గంలో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న 100 మంది దళిత కుటుంబాలు తమ బ్యాంకు ఖాతాల్లోకి 10 లక్షలు అందుకుంటారు. దళితుల స్వాధీనంలో ఉన్న భూమిని లెక్కించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

తెలంగాణ ప్రభుత్వం 2014 లో పేద భూమిలేని దళిత మహిళలకు 3 ఎకరాల భూమిని పంపిణీ చేయడానికి దళితుల భూమి కొనుగోలు పథకాన్ని ప్రారంభించింది. భూమితో పాటు ఈ పథకం కింద సమగ్ర ప్యాకేజీ ఇవ్వబడుతుంది. ఇందులో నీటిపారుదల సౌకర్యాలు, విత్తనం సాగు వ్యయం, ఎరువులు, పురుగుమందులు, దున్నుట పంపుసెట్లు మొదలైనవి, ఒక పంట సంవత్సరానికి అదనంగా భూమి అభివృద్ధికి, తయారికి నిధులు సమకూర్చడం. నర్సరీ మరియు వ్యవసాయ పనుల్లో సాగు ఖర్చులను తగ్గించడానికి సంబంధించిన మొత్తాలు నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి బదిలీ చేయబడతాయి.

2014 మొదలుకొని ఇప్పటివరకు సుమారు 756 కోట్ల వ్యయంతో 16906 ఎకరాలను కొనుగోలు చేసి 6874 ప్రజలకు ఈ పథకం కింద భూమిని ప్రభుత్వం పంపిడి చేసింది. ఒక ఎకరానికి సగటున 4-5 లక్షలు మాత్రమే ఖర్చు చేసింది. ఈ ధరకి నాసిరకం భూమి కొనుగోలు చేసి పంచుకున్నారని గట్టిగా విమర్శలు వినిపించాయి.

కేంద్రం 2015-16 నుండి 2021-22 బడ్జెల్లో సామాజిక న్యాయం కింద సగటున 6 వేల కోట్లను కేటాయించింది.
గ్రామాల్లోని అర్హతగల ఎస్సీ కుటుంబాలు వెనుకబడిన తరగతి (కేటగిరీ-ఎ] కుటుంబాలు ,బిపిఎల్ కుటుంబాలకు ఉచిత నివాస ప్లాట్లు కేటాయించడానికి హర్యానా రాష్ట్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ గ్రామీణ బస్తీ యోజన 2008-09 ను ప్రారంభించింది. 2014 లో 464 దళిత కుటుంబాలకు 42 ఎకరాల నివాస స్థలాన్ని కేటాయించారు. వీటిలో కొన్ని ప్లాట్లను ఉన్నత కుల వర్గాల వారు ఆక్రమించారు. కేసు నమోదు చేసి 2017 లో లబ్దిదారులకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది.

అమన్ ప్రీత్… చత్రా పక్తా మంచ్ (సిబిఎం) విద్యార్థి కార్యకర్త, ఇది విద్యార్థులు ఎక్కువగా దళితులు నడుపుతున్న సంఘం. అతను హర్యానా రాష్ట్రంలో హిసార్ కు చెందినవాడు. భూమిలేని దళితులలో ఒకరు. ఆయన మాట్లాడుతూ ” హిసార్లో కుల దురాగతాలు ఇప్పటికీ జరుగుతున్నాయి. భూమి ఉన్నవాడు. లేనివాడితో ఉన్నత కులాల వారు భిన్నంగా వ్యవహరిస్తారు. ఖాప్ పంచాయతీలతో పెద్ద సంఘాల నాయకులకు సంబంధాలు ఉన్నాయి. కుగ్రామ్ భూముల నుండి భూమిని క్లెయిమ్ చేయడానికి ఉద్యమం ఏ విధమైన కృతిని తీసుకోవడానికి ఇది ఒక కారణం.

2022 అసెంబ్లీ ఎన్నికలకు SAD మరియు BSP జూన్ 5 న కూటమి గా ఏర్పడింది. ఇందులో SAD 57 సీట్లతో మరియు BSP 20 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. వ్యవసాయ చట్టాల సమస్యలపై, SAD భారతీయ జనతా పార్టీ (BJP)తో తన కూటమిని రద్దు చేసింది. SAD తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, ఒక దళితుని ఉప ముఖ్యమంత్రిగా నియమిస్తామని ఇప్పటికే పేర్కొంది.

BSP బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో కేటాయించిన సీట్లలో సుమారు మూడింట రెండు వంతులు ఉన్నాయని గురుముఖ్ సింగ్ చెప్పారు.” చాలా సమయం నుండి BSP ఈ సీట్లలో కొన్నింటిలో పోటీ చేయలేదు. ఇది పంజాబ్ లోని దళిత సమాజానికి ద్రోహం.”

BSP రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి Dr మఖన్ సింగ్ ఈ కూటమిని ‘అపవిత్రం’ అని పిలిచారు. మంత్రివర్గంలో దళిత సభ్యులు ఉంటేనే ఈ రైతుల పరిస్థితిలో మెరుగుదల ఉంటుంది. చాలా మంది ముఖ్యమైన సీనియర్ నాయకులను సంప్రదించకుండా ఈ కూటమి పడింది. SAD జాట్ల నుండి పెద్ద ఎత్తున మద్దతు ఉంది. వారు దళితులపై దౌర్జన్యాలకు పాల్పడుతారు. అలాంటిది BSP కి ఎందుకు ఓటు వేస్తారు?. అన్ని ప్రశ్నించారు.

ఈ కూటమి అనుకున్న విజయం సాధిస్తే పంజాల్ లోని ఈ పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది అనుకునే సమయం లో అదే వర్గానికి చెందిన వారు వ్యతిరేయించడం గమనార్హం.

కేరళ, గుజరాత్ మరియు బీహార్ వంటి రాష్ట్రాల భూవాట ~ 2.5% శాతం ఉంది. అయితే తక్కువ దళిత జనాభా శాతం లేదా అన్నివర్గాల వారీగా పెద్ద సంఖ్యలో ఉపాంత భూములు వంటి కారణాల వల్ల పరిగణించలేదు.

ఇండియా డేటా పోర్టల్ నుండి విజువలైజేషన్ ఉపయోగించి న్యూస్ లాంటీ మరియు ఇండియా డేటా పోర్టల్ ఫెలోషిప్ లో భాగంగా ఈ కథ వ్రాయబడింది.

ఏటికల భవానీ, రచయిత

(Etikala Bhavani)

RELATED

Avani: ఘనంగా జయరాజు ‘అవని’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ…

Jayaraju: ప్రజా వాగ్గేయకారులు, ప్రకృతి కవి జయరాజు రచించిన "అవని" ఇంగ్లీష్ పుస్తకావిష్కరణ కార్యక్రమం శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ పుస్తకాన్ని ప్రముఖ దర్శకులు బి నర్సింగరావు,...

మతాలను రాజకీయం చేయొద్దు

మతం ఉచ్చులో బందీ అయ్యి అన్య మతస్తులను రెచ్చగొట్టే విధానాలకు స్వస్తి పలకాలి. రాజకీయ పార్టీలు, ఆధ్యాత్మిక సంస్థలు మతాలను రాజకీయం చేయొద్దు. మతం వ్యక్తిగతమని, సామూహిక మైన దైనా సమ్మతమైన జీవన విధానానికి...

KTR: ప్రధాని మోడీ గారు.. తెలంగాణ నుంచి పాఠాలు నేర్చుకోండి

● ఆవో-దేఖో-సీకో (Aao-Dhekho-Seekho) అంటూ ప్రధానమంత్రి మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ● జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి వికాసం...

Avani: ఘనంగా జయరాజు ‘అవని’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ…

Jayaraju: ప్రజా వాగ్గేయకారులు, ప్రకృతి కవి జయరాజు రచించిన "అవని" ఇంగ్లీష్ పుస్తకావిష్కరణ కార్యక్రమం శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ పుస్తకాన్ని ప్రముఖ దర్శకులు బి నర్సింగరావు,...

మతాలను రాజకీయం చేయొద్దు

మతం ఉచ్చులో బందీ అయ్యి అన్య మతస్తులను రెచ్చగొట్టే విధానాలకు స్వస్తి పలకాలి. రాజకీయ పార్టీలు, ఆధ్యాత్మిక సంస్థలు మతాలను రాజకీయం చేయొద్దు. మతం వ్యక్తిగతమని, సామూహిక మైన దైనా సమ్మతమైన జీవన విధానానికి...

KTR: ప్రధాని మోడీ గారు.. తెలంగాణ నుంచి పాఠాలు నేర్చుకోండి

● ఆవో-దేఖో-సీకో (Aao-Dhekho-Seekho) అంటూ ప్రధానమంత్రి మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ● జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి వికాసం...

కార్పొరేషన్ చైర్మన్లుగా ఆ ముగ్గురు నియామకం

రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. తెలంగాణ ఫుడ్స్ చైర్మన్‌గా మేడె రాజీవ్ సాగర్, తెలంగాణ అధికార భాషా సంఘం చైర్మన్‌గా మంత్రి శ్రీదేవి, తెలంగాణ ఉర్దూ అకాడమీ...