జాతీయం Kendriya Vidyalaya: కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటా రద్దు

Kendriya Vidyalaya: కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటా రద్దు

Kendriya Vidyalaya : కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల ప్రత్యేక సీట్ల కోటాను రద్దయ్యింది. ఈ మేరకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ అన్ని విద్యాలయాలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఏటా ఒక్కో ఎంపీకి పది సీట్లు కేటాయించింది. తాజాగా ఉత్తర్వులతో ఆ కోటా పూర్తిగా రద్దయ్యింది.

పార్లమెంట్‌ సభ్యులతో పాటు ఇతర కోటాల కింద భర్తీ చేసే సీట్ల భర్తీ ప్రక్రియను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. అయితే, కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాల కోసం ఎంపీల కోటాను పెంచాలని గత కొంత కాలంగా డిమాండ్ చేస్తున్న తరుణంలో కోటా మొత్తం రద్దు చేయడం గమనార్హం. అయితే, లోక్‌సభలోనూ కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల కోటాపై చర్చ జరిగింది. అయితే, కోటాను ఎత్తి వేయాలని కొందరు.. పెంచాలని మరికొందరు కోరారు. దీంతో అన్ని రాజకీయ పార్టీలతో కలిసి చర్చించనున్నట్లు కేంద్రం ఆ సమయంలో ప్రకటించింది. ఈ విషయమై స్పీకర్‌ ఓం బిర్లా సైతం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఆదేశించారు. పది సీట్ల కోటా సరిపోదని.. దాన్ని పెంచాలని.. లేదంటే రద్దు చేయాలని కాంగ్రెస్‌ ఎంపీ మనీష్‌ తివారి డిమాండ్‌ చేశారు. అయితే, ఎంపీల కోటాను రద్దు చేసే యోచనలో ఉందని ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. ఆ సమయంలో మంత్రి నిర్ణయాన్ని పలువురు ఎంపీలు వ్యతిరేకించారు.

MP Quota Cancelled

Also Read:

పరస్పర బదిలీల్లో గందరగోళానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి – యుయస్పీసి

KTR: డిసెంబ‌ర్‌లోగా అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టిస్తాం – కేటీఆర్

RELATED

సమైక్యత లేకపోతే దేశమే అల్లకల్లోలం: జూలూరు గౌరీశంకర్

మన దేశ జాతీయ సమైక్యతను నిలుపుకోలేక పోతే దేశం అల్లకల్లోలమవుతుందని, దేశంలో అభివృద్ధి ఆగిపోతుందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రగతిశీల శక్తులు, అభ్యుదయవాదులు, సామాజికంగా...

ప్రముఖ కవి, అనువాదకులు నిజాం వేంకటేశం మృతి

Telangana: ప్రముఖ కవి, అనువాదకులు నిజాం వేంకటేశం ఈరోజు సాయంత్రం గుండెపోటుతో ఆకస్మికంగా మృతిచెందడం విషాదకరం. సిరిసిల్లకు చెందిన వెంకటేశం, విద్యుత్ శాఖలో ఎడిఈ గా ఉద్యోగ విరమణ చేశారు. గత 5...

గురుకుల డిగ్రీ కాలేజీలో మొక్కలు నాటిన వనజీవి రామయ్య

Vanajeevi Ramaiah: టీఎస్ డబ్ల్యూ ఆర్ డి సి ఖమ్మం కళాశాలలో స్వచ్ఛ గురుకులం ఐదవ రోజు కార్యక్రమంలో భాగంగా చెట్లను నాటే కార్యక్రమానికి పద్మశ్రీ వనజీవి రామయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలని...

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిని ఫైనల్ చేసిన పార్టీ హైకమాండ్..

Palvai Sravanthi: మునుగోడు బైపోల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేరుని ఆ పార్టీ హైకమాండ్ ఖరారు చేసింది. రాష్ట్ర రాజకీయాల్లో అన్ని పార్టీలకు కీలకంగా మారిన మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి పేరు బయటకు...