జాతీయం కీలకదశకు హిందూత్వం-మొదలైన పతనం దేవనూరు మహాదేవతో ఆదిత్య భరద్వాజ్ ఇంటర్వ్యూ

కీలకదశకు హిందూత్వం-మొదలైన పతనం దేవనూరు మహాదేవతో ఆదిత్య భరద్వాజ్ ఇంటర్వ్యూ


కర్నాటకలో తమను ఇబ్బందులు పెట్టడం వల్ల, ఆర్ఎస్ఎస్ పై పుస్తకం రాసేలా వారు చేరని ‘ఆర్ఎస్ఎస్ లోతుపాతులు’ రచయిత, రాజకీయ కార్యకర్త దేవనూరు మహాదేవ అంటారు.

కర్నాటక రాష్ట్ర శాసనసభకు వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. మత రాజకీయాలు ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో కన్నడ సాహిత్యంలో మేరునగధీరుడైన దేవనూరు మహాదేవ రాసిన ‘ఆర్ఎస్ఎస్ ఆల మత్తు అగల'(ఆర్ఎస్ఎస్ లోతుపాతులు) అన్న పుస్తకం ఒక పెద్ద సంచలనమైంది.
అరవైనాలుగు పేజీల ఈ పుస్తకం ఒక్క నెలలోనే లక్ష, రెండు వేల కాపీలు అమ్ముడుపోయింది.


ఆ పుస్తకంపై తనకున్న హక్కులను పాక్షికంగా ఇవ్వడంతో, కర్నాటకలోని 30 ప్రచురణ సంస్థలు దాన్ని అచ్చువేశాయి.
తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ, ఇంగ్లీషు భాషల్లోకి కూడా ఈ పుస్తకం అనుమాదమవడానికి సిద్ధమైంది.

మైసూరుకు చెందిన 74 ఏళ్ళ ఈ దళిత రచయిత తనదైన, సరళమైన చక్కని శైలిలో అద్భుత ఉమమానాలతో ఆర్ఎస్ఎస్ నాడిని పట్టుకుని, దాని ఉద్దేశ్యాలు, ఎజెండాను వివరించారు.


ఈ పుస్తకం దాని ప్రత్యర్థులను అనూహ్యంగా మేల్కొలిపి, వరుసబెట్టి ఆర్ఎస్ఎస్ అనుబంధ పత్రికల్లో నిశితంగా విమర్శిస్తూ పతాకశీర్షికన కథనాలు రాసేలా చేసింది.
ఈ ‘విద్వేషాన్ని, అబద్ధాలను’ తిప్పికొట్టడంలో తన పనిని కొనసాగిస్తాననని ఇంటర్వ్యూలో దేవనూరు స్పష్టం చేశారు.

ఆర్ఎస్ఎస్ పైన పుస్తకం రాసేలా ఏ పరిస్థితులు మిమ్మల్ని ప్రేరేపించాయి?

ఆర్ఎస్ఎస్ రెచ్చగొట్టే చర్యలు, దాని అనుబంధ సంస్థలు సృష్టించిన గందరగోళం, బీజేపీ ప్రభుత్వం సృష్టించిన ఇబ్బందులు ఈపుస్తకం రాయడానికి నన్ను పురికొల్పాయి.
ఇప్పటికీ అనేక విషయాలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి.
ఆర్థికంగా వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లు, ‘కర్నాటక ప్రొటెక్షన్ ఆఫ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ఆర్డినెన్స్-2022) వంటి మతమార్పిడులకు వ్యతిరేకంగా తెచ్చిన బిల్లు వంటి వాటి పైన సమాచారం సేకరించాను.


పాఠ్యపుస్తకాలను మార్చడంతో కర్నాటకలో మమ్మల్ని దెబ్బకొట్టింది. ఈ విషయంలో ప్రభుత్వం చాలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది.
ఆ పుస్తకాల్లో ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కె.బీ. హెగ్గేవార్ గురించి చేర్చడంపట్ల నేను అభ్యంతరాలు వ్యక్తం చేశాను.


విద్యార్థులకు అతన్ని ఎలాపరిచయం చేస్తారో నేను చర్చించదలిచాను.
ఆర్ఎస్ఎస్ ప్రాంగణంలోని చాతుర్వర్ణ ధర్మాలను హిందూ పద్దతిగా పరిచయంచేస్తామా?
పాఠ్యపుస్తకాల్లో బసవన్న ఆలోచనను నాశనం చేయడాన్ని ముఖ్యమంత్రి దృష్టికి కొందరు తీసుకువెళితే, ‘కొన్ని చిన్నచిన్న పొరపాట్లు ఉన్నాయి’ అని విద్యాశాఖ మంత్రి అంటారు.


బసవన్న ఆత్మను చంపేసి, ఆ మహానుభావుడి రూపాన్ని మాత్రం ఉంచితే, చిన్నచిన్న పొరపాట్లని ఎలా సరిదిద్దుతారు?
ఈ పరిణామాలన్నిటితో చలించిపోయి, ఈ ఉద్యమ నాడిని పట్టుకుని ఆర్ఎస్ఎస్ పైన పుస్తకం రాయాలని సిద్ధమయ్యాను.

ఆర్ఎస్ఎస్ “వెనక్కి చూసే తిరోగామి” సంస్థ అన్నారు. ఈ సంస్థ గమనం, దానిపైన మీ అభ్యంతరాలేమిటి?

ఆర్ఎస్ఎస్ మూడు స్తంభాలపైన నిలబడిందనుకుంటున్నాను; చాతుర్వర్ణ వ్యవస్థను, మనుస్మృతిని రుద్దడం, ఆర్యుల ఆధిపత్యం, పెడరలిజాన్ని నాశనం చేయడం.
ఇవ్వన్నీ భారత రాజ్యాంగాన్ని విధ్వంసం చేయడానికి దారితీసేవే.
ఆర్ఎస్ఎస్ ముద్దబిడ్డ తెచ్చిన చట్టాలతో ఈ ప్రభుత్వం వెనక్కి చూడడం కాదా?

చాతుర్వర్ణ ధర్మాన్ని ఆర్ఎస్ఎస్ ప్రతిపాదించిందంటున్నారు. ఈ రోజు శూద్రులు, దళితులు, ఆదివాసీల మద్దతు ఈ సంస్థకు ఉన్నది కదా! విస్మరణకుగురైన జాతులుగా భావిస్తున్న వీరు హిందూ సమాజాన్ని కుల వ్యతిరేక గొంతులుగా నిర్మించాలను కుంటున్నారు. దీన్ని మీరెలా చూస్తారు?

ఈ ప్రశ్నకు అంత తేలికైన సమాధానం లేదు.
పీడిత ప్రజల్లో ఒక వర్గం ఆర్ఎస్ఎస్ మాటల గారడీలో పడిపోయి, వారిబుట్టలోకి చేరిపోయిన మాట వాస్తవం.
పీడిత వర్గం తమను చేర్చుకోవడానికి మించి కోరుకోవడం లేదు.
ఆ విశ్వాసం వారిలో చిరునవ్వు మొలిపించింది అంతే.
ఈ విషాద స్థితికి ఎవరిని నిందిస్తాం?
మా అవ్వ (అమ్మమ్మ/బామ్మ) ఒక కథ చెప్పేది. మన ప్రజల్ని చంపడానికి నాలుగు తలల విషపు తలలున్న బ్రహ్మ ఉన్నాడు.
అతను మా ఊరికి వచ్చాడు.
ఒక పిల్లవాడు అతన్ని చూసి పరిగెత్తుకుంటూ బట్టలుతుకుతున్న చాకలివద్దకు వెళ్ళిపోయాడు.
తానున్న పరిస్థితిని వివరించాడు.
విషబ్రహ్మ వచ్చేసరికి ఆ పిల్లవాడు తన కొడుకని చాకలి చెప్పాడు.
ఆ చాకలి ఒక అరటి ఆకును వేసి, ఒక పక్క ఆ పిల్లవాడిని కూర్చోబెట్టి, మరొక పక్క తాను కూర్చుని ఇద్దరూ కలిసి ఒకే అరటి ఆకులో భోజనానికి ఉపక్రమించారు.
దాంతో విషబ్రహ్మ వెళ్ళిపోయాడు.
అరటిఆకు మధ్యలో ఈనెలా ఉండి, రెండుగా ఎందుకు విభజితమైందో మాఅవ్వ చెప్పింది.
కాపాడబడిన ఆ బాలుడికి మనం వారసులం.
ఈ రోజు ఈ నాలుగు తలల విషబ్రహ్మే నిజానికి నేటి చారుతుర్వర్ణం.
నిజానికి ఆ కథ వాస్తవం.
ఆర్ఎస్ఎస్ ఇవాళ తన ఎత్తుగడలను మార్చుకుని, దళితులు, ఆదివాసీలకు ఏదో కాస్త చేసినట్టు ‘చాతుర్వర్ణ’ గుప్పెట నుంచి తప్పించుకునే అవకాశాన్ని దెబ్బతీస్తోంది.
ఈ విషయాన్ని గమనించి సమాజానికి మనం తెలియచేయాలి.
అదే సమయంలో పీడుతులలో కొందరు ఆర్ఎస్ఎస్ తో చేతులు కలిపి డబ్బు, సదా సంపాదించాలనే అవకాశవాదులున్న విషయాన్ని కూడా మనం గమనించాలి.
హిందూత్వలో విస్మరించిన విషయం ఏమిటంటే, ‘హిందువులంతా ఒక్కటే’ అన్న తాత్వికత ‘ఎక్కడివారక్కడే ఉండాలి’ అనేలా చేస్తోంది.
హిందువులంతా ఒక్కటే అని మనం అంగీకరించినట్టయితే, ఈ దేశంలో అర్హత గల హిందూ ఓటర్లంతా తమకు నచ్చిన వర్ణాన్ని, కులాన్ని ఎన్నుకోవచ్చు.
కానీ, కులం అనేది పుట్టక నుంచి వచ్చింది కనుక, దానికి వ్యతిరేకంగా పోరాడాలి.

ఆర్ఎస్ఎస్ ను స్థాపించి 2025 నాటికి వంద సంవత్సరాలు పూర్తవుతుంది. తమ ఎజెండాను 2014 నుంచి ఎలా అమలు చేశారు?

మతమార్పిడుల నిరోధక బిల్లు తేవడం ద్వారా, పాఠ్యపుస్తకాలను మార్చేయడం ద్వారా, జీఎస్ టీని తేవడం ద్వారా వారు ఏం చేశారు?
వీటన్నిటిలో ఉన్న ఏక సూత్రం ఏమిటి?
ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా?
నా పుస్తకం దీన్ని వివరిస్తుంది. ఆర్ఎస్ఎస్ అక్రమాలు సక్రమాలైపోతున్నాయి.
వాటిని గమనించడం చాలా కష్టం.
దీని పైన మనం నిత్యం అప్రమత్తంగా ఉండాలి.

కర్నాటకలో హిందూత్వం పనిచేస్తుందనుకుంటున్నారా?

కర్నాటకలోని కోస్తా ప్రాంతంలో హిందూత్వం పనిచేస్తోంది.
అక్కడి ప్రజలు మతపరంగా తమ భగవంతుడి పట్ల భక్తితో ఉంటారు.
వారి అమాయక భక్తిని ఆర్ఎస్ఎస్ సొమ్ముచేసుకొంటోంది.
సమాజంలో ధర్మస్థాపన పేరుతో చాతుర్వర్ణ ధర్మాన్ని అమలు చేయడానికి వారు శాస్త్రాలను సృష్టించి, వాటిని శస్త్రాలుగా ప్రయోగించారు.
చాతుర్వర్ణాన్ని పరిరక్షించడానికి భగవంతుడిని కాపలాదారుగా ఉపయోగించుకుంటున్నారు.
ఇది పతాక స్థాయికి చేరుకుని పతనం మొదలైంది.
ఈ పుస్తకానికి వచ్చిన స్పందనచూసి నాకు అంతులేని ఆశ్చర్యం వేసింది.
నెల రోజుల్లో లక్ష, రెండు వేల కాపీలు అమ్ముడుపోయాయి.
ఈ పుస్తకానికి ముప్ఫై మందివరకు ప్రచురణ కర్తలు ముందుకు వచ్చారు.
ఈ పుస్తకాన్ని విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు తమకు తాము అచ్చువేసుకుంటున్నాయి.
తాలూకా స్థాయిలో కూడా అచ్చేసుకుంటున్నారు. ఈ పుస్తకం చాలా భాషలలోకి అనువాదమైంది.
ప్రజలు ఈ పుస్తకాన్ని తమదిగా భావిస్తున్నారు.
ఎవరికైనా సరే ఇంతకంటే ఏం కావాలి?

ఈ పుస్తకానికి అచ్చువేసే హక్కులను మీరు వదులుకుని, ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు.

నేను నా ప్రచురణ హక్కులను ఒదులుకోలేదు.
ప్రచురణకర్తలు దీని వెల 40 రూపాయలకు మించకుండా చూస్తే, నాకు రాయల్టీ ఇవ్వవలసిన అవసరం లేదు.
నాకు తెలిపాక ఎవరైనా ఈ పుస్తకాన్ని అచ్చువేసుకోవచ్చు.
ఈ పుస్తకాన్ని సమాజంలో అట్టడుగు వ్యక్తికి కూడా అందేలా చేయడమే నా ఉద్దేశ్యం.

అనువాదం : రాఘవశర్మ
‘ద
హిందూ‘ సౌజన్యంతో

Also Read:

RELATED

నీతి ఆయోగ్ ఒక నిరర్ధక సంస్థగా మారిపోయింది.. కేసీఆర్ ఆవేదన

నీతి ఆయోగ్ ఏర్పాటు చేసినప్పడు భారత్‌కు మంచి రోజులు వచ్చాయని తాను ఎంతో సంతోషించానని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్...

రేపటి నీతి ఆయోగ్‌ సమావేశాన్ని నేను బహిష్కరిస్తున్నా – సీఎం కేసీఆర్‌

రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. శనివారం ఆయన ప్రగతిభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నిర్ణయం చాలా బాధాకరమే...

ఆసియా ఖండంలోనే అరుదైన పోలీస్ భవనం

ఈ ఫోటోలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? మైక్రోసాఫ్ట్ లేదా అమెజాన్, టిసిఎస్, ఇన్ఫోసిస్, యాక్సెంచర్ లాంటి దిగ్గజాసంస్థలు తమ ప్రధాన కార్యాలయాన్ని నిర్మిస్తున్నట్లు అనిపించడంలేదూ? అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే....

నీతి ఆయోగ్ ఒక నిరర్ధక సంస్థగా మారిపోయింది.. కేసీఆర్ ఆవేదన

నీతి ఆయోగ్ ఏర్పాటు చేసినప్పడు భారత్‌కు మంచి రోజులు వచ్చాయని తాను ఎంతో సంతోషించానని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్...

రేపటి నీతి ఆయోగ్‌ సమావేశాన్ని నేను బహిష్కరిస్తున్నా – సీఎం కేసీఆర్‌

రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. శనివారం ఆయన ప్రగతిభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నిర్ణయం చాలా బాధాకరమే...

ఆసియా ఖండంలోనే అరుదైన పోలీస్ భవనం

ఈ ఫోటోలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? మైక్రోసాఫ్ట్ లేదా అమెజాన్, టిసిఎస్, ఇన్ఫోసిస్, యాక్సెంచర్ లాంటి దిగ్గజాసంస్థలు తమ ప్రధాన కార్యాలయాన్ని నిర్మిస్తున్నట్లు అనిపించడంలేదూ? అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే....

నమ్మకద్రోహానికి వారసుడు రాజగోపాల్ రెడ్డి…

• కాంగ్రెస్ ను కాపాడుతున్నదే రేవంత్ రెడ్డి : టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షతో మునుగోడు ఎమ్మెల్యే అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. నేడు...