జాతీయం మతాలను రాజకీయం చేయొద్దు

మతాలను రాజకీయం చేయొద్దు

మతం ఉచ్చులో బందీ అయ్యి అన్య మతస్తులను రెచ్చగొట్టే విధానాలకు స్వస్తి పలకాలి. రాజకీయ పార్టీలు, ఆధ్యాత్మిక సంస్థలు మతాలను రాజకీయం చేయొద్దు.

మతం వ్యక్తిగతమని, సామూహిక మైన దైనా సమ్మతమైన జీవన విధానానికి సంబంధించిన అంశమని జీవితంలో ప్రధాన అంశంగా వ్యవస్థను హెచ్చరించే విధంగా మతం ఉండకూడదని అనేకమంది మతాలకు సంబంధించి పలు నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. మతాన్ని అధికంగా చూపెట్టి జీవితం అంటేనే మతమనే ధోరణి లో మతం ప్రాధాన్యతను విస్తృత పరచి సున్నితమైన అంశంగా చిత్రీకరించి ఆ ముసుగులో జరుగుతున్న అరాచకాలు అకృత్యాలను చూసి సంతోషించే వారు కూడా లేకపోలేదు. మతమే పలు సందర్భాలలో ఇబ్బందులకు, ఘర్షణలకు, సంక్లిష్టత లకు దారి తీస్తున్న నేపథ్యంలో తమ మతమే గొప్పది అని మతతత్వాన్ని పెంచి పోషించే వాళ్లు ఈ వ్యవస్థకు మరింత ప్రమాదకారు లు.

మతం ఉచ్చులో బందీ కావద్దు- మతతత్వాన్ని రెచ్చగొట్టొద్దు: సమాజంలో విభిన్న కోణాలు, పలు సంఘర్షణలు, భిన్న ధ్రువాలు, సామాజిక ఆర్థిక చారిత్రక రాజకీయ పరిస్థితులు మానవ జీవితాన్ని అతలాకుతలం చేస్తున్న సందర్భంలో ఈ పరిస్థితుల నుండి బయట పడడానికి మెరుగైన సమాజ నిర్మాణం కొరకు ఆలోచించ వలసిన బాధ్యత ప్రతి పౌరుని పై ఉన్నది. అంతరాలు, అసమానతలు, వివక్షత ఒకవైపు తాండవిస్తుంటే మరొకవైపు రాజకీయ ప్రాబల్యం, ఆధిపత్య ధోరణులు, బెదిరించే పాలకుల కారణంగా ప్రజాస్వామిక వ్యవస్థ కూడా తన ఉనికిని క్రమక్రమంగా కోల్పోతున్నది. ఈ సందర్భంలో మతం ప్రాతిపదికగా కొన్ని పార్టీలు, మానవ విశ్వాసాల నేపథ్యంలో మరికొన్ని పార్టీలు, మానవ జీవితానికి సంబంధం లేకుండా వ్యవస్థను ప్రస్తావించకుండా యాంత్రికంగా కొనసాగుతున్న కొన్ని పార్టీలు దేశంలో కొనసాగుతుండడాన్ని గమనించవచ్చు. అలాంటప్పుడు ఈ పార్టీలు ఎవరి లక్ష్యం కోసం, ఏ సామాజిక ప్రయోజనం కోసం పని చేస్తాయో అర్థమైపోతుంది కదా!

సున్నితమైన మతాన్ని రాజకీయాలలో చొప్పించి, విశ్వాసాల ప్రాతిపదికన ప్రజల మనసులు గెలవడానికి, ఎన్నికల్లో ఓట్లు సాధించడానికి, ఏకం చేయడానికి కొన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్న సందర్భంలో కొన్ని రాజకీయ పార్టీల నాయకులు చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇతర మతాలకు చెందిన వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంటున్నాయి. ఈ సందర్భంలోనే ఇటీవలికాలంలో పరస్పర ఘర్షణలు, దాడులు, హత్యలు కొనసాగుతున్న నేపథ్యంలో భారత దేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా మత విషయంలో అనవసరపు వ్యాఖ్యలు చేసి ప్రజా జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తే ఆ పార్టీలను నాయకులను కార్యకర్తలను బాధ్యులను చేస్తూ హెచ్చరించినట్లు గా తెలుస్తున్నది. రాజకీయ పార్టీల దూకుడుకు కళ్లెం వేయడానికి న్యాయవ్యవస్థ ఉక్కు పాదం మోపితే తప్ప మతం పేరు చెప్పుకొని జీవితాలను చిన్నాభిన్నం చేసే వారిని అడ్డుకోలేం. ఎందుకంటే వివిధ రాజకీయ పార్టీలు పాలకులలో అంతర్భాగమే కనుక మెరుగైన సామాజిక పరిస్థితుల కంటే తమ స్వార్థం కోసం మాత్రమే అధికంగా పని చేస్తాయి. ఆ కారణంగానే ఇటీవల పాలకపక్షానికి చెందిన టువంటి వాళ్లు చేసిన వ్యాఖ్యలు పెను దుమారాని కి దారితీయగా వారిని పార్టీ నుంచి బహిష్కరించిన విషయం మనందరికీ తెలిసినదే. ఇదే క్రమంలో మరి కొన్ని మత సంస్థల అభిప్రాయాలు, విశ్వాసాలు, హెచ్చరికలను ప్రస్తావించిన కారణంగా కొంతమంది ఇటీవలికాలంలో దాడులకు హత్యలకు గురవుతున్న విషయాన్ని కూడా కాదనలేము.

ఈ అరాచక విధానాలకు స్వస్తి పలికి రాజకీయ పార్టీలు ప్రజల కోసమే పనిచేస్తాయి అనే వాస్తవాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఆ పార్టీ ల పైన ఎంతగానో ఉన్నది. మతవిశ్వాసాలు వ్యక్తిగతంగానే భావించాలి తప్ప సామూహికంగా అతిగా చేసి చూపించడం వలన ఈ అరాచకాలు జరగడానికి కారణం అవుతున్నది. మతం కంటే జీవితం, వ్యక్తిగత జీవితాల కంటే సామాజిక ప్రయోజనం, సామాజిక ప్రయోజనం లో భాగంగా దేశ సమైక్యత అభివృద్ధి, సమ సమాజ నిర్మాణం ఒకటి కొంటే మరొకటి ఎక్కువగా భావించినప్పుడు మాత్రమే అల్లర్లకు తావులేని అరాచకాలకు అడ్రస్ లేని భారతదేశాన్ని చూడగలము. పాలకులు, ప్రముఖ రాజకీయ పార్టీల నాయకులు పరస్పరం రెచ్చగొట్టు కోవడానికి అలవాటుపడుతున్న నేటి కాలంలో శాంతియుత సమాజాన్ని ఆవిష్కరించడం గగనమే అవుతున్నది.

ఆధ్యాత్మిక సంస్థలు రాజకీయ పార్టీలు మతానికి అతీతంగా మానవతా విలువలకు పెద్దపీట వేయాలి:-మానవతా విలువలకు తిలోదకాలు ఇస్తూ, హత్యా రాజకీయాలకు పాల్పడుతూ, దాడులు,హెచ్చరికలకు వంతపాడుతున్న రాజకీయ పార్టీలు ఆధ్యాత్మిక మత సంస్థలు తమ విధానాన్ని మార్చుకోవాలి. లౌకికతత్వం భారత ప్రజానీకంలో అంతర్భాగము కావాలని మత ప్రస్తావన లేని మత ప్రసక్తి లేని రాజ్యాలు భారతదేశంలో కొనసాగాలని రాజ్యాంగము ఆశిస్తే ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టే పనులకు పాల్పడుతున్న కారణంగా రాజకీయ పార్టీల లక్ష్యం దెబ్బతింటున్నది. సామాజిక, ఆర్థిక, చారిత్రక , రాజకీయ లక్ష్యాల సాధనలో ముందు ఉండవలసిన రాజకీయ పార్టీలు ప్రజల విశ్వాసాల పునాదులపై మానవతావాదాన్ని పెంచి పోషించ విధంగా వ్యవహరించవలసిన మత సంస్థలు మతతత్వానికి పాల్పడుతున్న కారణంగా ప్రజలు నిలువునా చీలిపోయి వైరి వర్గాలు ఏర్పడుతున్నాయి.

సంస్కృతి సంప్రదాయాలను గౌరవించి, మానవ సంబంధాలను బలోపేతం చేసే దిశగా ఈ వ్యవస్థను తీర్చిదిద్దాల్సిన సాంస్కృతిక సంస్థలు కూడా మతం ముసుగులో స్వార్ధపు ఆలోచనల ఉచ్చులో chikli నిరంతరం ఏదో ఒక మూలన విద్వేష అగ్ని రగులుతున్నది. ఈ సందర్భంలో ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు విస్మరిస్తున్న సామాజిక బాధ్యత అయిన ప్రజల ఐక్యతను సంక్షేమం అభివృద్ధిని దృష్టిలో ఉంచుకోవలసిన బాధ్యత ప్రస్తుతము కేవలం న్యాయ వ్యవస్థ పైననే అధికంగా ఉన్నది. ఆ కారణంగానే మతం పేరుతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు మనోభావాలను దెబ్బతీసే ప్రకటనలకు పాల్పడిన వారిని ఎంతటివారినైనా శిక్షించ గల సామర్థ్యం నిబద్ధత పోలీసు యంత్రాంగం లో ఉండాలి. ఆ పరిశీలన ప్రజల పక్షాన కొనసాగినట్లు అయితేనే సత్వర చర్యలకు న్యాయవ్యవస్థకు సిఫారసు చేసే అవకాశం ఉంటుంది. ఇక రాజ్యాంగబద్ధంగా పాలన కొనసాగిస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్న కారణంగా చట్టాన్ని ప్రయోగించి, న్యాయాన్ని ఆశించి, రాజకీయ ప్రయోజనాన్ని కోరే విధంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకుండా పోయినది.


ఎదిరించే వారు లేకుంటే బెదిరించే వాడిదే పాలన అవుతుంది అనే సామెత.. ప్రశ్నించే వారు లేకుంటే యజమానులుగా బ్రతక వలసినది పోయి బానిసలా బతికే దుస్థితి దాపురిస్తోంది అన్న అంబేద్కర్ వ్యాఖ్యలను…. ప్రజలు నిరంతరం ఆకళింపు చేసుకుంటూ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై అదే సందర్భంలో దేశంలో కొనసాగుతున్న మతతత్వ విధానాలపైన ఉమ్మడిగా ప్రతిఘటన ఉద్యమాలు రావలసిన అవసరం ఉన్నది. రాజకీయ పార్టీలలో ప్రక్షాళన, తమ సామాజిక ధర్మాన్ని గుర్తించడం ఎంత ముఖ్యమో మతాన్ని పరిమితం చేయడం ద్వారా విశాల వేదికపైన మానవ జీవితాన్ని నిర్వచించి నిర్వహించగలిగే నూతన ఆలోచనలకు ఊపిరి పోయాల్సిన అవసరం ఈ దేశంలో ఎంతో ఉన్నది. ఈ క్రమంలో న్యాయవ్యవస్థ కేవలం నేరస్తులను శిక్షించడమే కాకుండా రాజకీయ పార్టీలు ఆధ్యాత్మిక సంస్థల తప్పుడు నిర్ణయాలను ఎప్పటికప్పుడు ఖండిస్తే తప్ప మరింత మెరుగైన సమాజాన్ని చూడలేము. తోటి మనిషిని సాటి మనిషిగా చూడగలిగి, సహన తత్వం మానవత్వం గా పరిమలించినప్పుడు మతాని కంటే మానవత్వమే ఉన్నతమైన ఆశయంగా మన ముందు నిలబడుతుంది. గెలిచి తీరుతుంది. అందుకే ప్రతి వ్యక్తి కూడా మా మతం మానవత్వం… మా కులం మంచితనం…. అనే నినాదంతో ముందుకు వెళ్లడం ద్వారా కులమతాల కుళ్ళును కడిగే ఆస్కారం ఎక్కువగా ఉన్నది. అప్పుడు మాత్రమే సామాన్యులు, అమాయకులు సమిధలు అవుతున్న దుష్ట సంఘటనలకు చరమగీతం పాడవచ్చు.


వడ్డేపల్లి మల్లేశము, 9014206412
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ (చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

Also read:


RELATED

నీతి ఆయోగ్ ఒక నిరర్ధక సంస్థగా మారిపోయింది.. కేసీఆర్ ఆవేదన

నీతి ఆయోగ్ ఏర్పాటు చేసినప్పడు భారత్‌కు మంచి రోజులు వచ్చాయని తాను ఎంతో సంతోషించానని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్...

రేపటి నీతి ఆయోగ్‌ సమావేశాన్ని నేను బహిష్కరిస్తున్నా – సీఎం కేసీఆర్‌

రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. శనివారం ఆయన ప్రగతిభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నిర్ణయం చాలా బాధాకరమే...

ఆసియా ఖండంలోనే అరుదైన పోలీస్ భవనం

ఈ ఫోటోలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? మైక్రోసాఫ్ట్ లేదా అమెజాన్, టిసిఎస్, ఇన్ఫోసిస్, యాక్సెంచర్ లాంటి దిగ్గజాసంస్థలు తమ ప్రధాన కార్యాలయాన్ని నిర్మిస్తున్నట్లు అనిపించడంలేదూ? అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే....

నీతి ఆయోగ్ ఒక నిరర్ధక సంస్థగా మారిపోయింది.. కేసీఆర్ ఆవేదన

నీతి ఆయోగ్ ఏర్పాటు చేసినప్పడు భారత్‌కు మంచి రోజులు వచ్చాయని తాను ఎంతో సంతోషించానని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్...

రేపటి నీతి ఆయోగ్‌ సమావేశాన్ని నేను బహిష్కరిస్తున్నా – సీఎం కేసీఆర్‌

రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. శనివారం ఆయన ప్రగతిభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నిర్ణయం చాలా బాధాకరమే...

ఆసియా ఖండంలోనే అరుదైన పోలీస్ భవనం

ఈ ఫోటోలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? మైక్రోసాఫ్ట్ లేదా అమెజాన్, టిసిఎస్, ఇన్ఫోసిస్, యాక్సెంచర్ లాంటి దిగ్గజాసంస్థలు తమ ప్రధాన కార్యాలయాన్ని నిర్మిస్తున్నట్లు అనిపించడంలేదూ? అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే....

నమ్మకద్రోహానికి వారసుడు రాజగోపాల్ రెడ్డి…

• కాంగ్రెస్ ను కాపాడుతున్నదే రేవంత్ రెడ్డి : టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షతో మునుగోడు ఎమ్మెల్యే అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. నేడు...