వినియోగదారులకు భారీ షాక్: మళ్లీ పెరిగిన సిలిండర్​ ధర

0
217

Gas Cylinder Price Hike: వంటింట్లో గ్యాస్‌ బండ సామాన్యుల గుండెల్లో గుదిబండలా మారింది. ఓవైపు పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసరాల ధరలు మోత మోగుతుంటే గృహ వినియోగ సిలిండర్‌ ధరను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. 14.2 కేజీల ఎల్​పీజీ సిలిండర్‌ ధరను రూ.50 పెంచాయి. పెంచిన ధరలు శనివారమే అమల్లోకి వచ్చాయి. దీంతో దిల్లీలో సిలిండర్​ ధర రూ.999.50కి చేరింది. హైదరాబాద్‌ లో 14 కేజీల సిలిండర్‌ ధర రూ.1052కి చేరింది.

కొద్ది రోజుల క్రితమే వాణిజ్య సిలిండర్​ ధరను చమురు సంస్థలు పెంచాయి. మే 1న 19 కిలోల వాణిజ్య సిలిండర్​ ధరను రూ.102.50 పెంచటం వల్ల ఢిల్లీ లో రూ.2253గా ఉన్న గ్యాస్​ బండ రూ.2355.50కి చేరింది. 5 కిలోల ఎల్​పీజీ సిలిండర్​ ధరను రూ.655కు పెంచారు. ఈ నెల 1న పెరిగిన ధరతో హైదరాబాద్‌లో వాణిజ్య సిలిండర్‌ ధర రూ.2,460 నుంచి 2,563.50కి చేరింది. మార్చిలోనూ సిలిండర్‌పై రూ.105 పెంచారు. దీంతో చిరువ్యాపారులు, హోటల్‌ యజమానులపై భారం పడింది. నెలకు ఐదు సిలిండర్లు వినియోగిస్తే రూ.3,000 వరకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది.

Also Read…

TS News: తెరాస రిమోట్‌ భాజపా చేతిలో ఉంది -రాహుల్‌ గాంధీ

Mohan Juneja: ‘కేజీఎఫ్’ నటుడు మోహ‌న్ జునేజా మృతి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here