తెలుగడ్డా ప్రత్యేకం: ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ మార్గంలో భారత జీవిత బీమా సంస్థ వాటాలు అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు, అధికారులు, ఇతర సిబ్బంది గత కొంత కాలంగా ఆందోళన చేస్తున్నారు. ఈ సమయంలో కేంద్రం ఎల్ఐసిలో 20 శాతం వాటాలు విదేశీ సంస్థలకు అమ్మాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర కేబినేట్ నిర్ణయం చేసింది. ఆ నిర్ణయాన్ని అనుసరించి పరిశ్రమలు, దేశీయ వాణిజ్య శాఖ మార్చి 14న ఎల్ఐసిలో విదేశీ పెట్టుబడులకు అవకాశం ఇస్తూ నియమ నిబంధనలు మార్చింది. తదనుగుణంగా విదేశీ మార్కెట్ లో ఎల్ఐసి వాటాల అమ్మకానికి రంగం సిద్ధం చేస్తోంది.
తాజాగా విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) లో మార్పులు చేసి ఆటోమాటిక్ రూట్ లో విదేశీ పెట్టుబడులు ఎల్ఐసిలో వాటాలు కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ద్వారా ఎల్ఐసిపై అంతర జాతీయ ద్రవ్యపెట్టుబడి పట్టు, అజమాయిషీ పెరిగేందుకు కేంద్రం ప్రభుత్వం మార్గం సిద్దం చేసింది.
దేశీయ ద్రవ సంస్థలు కానీ అంతర్జాతీయ ద్రవ్య సంస్థలు కానీ ఎల్ఐసిలో తమ వాటా ధనం విలువ పెంచుకోవడం పైనే ఆసక్తి కలిగి ఉంటారన్నది వాస్తవం. జాతీయ ఆర్ధిక వ్యవస్థలో సామాజిక ఆర్థిక లక్ష్యాల సాధనలో ఎల్ఐసి పోషించే పాత్ర గురించి వీరికి ఆసక్తి ఉండదు.
Also Read…