నోయెల్‌ హార్పర్‌: సంఘం పెట్టుకునే హక్కుపై గొడ్డలి పెట్టు

0
89
  • జస్టిస్‌ ఎ.ఎం ఖాన్విల్కర్‌ తీర్పుల విశ్లేషణ – మూడో భాగం

Justice AM Khanwilkar: విదేశీ నిధుల స్వీకరణ నియంత్రణ చట్టం 2022కు ప్రభుత్వం చేసిన సవరణలన్నీ చట్టబద్దమైనవేనని ఏప్రిల్‌ 2022లో జస్టిస్‌ ఖాన్విల్కర్‌ ఓ తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు గతంలో రష్యా రూపొందించిన చట్టాల తరహాలో ప్రభుత్వేతర సంస్థలు పని చేయటాన్ని దాదాపు అసాధ్యం చేసేలా ఎలా ఉందో ఆ తీర్పు వచ్చినప్పుడే వివరంగా ప్రస్తావించాను. ప్రస్తుతం ఆ వివరాల జోలికి వెళ్లటం లేదు. ఈ తీర్పుకు సంబంధించి కొన్ని మౌలికమైన అంశాలను చర్చకు పెడుతున్నాను.

నోయెల్‌ హార్పర్‌ కేసుపై వాదనలు జరుగుతున్నప్పుడు పలు హైకోర్టుల్లో విదేశీ నిధుల స్వీకరణకు సంబంధించిన చట్టంపై వ్యాజ్యాలు పెండిరగ్‌లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం విధించిన అనేక పరిమితుల్లో కొన్ని పరిమితులను మాత్రమే నోయెల్‌ హార్పర్‌ కేసు చర్చకు తెచ్చింది. సాధారణంగా హైకోర్టులను బైపాస్‌ చేయకూడదని పదే పదే గుర్తు చేసే సుప్రీం కోర్టు పాలక పక్షం తనదైన ఉద్దేశ్యాలతో తీసుకొచ్చిన చట్టం విషయానికి వచ్చేసరికి అటువంటి మంచీ మర్యాదలన్నీ గాలికొదిలేయవచ్చని స్పష్టం చేసింది. ఈ కేసు విషయంలో జస్టిస్‌ ఖాన్విల్కర్‌ నాయకత్వంలోని ధర్మాసనం ఎఫ్‌సిఆర్‌ఎ చట్టం రాజ్యంగబద్ధమా కాదా అన్న అంశంపై వివిధ హైకోర్టుల్లో పెండిరగ్‌లో ఉన్న పిటిషన్లపై తీర్పులు వెలువడక ముందే మొత్తం వ్యవహారాన్నీ తన చేతుల్లోకి తీసుకొంది. తద్వారా హైకోర్టుల స్వయంప్రతిపత్తిని విఘాతం కలిగించే చర్యలకు పాల్పడిరది.

ఈ తీర్పులో ఉన్న రెండో ముఖ్యమైన విషయం ఏమిటంటే న్యాయస్థానం ప్రభుత్వానికి ఓ ప్రమాణాన్ని, పిటిషనర్లకు మరో ప్రమాణాన్నీ పాటించవచ్చని చెప్పింది. అంటే ప్రభుత్వం చేస్తున్న వాదనల్లో వాస్తవావస్తవాలు పరిశీలించకుండా తరచి చూడకుండానే వాటిని సత్యాలు భావించి ఆ ప్రాతిపదికన మొత్తం విచారణ సాగించటం అన్నది న్యాయతాత్వికత పునాది సూత్రాల్లో ఒకటైన ప్రపోర్షనాలిటీ సూత్రాన్ని తుంగలో తొక్కుతుంది. దాంతో పిటిషన్‌దారుల పట్ల పూర్తి అపనమ్మకం అనుమానంతో వాదనలు మొదలవుతున్నాయి. ఈ తీర్పు వచ్చినప్పుడు రాసిన విశ్లేషణలో నేను ‘‘కేసులో చర్చించాల్సిన అంశాలను రూపొందించేటప్పుడే రాజ్యానికి అనుకూలంగా న్యాయస్థానం వ్యవహరించింది. ప్రజల దృక్కోణం పట్ల విముఖతతో చర్చ మొదలు పెట్టింది. ఈవిధంగా చర్చను మొదలు పెట్టిన తర్వాత ప్రభుత్వం వాదనలను యథాతథంగా స్వీకరించింది.

అదే వెసులుబాటు అర్జీదారుల వాదనల విషయంలో మాత్రం కనిపించలేదు. అనంతరం ప్రస్తుత చట్టంలో ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న అంశాలను స్వీకరించి ప్రతికూలంగా లేదా పిటిషన్‌దారులకు అనుకూలంగా ఉన్న అంశాల గురించి పొరపాటు వ్యాఖ్యానానికి పాల్పడటంతో మొత్తం కేసు పక్కదారి పట్టింది. వాదనల్లో నిగ్గు తేల్చాల్సిన అంశాన్ని ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ధారించటం, ప్రభుత్వం ముందుకు తెచ్చిన వాదనలను బేషరతుగా అంగీకరించటం, చివరకు ప్రభుత్వానికి అనకూలంగా ఉన్న అంశాలపై ఆధారపడటంతో మొత్తంగానే ఏ ప్రభుత్వాధికారాన్ని సవాలు చేస్తున్నారో అదే ప్రభుత్వాధికారం చట్టబద్దమైనదని కోర్టు తేల్చింది. దాంతో ప్రభుత్వం చేస్తున్న తప్పులను కఠినమైన న్యాయసమీక్ష దుర్భిణీతో చూడాలన్న సూత్రానికి తిలోదకాలిచ్చింది.’’ అని చెప్పాను.

నిజానికి ఖాన్విల్కర్‌ ఇచ్చిన తీర్పులన్నీ పరిశీలించే మనకు కనిపించేది ఇదే ధోరణి. ఈ కేసులో ఖాన్విల్కర్‌ తీసుకున్న వైఖరిలో ఉన్న మరో ప్రమాదం ఏమిటంటే (సంఘం పెట్టుకుని సంఘ కార్యకలాపాలు స్వతంత్రంగా నిర్వర్తించే స్వేఛ్చకు భంగం కలిగించటంతో పాటు) న్యాయస్థానమే ఓ సైద్ధాంతిక ప్రాతిపదికను ఆధారం చేసుకుని ఈ కేసులు వినటం ప్రారంభించింది. ఇంకా పచ్చిగా చెప్పాలంటే పాలకపక్ష భావజాలనికి అనుగుణంగా అనుకూలంగా తీర్పులివ్వటం ఖాన్విల్కర్‌ తీర్పుల్లో కనిపించే ప్రమాదకరమైన ధోరణి. లక్షణం. ఈ తీర్పులోనే న్యాయమూర్తి
‘‘అభివృద్ధి చెందిన దేశాలు కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలు కానీ తమతమ అభివృద్ధి ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి విదేశీ నిధులపై ఎందుకు ఆధారపడుతున్నాయి’’అని ప్రశ్నిస్తారు.
అంతేకాదు.

‘‘ ఏ దేశపు ఆకాంక్షలైనా విదేశీ చందాలపై ఆధారపడి నెరవేర్చుకోవటం అసాధ్యమన్నది నిస్సందేహం. ఆయా దేశాల ప్రజలే తమ ఆకాంక్షలు నెరవేర్చుకునేందుకు కంకణం కట్టుకోవాలి’’ అని ఉపదేశిస్తారు. ఇంకా తీర్పు ద్వారా తన వాదన వినిపిస్తూ న్యాయమూర్తి ఖాన్విల్కర్‌ ‘‘మన దేశంలో దాతలకు కరువులేదు’’ అంటారు.
ఇవన్నీ మనం పదే పదే విన్న మాటలు. ప్రపంచ వ్యాప్తంగా ఏలుబడి సాగిస్తున్న నిరంకుశ పాలకుల నోట నుండి జాలువారే మాటలే ఇవి. పౌరసమాజం, ప్రభుత్వేతర సంస్థలును అణచివేయాలనుకున్నప్పుడు పాలకులు మాట్లాడే మాటలే ఇవి. వీటిలో ఏ ఒక్క నిర్ధారణకూ న్యాయం, చట్టం, న్యాయతర్కం, రాజ్యాంగం, రాజ్యాంగపరమైన వివాదాలపై విచారణలతో సంబంధం లేదు.

అయినా ఈ ఉపదేశాలన్నీ ప్రభుత్వేతర సంస్థలకు అందే నిధులకు గండికొట్టం ద్వారా సంఘాలు పెట్టుకుని నడుపుకునేందుకు రాజ్యాంగం ఇచ్చిన స్వేఛ్చకు కేంద్ర ప్రభుత్వం విఘాతం కలిగిస్తుందా లేదా అన్న రాజ్యాంగపరమైన ప్రశ్నకు సుప్రీం కోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పులో చేరిపోయాయి. నిజానికి ఈ తీర్పు రాజ్యాంగపరమైన కోణాన్ని నిర్ధారించటానికి బదులు పక్షపాతంతో కూడిన పాలకపక్షపు అభిప్రాయాలకు పెద్ద పీట వేసి తమతమ సంస్థలను నడుపుకోవటానికి నిధులు సమీకరించుకునే ప్రయత్నంలో ఉన్న వ్యక్తులు సంస్థల చేతులు కట్టేసింది. పైగా మీ హక్కులు మీకు కావాలంటే కృతనిశ్చయంతో ధృడంగా ఉండాలని ఉపదేశించింది. ఇదేదో కార్యనిర్వాహకవర్గంగా మారిన న్యాయస్థానం మాటలు కాదు. కార్యనిర్వాహకవర్గపు ప్రతినిధిగా మారిన న్యాయస్థానం నుండి మాత్రమే వచ్చే మాటలు.

Also Read…

మనీలాండరింగ్‌ నియంత్రణ చట్టం: వ్యక్తిగత స్వేఛ్చపై మరో శరాఘాతం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here