ప్రియమైన ప్రజలారా, ప్రజాస్వామిక వాదులారా, పాలకులారా!
ప్రపంచ దేశాలలో ఫాసిజమ్ అమలు చేసిన పాలకులలో శ్రీలంక పాలకుడు రాజపక్సే కూడ ఒకరు.తాము పుట్టి పెరిగిన గడ్డ మీద తామునమ్మిన విశ్వాసాలతో స్వేచ్చ గా బతుకుతామని, తమజాతి ని తామే పాలించు కుంటామని ఆత్మగౌరవముతొ జీవిస్తామని గిరిగీసి నిలబడ్డ తమిళ జాతిని ప్రపంచ ప్రజల నిరసనల మద్య అత్యంత మూర్ఖముగా నిర్మూలనకు నాయకత్వము వహించిన దుర్మార్గుడు. లక్షలాదీ తమిళ ప్రజలను, వారి ఆకాంక్షలకు నాయకత్వము వహించిన ఉద్యమాన్ని ఊచకోత కోసిన ఈ రాజపక్సే అడాల్ఫ్ హిట్లర్, ముస్సొలిణ్ వారసుడు. శ్రీలంక తరుపున ప్రపంచ వ్యాప్తంగ అప్పు చేసి, విపరీత అవినీతికి పాల్పడీ,అందిన కాడికి ప్రజాదనము దోచుకొని,తన కుటుంబాన్ని ప్రజాఉద్యమ అణచివేతకు వదిలిన చరిత్ర హీనూడు.
నేడు శ్రీలంక లొ నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదల,ప్రజల కనీసవసర వస్తువుల కొరత,పీడితప్రజలు బతుకలెని పరిస్తితులు కల్పించిన రాజపక్సే ప్రభుత్వాన్ని వ్యతిరెఖిస్తూ, శ్రీలంక పీడీత ప్రజల నాయకత్వములో ఎర్రజెండ వెంట పడితే ప్రాణ భయముతొ రాజప్రసాదము వదిలి తను,తన కుటు౦బాలతొ దాక్కున్న ఫొటో ఇది. ప్రపంచ వ్యాప్తంగ పాలకుల జెబుల్లొకి వెళ్లిన,వెల్లు తున్నప్రజాదనము,వారి హోద,వారి అవినీతి సంపద,వారి రక్షణ వలయము ఇటువంటి క్షణాలలో వారితోఉండవనిగమనించి,ప్రజలవిశ్వాసాన్నివమ్ముచేయకుండ,చట్టబద్ద ,రాజ్యంగ బద్ద ప్రజాస్వామిక,అవినీతి రహిత పాలన ప్రజలకు అందించాలి.
-కన్వినర్స్ కమిటి, తెలంగాణప్రజస్వామిక వేదిక
Also Read