RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సారథ్యంలోని మానిటరీ పాలసీ కమిటీ(MPC) సమావేశం అయ్యింది. పాలసీ రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచి, 4.40%కి తీసుకువెళ్లినట్లు శక్తికాంత దాస్ తెలిపారు. ఏప్రిల్లో ప్రపంచ ద్రవ్యోల్బణం ఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నామని, ఆర్బిఐ విధాన చర్యలు ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి మరియు వృద్ధిని కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు.
భారత ఆర్థిక వ్యవస్థ పై ఉక్రేయిన్ యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉందని ఆర్బిఐ గవర్నర్ తెలిపారు. వడ్డీ రేట్లు 40 బేసిస్ పాయింట్లు పెంపుతో ఆర్బీఐ నిర్ణయంతో స్టాక్ మార్కట్లు భారీగా పతనమయ్యాయి. 900 పాయింట్లకు పైగా సెన్సెక్స్ నష్టపోగా, 300 పాయింట్లకు పైగా నిఫ్టీ నష్టపోయింది.
Also Read:
Rain in Telangana: తెలంగాణ లో భారీ వర్షం.. ఈదురుగాలుల బీభత్సం..!