సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార ప్రదానోత్సవం సందర్బంగా కలకత్తాలో ఆదివారం భారతీయ భాషల్లో బాల సాహిత్య సదస్సు జరిగింది.ప్రొఫెసర్ సంయుక్త సేన్ గుప్త అధ్యక్షతన జరిగిన తొలి సమావేశంలో బంగ్లా బాల సాహితీవేత్త దీపాన్వితా రాయ్, ఇంగ్లీష్ బాల సాహితీవేత్త డా మధురిమా విద్యార్థి, తెలుగు నుండి డా పత్తిపాక మోహన్ ప్రశాంగించారు.వేల యేండ్ల తెలుగు సాహిత్య చరిత్రలో రెండు వందల యేండ్ల ఆధునిక తెలుగు బాల సాహిత్యం గురించి మోహన్ ప్రసంగించారు.
వైజ్ఞానిక, ఇతర రంగాల్లో వస్తున్న బాల సాహిత్యం, తెలుగు బాలసాహిత్య వికాసం గురించి మోహన్ ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో బాలసాహితీ పురస్కార గ్రహీత డా దేవరాజు మహారాజు, సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షులు మాధవ్ కౌశిక్, డా దివిక్ రమేష్ (హిందీ), ఎల్లప్ప కె కె పుర (కన్నడ), బీరేంద్ర మొహంతి (ఒడియా), ప్రతిభ రాజే (మరాఠీ) ప్రసంగించారు.