జాతీయం Uddhav Thackeray: థాకరే పతనానికి కారణాలివే!

Uddhav Thackeray: థాకరే పతనానికి కారణాలివే!

Uddhav Thackeray: 2001 లో ఒక శనివారం రాత్రి బాగా పొద్దు పోయాక ఫోన్ రింగయ్యింది.అవతలి వ్యక్తి ‘బాలాసాహెబ్ మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు’ అని చెప్పాడు.ఆరోజు ఉదయమే ‘ఇండియన్ ఎక్స్ ప్రెస్’ లో national interest కాలమ్ లో నేను రాసిన వ్యాసం గుర్తుకొచ్చింది.అది బాలాసాహెబ్ థాకరే గురించిన వ్యాసం.అందులో నేను ఆయనను ‘మాఫియోసో’ అని సంబోధించాను. మాఫియాసో అంటే మాఫియా ప్రతినిధి అనే అర్ధం వస్తుంది.నేనిలా ఆలోచిస్తుండగానే బాలా సాహెబ్ లైనులోకి వచ్చారు.’చాలా మంది నన్ను దూషిస్తుంటారు.మీరు నా గురించి కాస్త మర్యాదగానే రాశారు.రాజ్ దీప్ సర్దేశాయిలాగా కాదు’ అని అన్నారు.ఇలాంటి మాటనే రాజా దీప్ సర్దేశాయిని పిలిచి నా గురించి ఆయన అనగలరని సులభంగానే ఊహించా.

”నేను మర్యాదపూర్వకంగానే రాశానని మీరనుకున్నప్పుడు ఇంకేమిటి”అని అడిగాను.అందుకాయన నన్ను డిన్నర్ కు ఆహ్వానించారు.భార్యాను కూడా వెంటబెట్టుకొని రమ్మన్నారు.”మాంసం,లిక్కర్ తీసుకుంటారా” అని థాకరే అడిగారు.”అవును”అని చెప్పాను.”అయితే గుర్తుంచుకోండి.నేను వైట్ వైన్ మాత్రమే తాగుతాను.రెడ్ వైన్ గుండెకు మంచిది.మీకు తెలుసు కదా నాకెట్లాగు హృదయం లేదని”అని థాకరే అన్నారు.ఆ డిన్నర్ శివసేన వ్యవస్థాపకుడు థాకరే నివాసం ‘మాతోశ్రీ’లో జరిగింది.రాజకీయాల్లో అసమర్ధత,నిజాయితీ లేకపోవడం వంటి అంశాలపై చర్చ ఎక్కువగా సాగింది.ఆయన ఆ మాటలు అప్పటి వాజ్ పేయి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న శివసేన సభ్యుడు సురేష్ ప్రభు గురించి అన్నారు.పార్టీ కోసం సురేష్ ప్రభు నిధులను కూడబెట్టలేపోతున్నారన్నది థాకరే మాటల తాత్పర్యం.

డిన్నర్ చేస్తున్న సమయంలో థాకరే ఇద్దరు మనవళ్ళు లివింగ్ రూమ్ లో ఉన్నారు.అందులో ఒకరు ఆదిత్య థాకరే అనుకుంటా.అతను వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ కు చెందిన టీ షర్టు ధరించి ఉన్నాడు.”అరే,నువ్వు ఆ ప్రీతిష్ నంది టీ షర్టు ఎందుకు తొడిగావు”అని బాలాసాహెబ్ అన్నారు.నాకు ఆశ్ఛర్యం కలిగింది.”ప్రితీష్ నంది గురించి మీరు అలా ఎలా మాట్లాడతారు?ఆయన మీ పార్టీ ఎంపీ”అని నేనన్నాను.”సమస్య అదే మరి!నానుంచి అతను రాజ్యసభ సీటు పొందాడు.అతను క్రైస్తవుడు అని నాకెవరూ చెప్పలేదు.తెలిసి ఉంటె అతనికి రాజ్యసభ సీటు ఇచ్చి వుండే వాడ్ని కాదు”! అని థాకరే మొహమాటం లేకుండా చెప్పారు.

తర్వాత 2007 లో NDTV కోసం walk the talk లో భాగంగా బాల్ థాకరే ఇంటర్వ్యూ చేశా.అప్పటికి ఆయన 80 వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.చేతిలో వైట్ వైను,వెనుక గోడపై పెద్దపులి,మైఖేల్ జాక్సన్ చిత్రపటాలు ఆ ఇంటర్వ్యూ లో చూపాం.సురేశ్ ప్రభు శివసేన కోసం డబ్బు సమకూర్చలేదు.అది నిజం.కానీ ”కేంద్రమంత్రిగా ఉన్న వ్యక్తి డబ్బు సంపాదించకపోవడం అంటూ ఉండదు.అయితే సదరు మంత్రి అబద్ధాలైనా చెబుతూ ఉండాలి.లేదా తన అసమర్ధతను రుజువు చేసుకునే ప్రయత్నమైనా చేస్తూ ఉండాలి”అని శివసేన అధ్యక్షుడు థాకరేకు ప్రమోద్ మహాజన్ నూరిపోశారు.అధికారాన్ని ఉపయోగించి డబ్బు ఎట్లా పోగుచేయాలన్న కళ ప్రమోద్ మహాజన్ కు తెలిసినంతగా మరెవరికీ తెలియదు.మహాజన్ మాటలు థాకరే చెవికి బాగా ఎక్కాయి.శివసేన మూల సిద్ధాంతం పెద్ద ఎత్తున డబ్బు కూడబెట్టడం,బెదిరించి,భయపెట్టి వసూళ్ళు చేయడమే.థాకరే కొడుకు ఉద్ధవ్ థాకరే ఆ ‘పట్టాల’ నుంచి పార్టీని పక్కకు నెట్టాడన్న విమర్శలున్నవి.అధికారం నిలబెట్టుకోవడానికి గాను ఉద్ధవ్ థాకరే ‘కుతంత్రాలు ‘చేయలేకపోయారు. అధికారం,డబ్బు ఇతర వ్యవహారాలతో ‘ప్రయివేటు ఆపరేషన్’ నిర్వహించలేకపోతే ప్రభుత్వం నిలబడదని మహారాష్ట్ర పరిణామాలు తెలియజేస్తున్నవి.ఉద్ధవ్ థాక్రే పార్టీ ‘సిద్ధాంతాల’ను గాలికొదిలేసినందుకే తాము తిరుగుబాటు చేయకతప్పలేదని తమ చర్యను సమర్ధించుకుంటూ ఏక్ నాథ్ షిండే వ్యాఖ్యానిస్తున్నారు.

శివసేన సిద్ధాంతం ఏమిటి? అత్యంత తీవ్రమైన సంప్రదాయ మతోన్మాదం,హిందుత్వ వాదం కలగలిపితే అదే శివసేన పార్టీ సిద్ధాంతం.మహారాష్ట్ర పరిణామాల వల్ల రాజకీయాల్లో నైతికత,సైద్ధాంతిక విధానాలు మరోసారి ప్రశ్నార్థకంలో పడ్డాయి.కానీ ‘ఈ రెండూ’ ప్రస్తుత పరిస్థితుల్లో అర్ధం లేనివి.అసలు మహా వికాస్ అఘాడి ప్రభుత్వం ఏర్పాటే అనైతికమైనది.కాంగ్రెస్,ఎన్ సీపీతదితర రాజకీయ శక్తుల కూటమికి వ్యతిరేకంగా శివసేన,బీజేపీ ఉమ్మడిగా తలపడ్డాయి.ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీతో విభేదించి కాంగ్రెస్,శరద్ పవార్ కూటమితో జట్టు కట్టడం వల్ల శివసేన తిరుగుబాటుదారులకు ఉద్ధవ్ థాకరే చేజేతులా ఆయుధాలనిచ్చారు.నిజానికి మహారాష్ట్రలో బీజేపీ 105 అసెంబ్లీ స్థానాలను గెల్చుకోగా,శివసేన 56 స్థానాలను మాత్రమే సాధించింది.సైద్ధాంతిక,రాజకీయ విధానాలతో ఎటువంటి పొంతన లేని శక్తుల కూటమిగా ‘మహా వికాస్ అఘాఢీ’ ఏర్పడిన నాటి నుంచే ఆ ప్రభుత్వం ఎంతోకాలం మనజాలదని,దాని పతనం తప్పదని రాజకీయ విశ్లేషకులు,పండితులు జోస్యం చెబుతూనే ఉన్నారు.గడచిన రెండున్నర ఏండ్ల నుంచి పత్రికలను తిరగేస్తే ఈ విషయం మనకు అర్ధమవుతుంది. పార్టీ,ప్రభుత్వం,పోలీసులు,ఇంటెలిజెన్స్ తదితర విభాగాలపై పూర్తి నియంత్రణ ఉన్న ఉద్ధవ్ థాకరే
తమ కాళ్ళ కింద నేల జారిపోతున్న విషయాన్ని ఎందుకు పసిగట్టలేకపోయారు? రెండేళ్లకు పైగా ఏక్ నాథ్ షిండేతో బీజేపీ రహస్యంగా ‘టచ్’ లో ఉన్నట్టు బీజేపీ న్యాయవాది,ఎంపీ మహేష్ జెఠ్మలానీ,నా సహ జర్నలిస్టు జ్యోతి మల్హోత్రాకు చెప్పాడు.చాలా రోజులుగా ఈ విషయం రాజకీయ శిబిరాల్లో ఈ ఊహాగానం ఉన్నదే.పార్టీ లోపలా,వెలుపలా ఏమి జరుగుతున్నదో తెలుసుకోని వారు,సరైన నిఘా వ్యవస్థను నడపలేని వారు,ఏమి కుట్రలు జరుగుతున్నాయో తెలుసుకోలేని వారు అర్ధంతరంగా ఎట్లా కుప్పగూలిపోతారో ఉద్ధవ్ థాకరే ఉదంతం ఒక సజీవ సాక్ష్యం.

2012 నవంబర్ 17 న బాలాసాహెబ్ మరణించారు.అదే సమయంలో నరేంద్రమోడీ దేశవ్యాప్తంగా విజయదుందుభి మోగిస్తున్నారు.మహారాష్ట్ర ప్రాంతీయవాదం,హిందుత్వ వాదం ఎజండాతో ఆవిర్భవించిన శివసేన పార్టీ అయోమయంలో పడిపోయింది. బాల్ థాకరే జీవించి ఉన్నంతకాలం ఆయనను కానీ,శివసేనను కానీ సవాలు చేయడానికి మోడీ కూడా వెనుకాడారన్నది సత్యం.థాకరే మరణాంతరం సీన్ మారిపోయింది.హిందుత్వ వాదానికి బ్రాండ్ గా బీజేపీ అవతరించడం,విస్తరించడంతో ఎలాంటి రాజకీయ పంథాను అనుసరించాలన్న అంశంపై థాకరే కొడుకు ఉద్ధవ్ థాకరేకు స్పష్టత లేకపోయింది.

పలు ఎన్నికల్లో హిందూ ఓటు బ్యాంకు శివసేన నుంచి బీజేపీ వైపునకు మళ్ళడం చూస్తున్నాం.ఒకప్పుడు మహారాష్ట్రలో శివసేనకు బీజేపీ జూనియర్ భాగస్వామిగా మెలిగింది.2019 ఎన్నికల్లో బీజేపీ విశ్వరూపానికి ఉద్ధవ్ థాకరే హడలిపోయారు.బిజెపి ఎత్తుగడలకు కౌంటర్ గా హిందుత్వ ఓట్లను ఎట్లా కొల్లగొట్టాలన్న అంశంపై రీసెర్చ్ చేయకుండా,అధికారం కోసం లౌకికవాద శక్తులతో చేతులు కలిపి కొంపకు ఎసరు తెచ్చి పెట్టుకున్నారు.1992 -1993 లో జరిగిన ముంబయి ఘర్షణలు మహారాష్ట్ర ప్రజల్లో ‘విభజన’తీసుకువచ్చాయి.హిందుత్వ శక్తుల విజృంభణను కూడా చూసాం.ఆయా శక్తులకు శివసేన కార్యకర్తల మద్దతు ఉన్నది.కాగా ఆయుధాలతో పట్టుబడ్డ సినీ నటుడు సంజయ్ దత్ కు బాలా సాహెబ్ థాకరే బహిరంగంగా సంఘీభావం తెలియజేసి సంచలనం సృష్టించారు.

థాకరేకు ఆయన కొడుకు ఉద్ధవ్ థాకరేకు మధ్య చాలా తేడా ఉన్నది. సీనియర్ థాకరే తలచుకుంటే ఏమైనా చేసేవారు.ఏ వైపునయినా సులభంగా స్వింగ్ అయ్యేవారు.కొన్ని గంటలలోనే ఆయన మనసు మార్చుకునేవారు.అయినా ఆయనకు ప్రజల ఆశీస్సులు లభించేవి.దీనికంతటికీ కారణం థాకరే ఎన్నడూ అధికారాన్ని ఆశించలేదు.అధికారం కోసం లాలూచీ పడలేదు.రాజు కావడం కన్నా కింగ్ మేకర్ గా ఉండడానికే ఆయన ఎక్కువగా ఇష్టపడేవారు.సీనియర్ థాకరే నెపోలియన్ తరహా రాజకీయాలు నడపాలనుకునేవారు. ఆయన తనకు తాను ఒక ‘డాన్’గా భావించేవారు.

శేఖర్ గుప్తా,
ఎడిటర్ ఇన్ చీఫ్,
the print.

(అనువాదం : జకీర్ )

Also Read:

RELATED

నీతి ఆయోగ్ ఒక నిరర్ధక సంస్థగా మారిపోయింది.. కేసీఆర్ ఆవేదన

నీతి ఆయోగ్ ఏర్పాటు చేసినప్పడు భారత్‌కు మంచి రోజులు వచ్చాయని తాను ఎంతో సంతోషించానని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్...

రేపటి నీతి ఆయోగ్‌ సమావేశాన్ని నేను బహిష్కరిస్తున్నా – సీఎం కేసీఆర్‌

రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. శనివారం ఆయన ప్రగతిభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నిర్ణయం చాలా బాధాకరమే...

ఆసియా ఖండంలోనే అరుదైన పోలీస్ భవనం

ఈ ఫోటోలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? మైక్రోసాఫ్ట్ లేదా అమెజాన్, టిసిఎస్, ఇన్ఫోసిస్, యాక్సెంచర్ లాంటి దిగ్గజాసంస్థలు తమ ప్రధాన కార్యాలయాన్ని నిర్మిస్తున్నట్లు అనిపించడంలేదూ? అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే....

నీతి ఆయోగ్ ఒక నిరర్ధక సంస్థగా మారిపోయింది.. కేసీఆర్ ఆవేదన

నీతి ఆయోగ్ ఏర్పాటు చేసినప్పడు భారత్‌కు మంచి రోజులు వచ్చాయని తాను ఎంతో సంతోషించానని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్...

రేపటి నీతి ఆయోగ్‌ సమావేశాన్ని నేను బహిష్కరిస్తున్నా – సీఎం కేసీఆర్‌

రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. శనివారం ఆయన ప్రగతిభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నిర్ణయం చాలా బాధాకరమే...

ఆసియా ఖండంలోనే అరుదైన పోలీస్ భవనం

ఈ ఫోటోలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? మైక్రోసాఫ్ట్ లేదా అమెజాన్, టిసిఎస్, ఇన్ఫోసిస్, యాక్సెంచర్ లాంటి దిగ్గజాసంస్థలు తమ ప్రధాన కార్యాలయాన్ని నిర్మిస్తున్నట్లు అనిపించడంలేదూ? అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే....

నమ్మకద్రోహానికి వారసుడు రాజగోపాల్ రెడ్డి…

• కాంగ్రెస్ ను కాపాడుతున్నదే రేవంత్ రెడ్డి : టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షతో మునుగోడు ఎమ్మెల్యే అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. నేడు...