తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో టీవీ 9 తెలుగు ద్వారా పలు సామాజిక అంశాలపై చర్చలు, ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వాలకు చేరేలా కృషి చేస్తూ… జర్నలిజంలో చేసిన సేవలను గుర్తిస్తూ టీవీ 9 మేనేజింగ్ ఎడిటర్ రజనీ కాంత్ కు న్యూజెర్సీ స్టేట్ అసెంబ్లీ ప్రతిష్టాత్మక అవార్డు అందజేసింది. న్యూజెర్సీ అసెంబ్లీ తీర్మానంతో సత్కారం అందుకున్న తొలి ఇండియన్ జర్నలిస్టు గా వెల్లల చెరువు రజనీకాంత్ అరుదైన గౌరవం పొందారు. న్యూజెర్సీ అసెంబ్లీ తరపున సెనేటర్ జ్వికర్ .. ప్రవాసుల సమక్షంలో సత్కారం చేసి పురస్కారాన్ని అందజేశారు. గార్డెన్ స్టేట్ లో శుక్రవారం జరిగిన సాయిదత్త పీటం వేడుకలో ఈ పురస్కారాన్ని రజనీకాంత్ అందుకున్నారు.
బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ ద్వారా గత పదిహేనేళ్లకు పైగా రాజకీయ నేతలు, అతిథులతో ముఖ్యమైన అంశాలపై చర్చలను నిర్వహిస్తూ.. సామాజిక సమస్యల పరిష్కారం దిశగా ఆయన కృషి చేస్తున్నారు. టివి 9 న్యూస్ మేనేజింగ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తూ… సమాజంలో ప్రగతిశీలమైన మార్పు దిశగా రజనీకాంత్ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా న్యూజెర్సీ అసెంబ్లీ గుర్తించింది.
Also Read: