జాతీయం Apple iPhone: ఆపిల్ ఐఫోన్ కొనాలనుకుంటున్నారా...!

Apple iPhone: ఆపిల్ ఐఫోన్ కొనాలనుకుంటున్నారా…!

Apple iPhone : ఆపిల్ ఐఫోన్ కొత్త మార్కెటింగ్ వినియోగదారుల దగ్గరికి రానుంది. ఇప్పటి వరకు ఫోన్ కావాలంటే ఫోన్ కొనుక్కుంటాం. ఆ ఫోన్లో యాప్ కావాలంటే ఏదైనా గూగుల్ ప్లే స్టోర్ నుంచి లేదా మరొక ఆపిల్ స్టోర్ నుంచి యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటాం. నెట్వర్క్ కనెక్షన్ ఉంటే ఆండ్రాయిడ్ లో పనిచేస్తుంది. దానికోసం 4జి లేదా 5జి మొబైల్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇది ఇప్పటి వరకు మనకు ఫోన్ల కొనుగోలు గురించి ఉన్న అవగాహన. మార్కెట్ తీరు.

కానీ ఆండ్రాయిడ్ మార్కెట్ ని సమూలంగా మార్చేసిన ఐ ఫోన్ తాజాగా ఫోన్ వినియోగదారుల అలవాట్లను అవసరాలు కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తూ అందులో భాగంగానే ఆపిల్ ఫోన్ యజమాని అంటే కొనుగోలుదారుడు ఆపిల్ ఉపయోగించే ప్రతి అప్లికేషన్ కి విడివిడిగా చెల్లించే పద్ధతిలో కొత్త మెకానిజాన్ని రూపొందిస్తోంది. ఈ పద్ధతిలో ఆపిల్ ఫోన్ మోడల్ మారినప్పుడల్లా కొత్త మోడల్ లో ఉన్న అవకాశాలను ఫీచర్లను వినియోగించుకోవాలని తపన పడుతూ కొనుగోలు శక్తి లేక ఇబ్బంది పడేవారికి ఇటువంటి పథకం కొత్త ఫీచర్లను ఆ కొత్త ఫీచర్ల కోసం ఉపయోగించే హార్డ్వేర్ను అప్లికేషన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ విధానాన్ని ఆపిల్ ఇంకా పూర్తి స్థాయిలో ఖరారు చేయాల్సి ఉంది. బ్లూమ్ బర్గ్ వార్తాసంస్థ ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చిన తరువాత ఆపిల్ కంపెనీ షేరు 174 డాలర్ల 07 సెంట్లు పెరిగింది. ఇప్పటి వరకు మొత్తం ఫోనులో ఉండే యాప్స్ ని పాకేజీ చేసి అమ్మకానికి పెట్టిన ఆపిల్ ఇప్పుడు ఫోన్లోని హార్డ్వేర్ లను ప్యాకేజీలుగా మార్చి అద్దెకు ఇవ్వడానికి సరికొత్త మార్కెట్ మంత్రాంగంతో సిద్దం కాబోతోంది. ఈ పద్ధతిలో కొన్ని సార్లు వాయిదాల రూపంలో చెల్లించవచ్చు. లేదా పదేపదే కొనుగోలు చేస్తున్న వినియోగదారులకు యాపిల్ కంపెనీ వారు కూడా కొన్ని రాయితీలు అందించవచ్చు.

ఆపిల్ కంపెనీ వార్షికాదాయంలో ఐఫోన్ అమ్మకాలు ద్వారా వచ్చే ఆదాయం సగానికి పైగా ఉంటుందని గత సంవత్సరపు వార్షిక నివేదిక తెలియజేస్తుంది. కరోనా ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ అల్లాడుతోంది అనుకుంటున్న 2021 లోనే ఐఫోన్ అమ్మకాల ద్వారా ఆపిల్ కంపెనీ 192 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సంపాదించింది. కొత్తగా ప్రతిపాదించే మార్కెట్ మంత్రాంగం లో భాగంగా ఆపిల్ ఫోన్ తో పాటు icloud స్టోరేజ్ సామర్థ్యం గాని ఐ మ్యూజిక్ గానీ నెలసరి వాయిదా లపై ఐప్యాడ్, ఐఫోన్ వినియోగదారులు ఉపయోగించుకోవాలి. ఐఫోన్ కస్టమర్లు ఫోన్ వాడకానికి ఉపయోగించిన ఐడెంటిఫికేషన్ ద్వారానే హార్డ్వేర్ సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోవచ్చు. ఇప్పటి వరకు ఉన్న పద్ధతి ప్రకారం ఐఫోన్ కానీ లేదా ఐపాడ్ గానీ పొందాలంటే మొత్తం ధరను వాయిదా పద్ధతుల్లో చెల్లించే ఏర్పాటు ఉన్నది. హార్డ్వేర్ సబ్స్క్రిప్షన్ పద్ధతి ఏ విధంగా ఉండబోతుంది నెలసరి అద్దె రేట్లు ఎలా ఉండబోతున్నాయి అన్నది ఇంకా నిర్ధారణ కావలసి ఉంది.

కొత్త హార్డ్వేర్ తో కొత్త ఫోన్ వచ్చినప్పుడు పాత ఫోన్ వినియోగదారులు కూడా కొత్త ఫోన్ లో వచ్చిన హార్డ్వేర్ యాప్స్ ద్వారా దీన్ని ఉపయోగించుకోవాలి అనుకుంటే ఆ మేరకు అద్దెకు తీసుకోవచ్చు. ఈ ఏర్పాటు లో కొత్త మోడల్ ఫోను లక్షలు పెట్టి కొనాల్సిన అవసరం ఉండదు. ఆపిల్ కంపెనీ తరచూ ఐ ఫోన్ లో గాని ఐప్యాడ్ గాని కొత్త కొత్త వర్షన్ మార్కెట్లోకి విడుదల చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.

పాత వినియోగదారులకు కొత్త హార్డ్వేర్ అద్దెకిచ్చే ప్యాకేజీ రూపొందించాలన్న ఆలోచన గత కొన్ని నెలలుగా సాగుతున్నప్పటికీ ఈ మధ్య విడుదల చేసిన బై నౌ, పే లాటర్ (ఇపుడు కొనుక్కుని తర్వాత చెల్లించండి) ప్యాకేజీని ఖరారు చేయటం కోసం తాత్కాలికంగా వాయిదా వేశారు. ఏదేమైనప్పటికీ ఈ అద్దెకు ఇచ్చే హార్డ్వేర్ ప్యాకేజీ 2022 చివరి నాటికి మార్కెట్లోకి రానుంది అని అంచనా వేస్తున్నారు. హార్డ్వేర్ అప్డేట్ ప్రోగ్రాంను ఆపిల్ అందించే సేవల జాబితాలో చేర్చడానికి ఈ మధ్యనే యాజమాన్య స్థాయిలో నిర్ణయం జరిగింది. దీంతోపాటు ఆపిల్ కేర్ టెక్నికల్ సపోర్ట్ స్కీమ్ లో కూడా ఈ అంశాన్ని చేర్చడానికి నిర్ణయించారు. ఇతర సేవల జాబితాను తొలిసారిగా యాపిల్ 2020లో మార్కెట్లోకి తెచ్చింది ఈ జాబితాలో అందుబాటులో ఉన్న అనేక పథకాలను, యాప్స్ ను రుసుము చెల్లించి ఉపయోగించుకోవచ్చు. మన సెటప్ బాక్స్ లో ఏ చానల్ చూడాలంటే ఆ చానల్ కి సపరేట్ గా ఆరోజు అద్దెకు చూసే పద్ధతిలోనే ఆపిల్ గ్రూప్ సేవల జాబితాలోని సేవలు కూడా ఉపయోగించుకోవచ్చు. యాపిల్ వినియోగదారులు తమ తమ ఖాతాలో ఆధారంగానే తాము కోరుకున్న సేవలను మెరుగుపరచుకోవచ్చు. వాడుకోవచ్చు. సేవలను తాజాపర్చుకునే అవకాశం కూడా ఈ అప్ గ్రేడషన్ ద్వారానే సాధ్యం అవుతుంది.

సబ్స్క్రిప్షన్ ఆధారంగా హార్డ్వేర్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చి మొదటి కంపెనీ ఐఫోన్ ఆపిల్ కాబోతోంది. 2017లో ఐ ఫోన్ లాంచ్ చేసిన ఫోన్ అప్డేట్ ప్రోగ్రాం వినియోగదారులకు సిటిజన్ సంస్థ ద్వారా 12 ఇన్స్టాల్మెంట్స్ లో చెల్లించేలా అప్పు ఇచ్చే విధానాన్ని రూపొందించారు. ఐఫోన్ వాచి వినియోగదారులు కూడా 10 నెల 24 వరకు వాయిదాల పద్దతిలో చెల్లించే వెసులుబాటు కల్పించారు.
అయితే ఆపిల్ ఐఫోన్ మార్కెట్ వాల్యుయేషన్ లక్ష కోట్ల డాలర్ల మార్క్ ను అధిగమించాలంటే ఇటువంటి సబ్స్క్రిప్షన్ ఆధారిత సేవలను ప్రవేశ పెట్టాలని వాల్స్ట్రీట్ విశ్లేషకులు 2016 లోనే ప్రతిపాదించారు. ఐఫోన్ రెండు లక్షల 24 వేల కోట్ల డాలర్ల మార్కెట్ వాల్యుయేషన్ మార్కులు సాధించింది. ఇపుడు ప్రతిపాదించనున్న తాజా సేవలతో యాపిల్ కంపెనీ విలువ సరికొత్త ఎత్తులకు ఎడగనుంది.

తెలుగడ్డా ప్రత్యేకం

  • కొండూరి వీరయ్య

Also Read:

క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన శాసనసభ్యులు రాజా సింగ్

Tamilsai: హైదరాబాద్‌ – పుదుచ్చేరి మధ్య ప్రారంభమైన తొలి డైరెక్ట్ విమానంలో గవర్నర్ తమిళిసై

RELATED

మతాలను రాజకీయం చేయొద్దు

మతం ఉచ్చులో బందీ అయ్యి అన్య మతస్తులను రెచ్చగొట్టే విధానాలకు స్వస్తి పలకాలి. రాజకీయ పార్టీలు, ఆధ్యాత్మిక సంస్థలు మతాలను రాజకీయం చేయొద్దు. మతం వ్యక్తిగతమని, సామూహిక మైన దైనా సమ్మతమైన జీవన విధానానికి...

KTR: ప్రధాని మోడీ గారు.. తెలంగాణ నుంచి పాఠాలు నేర్చుకోండి

● ఆవో-దేఖో-సీకో (Aao-Dhekho-Seekho) అంటూ ప్రధానమంత్రి మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ● జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి వికాసం...

కార్పొరేషన్ చైర్మన్లుగా ఆ ముగ్గురు నియామకం

రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. తెలంగాణ ఫుడ్స్ చైర్మన్‌గా మేడె రాజీవ్ సాగర్, తెలంగాణ అధికార భాషా సంఘం చైర్మన్‌గా మంత్రి శ్రీదేవి, తెలంగాణ ఉర్దూ అకాడమీ...

మతాలను రాజకీయం చేయొద్దు

మతం ఉచ్చులో బందీ అయ్యి అన్య మతస్తులను రెచ్చగొట్టే విధానాలకు స్వస్తి పలకాలి. రాజకీయ పార్టీలు, ఆధ్యాత్మిక సంస్థలు మతాలను రాజకీయం చేయొద్దు. మతం వ్యక్తిగతమని, సామూహిక మైన దైనా సమ్మతమైన జీవన విధానానికి...

KTR: ప్రధాని మోడీ గారు.. తెలంగాణ నుంచి పాఠాలు నేర్చుకోండి

● ఆవో-దేఖో-సీకో (Aao-Dhekho-Seekho) అంటూ ప్రధానమంత్రి మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ● జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి వికాసం...

కార్పొరేషన్ చైర్మన్లుగా ఆ ముగ్గురు నియామకం

రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. తెలంగాణ ఫుడ్స్ చైర్మన్‌గా మేడె రాజీవ్ సాగర్, తెలంగాణ అధికార భాషా సంఘం చైర్మన్‌గా మంత్రి శ్రీదేవి, తెలంగాణ ఉర్దూ అకాడమీ...

సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్ నిషేధానికి ప్ర‌త్యేక కార్య‌చ‌ర‌ణ‌: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం, స‌హ‌కారంతోనే సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం సాధ్యం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ‌స్తువుల వాడ‌కానికి స్వ‌స్తి చెప్పాలి జూలై 1 నుంచి సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్ నిషేధం హైద‌రాబాద్, జూన్ 30: పర్యావరణానికి హాని...