జాతీయం Surgical Strike: సర్జికల్ స్ట్రైక్ అంటే ఏమిటి?

Surgical Strike: సర్జికల్ స్ట్రైక్ అంటే ఏమిటి?

Surgical Strike: ఇప్పుడు మళ్ళీ బలంగా వినిపిస్తున్న మాట 'సర్జికల్ స్ట్రైక్'. భారత్ 2016 నుంచి ఇప్పటివరకు రెండు సార్లు పాకిస్తాన్ పై 'సర్జికల్ స్ట్రైక్' జరిపినట్టు కేంద్రప్రభుత్వం చెబుతోంది.దీనికి ఋజువులేమిటి? అని ప్రశ్నించినందుకు గాను కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పుట్టుకకు సంబంధించి బీజేపీకి చెందిన అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ వివాదాస్పాద, కుసంస్కార వ్యాఖ్యలు చేశారు.తాను కూడా 'సర్జికల్ స్ట్రైక్' ఆధారాలు కోరుతున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ 'కొత్త రాజ్యాంగం' గురించి మాట్లాడడం ద్వారా దేశ ప్రజలను,రాజకీయ పార్టీలను ఆకర్షించిన కేసీఆర్ 'సర్జికల్ స్ట్రైక్' పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలను సమర్ధించినందుకు జాతీయస్థాయిలో ఆయన పేరు మార్మోగుతున్నది.

కాగా కొన్నెండ్ల క్రితం మయన్మార్ భూభాగంలో భారత ఆర్మీకి చెందిన 70 మంది కమాండోలు ఆపరేషన్ నిర్వహించి కేవలం 40 నిమిషాల్లోనే 38 మంది నాగా ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఇది ‘సర్జికల్ స్ట్రైక్‌’. బాంబులతో దాడి చేయడం కూడా సర్జికల్ స్ట్రైక్స్‌ లోకి వస్తుంది. అయితే ఈ తరహా బాంబు దాడుల వల్ల నష్టం తీవ్రత ఎక్కువగా ఉంటుంది.

2003 తొలినాళ్లలో ఇరాక్‌పై యుద్ధం సమయంలో అమెరికా బలగాలు బగ్దాద్‌పై బాంబుల వర్షం కురిపించాయి. ప్రభుత్వ కార్యాలయాలు, మిలటరీ టార్గెట్లపై అమెరికా ఓ పద్ధతి ప్రకారం దాడులు చేసింది. ఇది కూడా సర్జికల్ స్ట్రైక్‌. అలాగే పాకిస్తాన్ లోని ఆబోటాబాద్ ప్రాంతంలో అమెరికా ప్రత్యేక సైనిక బృందం
బిన్ లాడెన్‌ను మట్టుబెట్టడం సర్జికల్ స్ట్రైక్‌లో భాగమేనని రక్షణ శాఖ అధికారవర్గాలు చెబుతుంటాయి.

నిర్ణీత లక్ష్యాన్ని నిర్ధారించుకొని దానికి భారీ నష్టం వాటిల్లేలా సైనిక దాడులకు పాల్పడటమే సర్జికల్ స్ట్రైక్. ఓ ప్రత్యేక ప్రాంతంపై,పక్కాగా మిలటరీ దాడి చేయడమే సర్జికల్ స్ట్రైక్ అంటుంటాం.’శత్రువులకు’ మాత్రమే నష్టం కలిగించేలా చూడవలసి ఉంటుంది.ఇలాంటి ‘దాడుల’ వల్ల సమీప ప్రాంతంలోని సామాన్య ప్రజలు, భవనాలు, నివాస సముదాయాలకు తక్కువ ప్రమాదం సంభవించేలా సర్జికల్ స్ట్రైక్ చేయవలసి ఉంటుంది.

‘యూరీ’ ప్రాంతంలో 2016 లో భారత సైన్యాలపై పాకిస్తాన్ టెర్రరిస్టుల దాడిలో 18 మంది మన సైనికులు బలయ్యారు.ఈ ఘటన ఆధారంగానే ‘యూరీ’ పేరిట సినిమా వచ్చింది. యూరీ ఘటనకు ప్రతీకారంగానే భారత ఆర్మీ పాక్ ఆక్రమిత కశ్మీర్ లో టెర్రరిస్టుల స్థావరాలపై దాడికి దిగింది. సర్జికల్ స్ట్రైక్స్‌తో టెర్రరిస్టుల లాంచ్ ప్యాడ్‌లపై విరుచుకుపడింది.అప్పటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

సైన్యం సర్జికల్ స్ట్రైక్ రూపంలో పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాదుల లాంచ్‌ప్యాడ్‌లపై దాడి చేసింది. సర్జికల్ స్ట్రైక్స్ తరహా దాడులకు పాల్పడాలంటే దేశం వెలుపల కూడా నిఘా ఎంతో అవసరం. ఈ దాడులకు పాల్పడే బృందాలు నిఘా విభాగాలతో సమన్వయంతో ముందుకు సాగాలి. కోవర్టు వ్యూహాలను అమలు చేసి, వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న పరిస్థితులను ముందుగా అధ్యయనం చేస్తారు.

ఉద్దేశించిన బలగాలను హెలికాఫ్టర్ల ద్వారా సరిహద్దులకు తరలిస్తారు. అక్కడి నుంచి ‘లక్ష్యంగా ఎంచుకున్న ప్రాంతాల’కు చేరుకున్న ప్రత్యేక బలగాలు తమ పని తాము చేసుకుపోతాయి. 2016 లో జరిగిన టెర్రరిస్టుల ‘లాంచ్‌ప్యాడ్‌’లపై దాడి చేసినపుడు దాదాపు 40 మంది టెర్రరిస్టులు మరణించినట్టు అప్పట్లో ఆర్మీ వర్గాలు తెలిపాయి.

ఏడు ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినట్టు భారత సైన్యం చేసిన ప్రకటనను పాకిస్థాన్ ఖండించింది. ‘సర్జికల్ స్ట్రైక్’ జరగలేదని అప్పటి పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ అన్నారు.భారత సైనికులు జొరబడితే జవాబు చెప్పేందుకు తమ బలగాలు సిద్ధంగా ఉన్నట్టు కూడా చెప్పాడు. దీంతో పంజాబ్ లోని పలు గ్రామాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. పంజాబ్, పాకిస్తాన్‌తో 553 కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉంది. ఆ సరిహద్దు రేఖ వెంబడి బీఎస్ఎఫ్ జవానులు నిత్యం పహారా కాస్తూ ఉంటారు.

ఆ సరిహద్దు వెంబడి ఉన్న గ్రామాలకు పాక్ హాని తలపెట్టే అవకాశం ఉందన్న అనుమానంతో పంజాబ్ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నది. నాటి ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర హోం శాఖ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు సరిహద్దు రేఖకు పది కిలోమీటర్లలోపు దూరంలో ఉన్న గ్రామాలను ఖాళీ చేయించి, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆ గ్రామాల్లో ఉన్న స్కూళ్లను మూసి వేయించారు.

కశ్మీర్ లోని పుల్వామా దగ్గర 2019 ఫిబ్రవరిలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై టెర్రరిస్టులు జరిపిన దాడిలో 40కి పైగా జవాన్లు మృత్యువాత పడ్డారు. తర్వాత భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్‌లో 10మందికి పైగా మిలిటెంట్లు హతమయ్యారు.”పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం చేతిలో మరణించిన మిలిటెంట్లు వీరు” అంటూ పాతిక మందికి పైగా మృతదేహాలతో ఉన్న ఓ గ్రాఫిక్ చిత్రం సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోందని బిబిసి వార్తాసంస్థ అప్పట్లో ఒక కథనాన్ని ప్రచురించింది.

ఆ గ్రాఫిక్ ఫొటోను చాలా మితవాద ఫేస్‌బుక్ గ్రూపులు షేర్ చేస్తూ, భారత సైన్యం ఈ పని చేసిందంటూ రాశాయి. కానీ ఆ చిత్రం చాలా పాతది. ఆ చిత్రానికి, పుల్వామా దాడికి ఎలాంటి సంబంధం లేదు. అంతేకాదు, ఆ ఫొటో పాకిస్థాన్‌కు చెందినది, భారత్‌ది కాదు అని కూడా బిబిసి తెలిపింది. సందర్భంతో సంబంధం లేకుండా ఆ ఫొటోను ఉపయోగించడం ఇదే మొదటిసారి కాదు. ఇది ఎన్నోసార్లు, ఎన్నో సందర్భాల్లో సోషల్ మీడియాలో షేర్ అయింది.
అది ఏఎఫ్‌పీ వార్తాసంస్థకు చెందిన బాసిత్ షా 2014 డిసెంబరు 19న తీసిన ఫొటో అని తమ పరిశీలనలో గుర్తించామని ‘బిబిసి’ ఆ కథనంలో పేర్కొంది.

”ఆ చిత్రంలో ఉన్న మృతదేహాలు తాలిబన్లవిగా భావిస్తున్నారు. 2014 డిసెంబరు 16న పాకిస్థాన్‌లోని ఓ స్కూలుపై తాలిబన్ మిలిటెంట్లు చేసిన దాడిలో 132 మంది విద్యార్థులతో పాటు మొత్తం 141 మంది మరణించారు. దీంతో పాకిస్థాన్ సైన్యం వాయవ్య హంగు ప్రాంతంలో తాలిబన్లకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆపరేషన్‌లో మృతిచెందినవారి దేహాలే ఆ చిత్రంలో ఉన్నాయని భావిస్తున్నారు.2016లో నియంత్రణ రేఖ వెంబడి భారత సైన్యం చేపట్టినట్లుగా చెబుతున్న ‘సర్జికల్ స్ట్రైక్’ సమయంలో కూడా ఆ చిత్రాన్ని ఉపయోగించారు”.అని ఆ వార్తాసంస్థ చెబుతోంది.

ఉత్తర ఇరాక్‌లోని కుర్దిష్ పెష్‌మెగ్రా సైన్యం ఆరు గంటల వ్యవధిలో 120 మంది ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లను హతమార్చిందంటూ ఓ ‘బ్లాగు’లో కూడా అదే ఫోటోను ఉపయోగించారు. పెష్‌మెగ్రా దళాలపై బీబీసీ కూడా సమగ్ర కథనం ప్రచురించింది. ఈజిప్టుకు చెందిన 21 మంది క్రైస్తవులను తలలు నరికి హత్యచేయడానికి ప్రతీకారంగా 2015 ఫిబ్రవరిలో లిబియాపై ఈజిప్టు చేసిన వైమానిక దాడుల సమయంలోనూ అదే ఫొటోను వాడారని కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.

పుల్వామాలో ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ దళంపై మిలిటెంట్ దాడి తర్వాత భారతదేశం అంతటా మరోసారి పాక్ వ్యతిరేక భావనలు వెల్లువెత్తాయి.పాకిస్తాన్‌కు బుద్ధి చెబుతామని, ప్రతి రక్తం బొట్టుకూ బదులు తీర్చుకుంటామని యువత ప్రమాణాలు చేసిన దృశ్యాలు చూసాం. పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పడానికి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా వాటిని ప్రతిపక్షాల మద్దతు ఉంటుందని అఖిలపక్ష సమావేశంలో రాజకీయ పార్టీలు తెలిపాయి. 2019 పార్లమెంటు ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు ‘పుల్వామా’ ఘటన జరిగింది.

అంతకు ముందు 2016 సెప్టంబర్ 18న, 2016 జనవరి 2న రెండు మిలిటెంట్ దాడులు జరిగాయి.’యూరీ’ ఆర్మీ క్యాంప్‌పై జరిగిన మిలిటెంట్ దాడిలో 19 మంది జవాన్లు మృతి చెందగా, ఆ దాడి తర్వాత 11 రోజులకే ‘నియంత్రణ రేఖ’ దాటి వెళ్లిన భారత సైన్యం పాకిస్తాన్‌లోని మిలిటెంట్ శిబిరాలను ధ్వంసం చేసింది.అప్పుడు ఈ దాడి, తర్వాత దేశంలో చాలా పెద్ద రాజకీయ వివాదాన్ని రేపింది. ఈ దాడులు తమ ఘనతే అని చెప్పుకున్న బిజెపి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించింది.’యూరీ’ సైనిక స్థావరంపై జరిగిన దాడి తమ పనే అని అప్పుడు జైషే మహమ్మద్ చెప్పుకుంది. పుల్వామా దాడికి కూడా తామే బాధ్యులమని ఆ సంస్థే ప్రకటించింది.

1999లో ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం హైజాక్ తర్వాత బంధీలను విడిపించడం కోసం భారత ప్రభుత్వం మసూద్ అజర్‌ను కశ్మీర్ జైలు నుంచి తీసుకెళ్లి అప్పగించింది.జైషే మొహమ్మద్ సంస్థ అధినేత అతనే. మిలిటెంట్ల చర్యల తర్వాత ప్రతిసారీ పాక్ వ్యతిరేక భావనలతో ఎన్నికల్లో లబ్ధి పొందాలని బిజెపి ప్రయత్నిస్తున్నట్టు విమర్శలు వస్తుంటాయి.

దేశవ్యాప్తంగా పాకిస్తాన్ వ్యతిరేక భావనలను పెంపొందించడంలో బిజెపి విజయవంతమయ్యింది.2016లో ‘యూరీ’ ఘటన తర్వాత వెంటనే భారత సైన్యం చేపట్టిన సర్జికల్ దాడులకు పాకిస్తాన్ ఎలాంటి సమాధానం ఇవ్వలేకపోయింది. ”2016లో సర్జికల్ స్ట్రైక్ ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించిన విషయాన్ని తోసిపుచ్చలేం”.అని బిబిసి నాడు వ్యాఖ్యానించింది.

పుల్వామా దాడి అనంతరం పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యాలు పెద్ద ఎత్తున వైమానిక దాడులు చేశాయి. మోడీ సాహసోపేతమైన నిర్ణయంతో ఆయన గ్రాఫ్ అమాంతంగా పెరగడం నిజం.పార్లమెంటు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసిన సంఘటనల్లో ఇది ముఖ్యమైనది.

ఉత్తరప్రదేశ్ సహా జరుగుతున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయంగా ప్రయోజనం పొందడానికి బీజేపీ ప్రయత్నిస్తున్న సందర్భంలోనే రాహుల్ గాంధీ ‘సర్జికల్ స్ట్రైక్’ పై చేసిన వ్యాఖ్యలు అంది వచ్చాయి.ఈ లోగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రంగంలో దిగడంతో రాజకీయం రంజుగా తయారయ్యింది. అసోం,తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య మాటల తూటాలు పేలుతున్నవి.రెండు రాష్ట్రాల్లోనూ పోటాపోటీగా కేసులు నమోదవుతున్నవి.

వ్యాసకర్త: జాకీర్

Also Read:

కిషన్ రెడ్డికి అమరులవీరుల గురించి మాట్లాడే అర్హత లేదు: మంత్రి హరీష్ రావు

ఎల్ఐసి ఎంత గొప్ప సంస్థ ఇది… ఒక్కసారి పరిశీలించి చూడండి..

RELATED

సమైక్యత లేకపోతే దేశమే అల్లకల్లోలం: జూలూరు గౌరీశంకర్

మన దేశ జాతీయ సమైక్యతను నిలుపుకోలేక పోతే దేశం అల్లకల్లోలమవుతుందని, దేశంలో అభివృద్ధి ఆగిపోతుందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రగతిశీల శక్తులు, అభ్యుదయవాదులు, సామాజికంగా...

ప్రముఖ కవి, అనువాదకులు నిజాం వేంకటేశం మృతి

Telangana: ప్రముఖ కవి, అనువాదకులు నిజాం వేంకటేశం ఈరోజు సాయంత్రం గుండెపోటుతో ఆకస్మికంగా మృతిచెందడం విషాదకరం. సిరిసిల్లకు చెందిన వెంకటేశం, విద్యుత్ శాఖలో ఎడిఈ గా ఉద్యోగ విరమణ చేశారు. గత 5...

గురుకుల డిగ్రీ కాలేజీలో మొక్కలు నాటిన వనజీవి రామయ్య

Vanajeevi Ramaiah: టీఎస్ డబ్ల్యూ ఆర్ డి సి ఖమ్మం కళాశాలలో స్వచ్ఛ గురుకులం ఐదవ రోజు కార్యక్రమంలో భాగంగా చెట్లను నాటే కార్యక్రమానికి పద్మశ్రీ వనజీవి రామయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలని...

సమైక్యత లేకపోతే దేశమే అల్లకల్లోలం: జూలూరు గౌరీశంకర్

మన దేశ జాతీయ సమైక్యతను నిలుపుకోలేక పోతే దేశం అల్లకల్లోలమవుతుందని, దేశంలో అభివృద్ధి ఆగిపోతుందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రగతిశీల శక్తులు, అభ్యుదయవాదులు, సామాజికంగా...

ప్రముఖ కవి, అనువాదకులు నిజాం వేంకటేశం మృతి

Telangana: ప్రముఖ కవి, అనువాదకులు నిజాం వేంకటేశం ఈరోజు సాయంత్రం గుండెపోటుతో ఆకస్మికంగా మృతిచెందడం విషాదకరం. సిరిసిల్లకు చెందిన వెంకటేశం, విద్యుత్ శాఖలో ఎడిఈ గా ఉద్యోగ విరమణ చేశారు. గత 5...

గురుకుల డిగ్రీ కాలేజీలో మొక్కలు నాటిన వనజీవి రామయ్య

Vanajeevi Ramaiah: టీఎస్ డబ్ల్యూ ఆర్ డి సి ఖమ్మం కళాశాలలో స్వచ్ఛ గురుకులం ఐదవ రోజు కార్యక్రమంలో భాగంగా చెట్లను నాటే కార్యక్రమానికి పద్మశ్రీ వనజీవి రామయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలని...

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిని ఫైనల్ చేసిన పార్టీ హైకమాండ్..

Palvai Sravanthi: మునుగోడు బైపోల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేరుని ఆ పార్టీ హైకమాండ్ ఖరారు చేసింది. రాష్ట్ర రాజకీయాల్లో అన్ని పార్టీలకు కీలకంగా మారిన మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి పేరు బయటకు...