జాతీయం జీవిత బీమా మార్కెట్‌ విలువను ప్రభుత్వం ఎందుకు తగ్గించింది?

జీవిత బీమా మార్కెట్‌ విలువను ప్రభుత్వం ఎందుకు తగ్గించింది?

త్వరలో మనందరం ముద్దుగా పిలుచుకునే భారతీయ జీవిత బీమా వాటాల అమ్మకం ప్రక్రియ పట్టాలెక్కనుంది. బహిరంగ మార్కెట్‌లో వాటాల విక్రయం ద్వారా ప్రైవేటీకరణకు కేంద్రం కొత్త భాష్యం చెప్పనుంది. ఇప్పటి వరకూ జరిగిన ప్రైవేటీకరణలకు ఎల్‌ఐసీ ప్రైవేటీకరణకు మధ్య ఓ తేడా ఉంది. ఇప్పటి వరకూ జరిగిన ప్రైవేటీకరణలన్నీ ప్రధానంగా ఓ కంపెనీని మరో కంపెనీకి అమ్మటం రూపంలో జరిగింది. కానీ ఈ సారి కంపెనీలో వాటాలు విడివిడిగా ఉన్న వ్యక్తులు కొనుగోలు చేయటానికి వీలుగా ముక్కలు ముక్కలు చేసి అమ్ముతున్నారు. దీన్నే మార్కెట్‌ భాషలో ఇనిషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ అని , ఐపిఓ రూట్‌ అనీ పిలుస్తున్నారు. పోయిన ఏడాది వరకు దేశీయ పౌరులకు మాత్రమే ఐపిఓ మార్గంలో ఎల్‌ ఐ సిలో యాజమాన్య వాటా పొందే హక్కు ఉంటుందని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా విదేశీ మదుపరులకు కూడా అవకాశం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాలను తెలుగడ్డా కథనాన్ని ఇప్పటికే అందించింది.

ఎల్‌ ఐ సిలో వాటాలు అమ్మకం ద్వారా 60 వేల కోట్లు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ లక్ష్యాన్ని 27 వేల కోట్లకు కుదించుకుంది. అయితే ఈ వాటాల అమ్మకమే భారత దేశంలో అతి పెద్ద కుంభకోణానికి తలుపులు తీసేదిగా ఉందని కేరళ మాజీ ఆర్థిక మంత్రి థామస్‌ ఐజాక్‌ అన్నారు. ఏప్రిల్‌ 27వ తేదీన కేంద్ర పెట్టుబడుల ఉసంహకరణ శాఖ మంత్రి కుంతియా ఓ ప్రకటన విడుదల చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు పెట్టుబడులు పెట్టే ఎల్‌ ఐ సిలో నేడు మదుపరులు పెట్టుబడులు పెట్టే అవకాశాన్ని కల్పిస్తున్నామని, ఇది భారతదేశంలో చరిత్ర సృష్టించే సందర్భమని అన్నారు.

అంత గొప్ప అవకాశం అన్నప్పుడు కేంద్రం మార్కెట్‌లో విడుదల చేసే వాటాలు ఎందుకు తగ్గిస్తుంది అన్నదే సమస్య. ఎల్‌ ఐ సి విడుదల చేసిన ఓ ప్రకటనలో ఒక్కో షేర్‌ ధర 902 ` 949 రూపాయల మధ్య ఉంటుందని ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమై ఉన్నందున ఇది అమ్మే వాళ్లకు అచ్చొచ్చే కాలం కాదనీ, కొనే వాళ్లకు కలిసి వచ్చే కాలమనీ ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

20లక్షల కోట్లుగా ఉన్న ఎల్‌ ఐ సి మార్కెట్‌ విలువను ప్రభుత్వం 6 లక్షల కోట్లకు ఎందుకు తగ్గించాల్సి వచ్చిందని థామస్‌ ఐజాక్‌ ప్రశ్నిస్తున్నారు. 20 లక్షల కోట్ల విలువ ఉన్న కంపెనీలో 10 శాతాం వాటా అమ్మాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇప్పుడు అసలు విలువే 6 లక్షల కోట్లకు తగ్గించి అందులో మూడున్నర శాతం వాటాలు ఐపిఓ రూట్‌లో అమ్మకానికి పెట్టిందని, ఈ తతంగం చూస్తే ఎలాగైనా ఎల్‌ఐసిని అమ్మేయాలన్న తపనతో బిజెపి ముందుకెళ్తోందని అన్నారు.

ఈ మొత్తం కసరత్తులో ప్రజలు, ఎల్‌ ఐ సి పాలసీదారుల నుండి వ్యతిరేకత రాకుండా ఉండటం కోసం ఎంత మొత్తంలో అమ్మకానికి పెట్టారో అందులో పది శాతం వాటాలు పాలసీదారులకు కేటాయిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

మరో ట్వీట్‌లో థామస్‌ ఐజాక్‌ దేశంలో ప్రైవేటు బీమా కంపెనీల షేర్‌ ధరలు రూపాయికి నాలుగు రూపాయల విలువ పలుకుతుంటే ఎల్‌ఐసీ షేర్‌ ధర రూపాయికి రూపాయి పదిపైసలుగా మాత్రమే నిర్ణయించటం ఎవరికి ప్రయోజనం కలిగించటానికని ప్రశ్నిస్తున్నారు. ఈ విధంగా తక్కువ ధరకు అమ్మటం ద్వారా ఎల్‌ఐసికి షుమారు 25 వేల కోట్ల నుండి 35 వేల కోట్ల వరకూ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Also Read:

Dharani: ధరణిలో కొత్త ఆప్షన్​​

Telangana Latest news Today

RELATED

సమైక్యత లేకపోతే దేశమే అల్లకల్లోలం: జూలూరు గౌరీశంకర్

మన దేశ జాతీయ సమైక్యతను నిలుపుకోలేక పోతే దేశం అల్లకల్లోలమవుతుందని, దేశంలో అభివృద్ధి ఆగిపోతుందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రగతిశీల శక్తులు, అభ్యుదయవాదులు, సామాజికంగా...

ప్రముఖ కవి, అనువాదకులు నిజాం వేంకటేశం మృతి

Telangana: ప్రముఖ కవి, అనువాదకులు నిజాం వేంకటేశం ఈరోజు సాయంత్రం గుండెపోటుతో ఆకస్మికంగా మృతిచెందడం విషాదకరం. సిరిసిల్లకు చెందిన వెంకటేశం, విద్యుత్ శాఖలో ఎడిఈ గా ఉద్యోగ విరమణ చేశారు. గత 5...

గురుకుల డిగ్రీ కాలేజీలో మొక్కలు నాటిన వనజీవి రామయ్య

Vanajeevi Ramaiah: టీఎస్ డబ్ల్యూ ఆర్ డి సి ఖమ్మం కళాశాలలో స్వచ్ఛ గురుకులం ఐదవ రోజు కార్యక్రమంలో భాగంగా చెట్లను నాటే కార్యక్రమానికి పద్మశ్రీ వనజీవి రామయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలని...

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిని ఫైనల్ చేసిన పార్టీ హైకమాండ్..

Palvai Sravanthi: మునుగోడు బైపోల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేరుని ఆ పార్టీ హైకమాండ్ ఖరారు చేసింది. రాష్ట్ర రాజకీయాల్లో అన్ని పార్టీలకు కీలకంగా మారిన మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి పేరు బయటకు...