గిన్నిస్ రికార్డ్ సాధించిన భాగ్యనగర్ బాలిక

0
91

Hyderabad: కేవలం 23 నిమిషాల్లో రెండు వేలకు పైగా తైక్వాండో కిక్స్ కొట్టి సరికొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది. హైదరాబాద్ సైనిక్ పురికి చెందిన 13 ఏళ్ల జె.వి. సాయి శ్రీహాస. నాగాయలంకకు చెందిన ఈశ్వర్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ గ్రాండ్ మాస్టర్స్ ఈశ్వర్, విశ్వ శిక్షణలో రాటు తేలిన శ్రీహాస 23 సెట్లలో 2005 తైక్వాండో కిక్స్ కొట్టి పాత రికార్డ్స్ బద్దలు కొట్టింది.

చిన్నారికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికేట్ తో పాటు మెడల్, మెమొంటోలను గ్రాండ్ మాస్టర్ ఈశ్వర్ అందించారు. తన తల్లిదండ్రులు పావని, శ్రీరామ్ ల ప్రోత్సాహంతో ఈ ఘనత సాధించగలిగానని చిన్నారి శ్రీహాస పేర్కొంది. శిక్షణను ఇచ్చిన గ్రాండ్ మాస్టర్స్ ఈశ్వర్, విశ్వలను విద్యార్ధుల తల్లిదండ్రులు ఘనంగా సన్మానించి, గురుపూజ నిర్వహించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here