Cricketer – Suresh Raina Father: భారత మాజీ క్రికెట్ ప్లేయర్ సురేశ్ రైనా (Suresh Raina) కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సురేష్ రైనా తండ్రి త్రిలోక్‌చంద్ రైనా క్యాన్సర్‌తో పోరాడుతూ ఆదివారం మరణించారు.

త్రిలోక్ చంద్.. మిలటరీ అధికారిగా పనిచేశారు. త్రిలోక్‌చంద్ పూర్వీకులది జమ్ముకశ్మీర్‌లోని రైనావరి గ్రామం. 1990లలో కశ్మీరీ పండిట్ల హత్యల ఘటన అనంతరం ఆయన ఆ గ్రామాన్ని విడిచిపెట్టి ఉత్తర్‌ప్రదేశ్‌లోని మురాద్‌నగర్‌లో స్థిరపడ్డారు.
ఇక సురేష్ రైనా విషయానికొస్తే ధోనీతో పాటే 2020 ఆగస్టులో రిటైర్మెంట్ ప్రకటించాడు. రైనా టీమిండియా తరఫున 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. ఐపీఎల్‌లోనూ చెన్నై సూపర్‌కింగ్స్, గుజరాత్ సూపర్‌జెయింట్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. మొత్తంగా 205 మ్యాచ్‌లు ఆడాడు.
Also Read…