మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిని ఫైనల్ చేసిన పార్టీ హైకమాండ్..

0
84

Palvai Sravanthi: మునుగోడు బైపోల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేరుని ఆ పార్టీ హైకమాండ్ ఖరారు చేసింది. రాష్ట్ర రాజకీయాల్లో అన్ని పార్టీలకు కీలకంగా మారిన మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి పేరు బయటకు వచ్చింది. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి శ్రవంతి బరిలో నిలవనున్నారు. ఈ మేరకు సీఈసీ జనరల్ సెక్రటరీ ఇన్‌ఛార్జ్ ముకుల్ వాస్నిక్ పేరిట ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి శ్రవంతి పేరును ఖరారు చేశారని, మునుగోడు బైపోల్‌లో ఆమె పోటీ చేయనున్నారని ప్రకటించారు.

కాంగ్రెస్ పార్టీకి, మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి.. బీజేపీ అభ్యర్థిగా మరోసారి మునుగోడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అంటే బీజేపీ అభ్యర్థి ఖరారైనట్లే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి పోటీలో ఎవరిని దించాలా? అని రాష్ట్ర పార్టీ నేతలు సమాలోచనలు చేశారు. అభ్యర్థి ప్రకటన ఆలస్యమైతే పార్టీకి నష్టం జరిగే ఛాన్స్ ఉందని భావించిన అధిష్టానం.. ముందుగానే అభ్యర్థిని ఖరారు చేసింది. పాల్వాయి శ్రవంతి గత ఎన్నికల్లోనూ పోటీ చేసింది.

Also Read…

శబరిమల: నిర్హేతుకతకు పరాకాష్ట

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here