పుస్తకాలు సమాజ ప్రగతికి ఉత్ప్రేరకాలు – డా. వకుళాభరణం కృష్ణమోహన్‌రావు

0
53

నగర గ్రంథాలయ సంస్థలో అరుదైన పుస్తక ప్రదర్శన ప్రారంభం

• పుస్తక ప్రదర్శనను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ డా. వకుళాభరణం కృష్ణమోహన్‌రావు.

సంఘ సంఘస్కర్తలను ప్రభావితం చేసింది పుస్తకమే.` అనేక దేశాలకు స్వాతంత్య్రం ఇచ్చింది పుస్తకమే. ` సామాజిక రుగ్మతలను, దురాచారాలను రూపుమాపింది పుస్తకమే. ఉద్యమాలకు ఊతం ఇచ్చింది పుస్తకమే. సంఘసంస్కర్తలను, తత్త్వవేత్తలను, ఉద్యమనేతలను, శాస్త్రనిపుణులను, సాంకేతిక నిపుణులను అన్ని రంగాలలో గొప్ప వ్యక్తులను తయారు చేసింది, ప్రభావితం చేసింది ‘‘పుస్తకం’’ అని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ డా. వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అన్నారు. థామస్‌ పేయిన్స్‌ రచించిన ‘‘మానవ హక్కులు’’ అనే పుస్తకం చదివి ప్రభావితం అయిన మహాత్మజ్యోతిభాపూలే గొప్ప సంఘసంస్కర్తగా చరిత్రలో నిలిచిన విషయం గమనించదగిందని డాక్టర్‌ వకుళాభరణం పేర్కొన్నారు.

55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం నాడు అశోక్‌నగర్‌లోని శ్రీ వట్టికోట ఆళ్వారుస్వామి స్మారక నగర కేంద్ర గ్రంథాలయ సంస్థ ప్రాంగణంలో రెండు పుస్తక ప్రదర్శనశాలలను డాక్టర్‌ వకుళాభరణం ప్రారంభించారు. తెలంగాణ పబ్లికేషన్స్ మరియు క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను, అలాగే గ్రంథాలయ సంస్థ ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనలను అయన ప్రారంభించారు. ఎంతగా సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినప్పటికి, పుస్తక పఠనం ఏమాత్రం తగ్గకపోవడం గమనించదగిందని డాక్టర్‌ వకుళాభరణం అన్నారు.

మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో యువతకు అనేక పుస్తకాలు గ్రంథాలయాలలో లభ్యం అవుతున్నాయని ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని గొప్పగా ఎదగాలని ఆయన సూచించారు. తెలంగాణ ప్రభుత్వం గ్రంథాలయాలలో అనేక పుస్తకాలను అందుబాటులో ఉంచడం శుభపరిణామం అన్నారు. నిధులు కూడా భారీగా కేటాయించడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నగర కేంద్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ కె.ప్రసన్న రాంమ్మూర్తి, కార్యదర్శి పి. పద్మజ, హైద్రాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ వైస్ ఛైర్మన్‌ కోయ చంద్రమోహన్‌, పబ్లిషర్‌ ఎమ్‌.సూరిబాబు, రాష్ట్ర గ్రంథాలయ ఉద్యోగుల సంఘం నాయకుడు అయోధ్య, దేవేందర్‌, ఉద్యోగులు, పలువురు ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here