ఆత్మస్థైర్యం కలిగించే రచనలు రావాలి – జూలూరు గౌరీశంకర్

0
77

విద్యార్ధులు విజయాలు సాధించటానికి, ఆత్మస్థైర్యం పొందటానికి, కావాల్సిన ఆలోచనలను అందించే రచనలు విరివిగా రావల్సిన అవసరముందని తెలంగాణ సాహిత్య అకాడమి ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. అన్ని రంగాల్లో దూసుకుపోతున్న యువత గెలుపోటముల సమయంలో మానసిక స్థైర్యం, ధైర్యంతో అడుగులు వేయటానికి కావల్సిన పరిజ్ఞానాన్ని అందిస్తూ మానసిక వికాస నిపుణులు డాక్టర్ సి. వీరేందర్ విస్తృతంగా చేసిన రచనలు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని చెప్పారు. మంగళవారం డాక్టర్ సి. వీరేందర్ రాసిన “విజయానికి దారిది” పుస్తకాన్ని జూలూరు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయాలు సాధించిన అభ్యర్థుల విజయగాథలు ఈ పుస్తకంలో ఉన్నాయని తెలిపారు. ఈ పుస్తకం విద్యార్థులకు, యువతకు ఆత్మస్థైర్యం కలిగించటంతో పాటుగా వారిని కార్యోన్ముఖులుగా తీర్చిదిద్దటానికి ఉపయోగపడతుందని చెప్పారు. రచయిత, సైక్రియాట్రిస్ట్ డాక్టర్ సి. వీరేందర్ మాట్లాడుతూ విద్యార్థులలో ప్రేరణను, నమ్మకాన్ని, ఆత్మ విశ్వాసాన్ని, తమ లక్ష్యాన్ని, ఒత్తిడిని అధిగమించి అధ్యయన నైపుణ్యాలను ఎలా పెంపొందించుకోవాలో ఇందులో తెలిపామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి కోట్ల వెంకటేశ్వర రెడ్డి, సాహిత్య విమర్శకులు కె.పి. అశోక్ కుమార్, హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఉపాధ్యక్షులు కోయ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here