ప్రముఖ కవి, అనువాదకులు నిజాం వేంకటేశం మృతి

0
83

Telangana: ప్రముఖ కవి, అనువాదకులు నిజాం వేంకటేశం ఈరోజు సాయంత్రం గుండెపోటుతో ఆకస్మికంగా మృతిచెందడం విషాదకరం. సిరిసిల్లకు చెందిన వెంకటేశం, విద్యుత్ శాఖలో ఎడిఈ గా ఉద్యోగ విరమణ చేశారు. గత 5 దశాబ్దాలుగా తెలంగాణ సాహిత్యాభివృద్ధికి కృషిచేశారు. జగిత్యాలలో పనిచేసే కాలంలో దిక్సూచి అనే కవితాపత్రికను ప్రారంభించి, ఎంతోమంది కొత్త, పాత కవులకు వేదికగా నిలిచారు. తెలుగు, ఆంగ్ల భాషలలో అనేక కవితా సంకలనాలను, పుస్తకాలను అనువాదించారు.

అల్లం రాజయ్య కథల సంకలనం భూమిని తెచ్చినవాడు వెంకటేశం. 80వ దశకంలో తెలంగాణ కవిత్వానికి చిరునామాగా నిలిచిన వెంకటేశం అలిశెట్టి ప్రభాకర్, సుద్దాల అశోక్ తేజ లాంటి ఎంతో మంది యువ కవులకు స్ఫూర్తి. ఇటీవల కేంద్ర సాహిత్య అవార్డు పొందిన పత్తిపాక మోహన్ తన బొమ్మల తాత గాంధీ పుస్తకాన్ని వెంకటేశంకు అంకితం ఇచ్చారు. వారి ఆకస్మిక మృతి పట్ల హైదరాబాద్ బుక్ ఫెయిర్ కార్యదర్శి కోయ చంద్రమోహన్ సంతాపం తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here