Ex MLA Thati Venkateswarlu Daughter: భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లా బూర్గంపాడు అశ్వరావుపేట నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కుమార్తె తాటి మహాలక్ష్మి గురువారం ఉదయం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉదయం ఎనిమిది గంటల సమయంలో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించిన మహాలక్ష్మిని చూసి కుటుంబ సభ్యులు హుటాహుటిన భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
అయితే అప్పటికే మృతి చెందడంతో మృతదేహాన్ని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఎంబీబీఎస్ పూర్తి చేసి, ప్రస్తుతం పీజీ ఎంట్రన్స్ కి ఆమె ప్రిపేర్ అవుతుంది. ఆత్మహత్యకు గల సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. ఈ విషయం తెలుసుకోని పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు తాటి ఇంటికి చేరుకుంటున్నారు. మహాలక్ష్మి మృతితో మాజీ ఎమ్మెల్యే తాటి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.
Also Read…