1000 ఉద్యోగాలు కల్పించేందుకు గ్రిడ్ డైనమిక్స్ కార్యాచరణ…

0
212

Hyderabad: ప్రముఖ డిజిటల్ కన్సల్టింగ్ కంపెనీ గ్రిడ్ డైనమిక్స్ కంపెనీ హైదరాబాద్ లో తన కార్యకలాపాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. అంతర్జాతీయంగా కంపెనీ తన విస్తరణ ప్రణాళికలో భాగంగా సోమవారం భారతదేశంలో తన కార్యకలాపాలను హైదరాబాద్ కేంద్రంగా ఎంచుకున్నట్లు తెలిపింది. ఈ సంవత్సరాంతానికి ఇక్కడి నుంచి సుమారు 1000 మంది ఉద్యోగులు కంపెనీ కోసం పని చేయనున్నట్లు ఈరోజు మంత్రి కే తారకరామారావుతో జరిగిన సమావేశంలో కంపెనీ సీనియర్ ప్రతినిధి బృందం తెలియజేసింది. కంపెనీ సీఈఓ Leonard Livschitz ఈరోజు తన ప్రతినిధి బృందంతో మంత్రి కెటీఆర్ ని హైదరాబాద్ లో ప్రగతి భవాన్లో కలిశారు.

హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ స్థాయి అత్యుత్తమ మౌలిక సదుపాయాలతో పాటు అద్భుతమైన ఏ గ్రేడ్ కార్యాలయాలు అందుబాటులో ఉన్నాయని, అన్నిటికన్నా ప్రధానంగా ఉన్నత విద్యా ప్రమాణాలు, నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు ఇక్కడ అందుబాటులో ఉన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అందుకే తమ కంపెనీ విస్తరణ ప్రణాళికలకు భారత్ లో తెలంగాణ రాష్ట్రాన్ని తెలిపారు.

హైదరాబాద్ నగరం అంతర్జాతీయ స్థాయి మల్టీనేషనల్ కంపెనీలను ఆకర్షించడంలో తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తుందని మంత్రి కే. తారక రామారావు ఈ సందర్భంగా తెలియజేశారు ఇందులో భాగంగానే ఈ రోజు గ్రిడ్ డైనమిక్స్ హైదరాబాద్ నగరాన్ని తన కార్యకలాపాలకు ఎంచుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు కంపెనీని హైదరాబాద్ నగరానికి ఆహ్వానించారు. హైదరాబాద్ నగరం కేంద్రంగా కంపెనీ భారతదేశంలో పెద్ద ఎత్తున విస్తరిస్తున్నదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ కంపెనీకి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కంపెనీ సీనియర్ ప్రతినిధి బృందం మరియు మంత్రి కే తారకరామారావు హైదరాబాద్ గత ఏడు సంవత్సరాల్లో అనేక రకాలైన మల్టీ నేషనల్ కంపెనీల ప్రపంచ దిగ్గజ కంపెనీలు హైదరాబాద్కు ఆకర్షించిన తీరు, ఇక్కడ ఉన్న అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. హైదరాబాద్ నగరంలో కంపెనీ తన కార్యకలాపాల నిర్వహణ కోసం అవసరమైన అన్ని రకాల ప్రభుత్వ సహాయ సహకారాలను అందిస్తామని ఈ సందర్భంగా కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు.

Also Read…

Jahangirpuri violence: పోలీసులు ఏమి చేస్తున్నారు ? ఢిల్లీ పోలీసులకు కోర్టు సూటి ప్రశ్న

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here