Mancherial :మంచిర్యాల జిల్లా కోనూర్ గ్రామానికి చెందిన పెరుమాండ్ల యశోద కుమారుడు ప్రవీణ్ అనే 25 సంవత్సరాల యువకుడు 12 04.2021న ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. యువకునికి తల్లి, అక్క బావ కలరు, మృతుడి తల్లికి, వారి కుటుంబ సభ్యులకు మూడు లక్షల యాబై వేల నగదు, మరో మూడు లక్షల యాబై వేల రూపాయల డిడి మొత్తం ఏడు లక్షల రూపాయలు యువ ఫౌండేషన్ ద్వారా చేయూత నిప్పించి మానవత్వం చాటిన హైకోర్టు న్యాయవాది, తెలంగాణ జాగృతి రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులు మరియు యునైటెడ్ అడ్వొకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు అక్కల తిరుపతి వర్మ గారు. వారికి వారి కుటుంబానికి చేయూతనిస్తామని అక్కల తిరుపతి వర్మ గారు తెలియజేయడం జరిగింది.
ఈ సంధర్భంగా తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి, తిరుపతి వర్మ కు, గోళ్ల కోటేశ్వర్ కు కృతజ్ఞతలు మృతుని కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి వర్మ తో పాటు మృతుని అక్క బావ రజిత సురేషులు, బంధువు గణేష్, మృతుని కుటుంబానికి చేయూత నిచ్చిన డాక్టర్ భాస్కర్, న్యాయవాదులు సుధాకర్, రఘువీరారెడ్డి, మహేందర్ రెడ్డి, కేశవ్ లు పాల్గొన్నారు