Jayaraju: ప్రజా వాగ్గేయకారులు, ప్రకృతి కవి జయరాజు రచించిన “అవని” ఇంగ్లీష్ పుస్తకావిష్కరణ కార్యక్రమం శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ పుస్తకాన్ని ప్రముఖ దర్శకులు బి నర్సింగరావు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తంగెడ కిషన్ రావు, ప్రొఫెసర్ ఖాసిం, ప్రముఖ కవి కోయి కోటేశ్వరరావు, పర్యావరణ వేత్త దుశ్చర్ల సత్యనారాయణ, జేవివి రమేష్, డా. వర్లు తదితరులు పాల్గొన్నారు.
All the Rights reserved @ Managed and Maintained By New Era Media Solutions