స్థానిక సంస్థల రాజకీయ ప్రాధన్యతలో వెనుకబడిన తరగతుల్లోని ఏ గ్రూపులో ఉన్న 24శాతం బిసి వర్గాలకు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఆన్యాయమే జరుగుతున్నదని, బి.సి రిజర్వేషన్ లో జరుగుతున్న ఆన్యాయాన్ని సరిదిద్దాలని
జననాయక్ కర్పూరి టూకూర్ వెల్ఫేర్ ట్రస్టు ప్రతినిధులు రిటైర్డ్ ఎస్.పి దుగ్యాల ఆశోక్, రిటైర్డ్ డీఆర్డీవో అడిషనల్ డైరెక్టర్ కె. వెంకటేశ్వర్ రావు , రిటైర్డ్ అడిషనల్ డిప్యూటి పోలీస్ కమిషనర్ రావుల పాటి వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయ సంఘం రాష్ట నాయకులు దేవరకొండ సైదులు, బి.సి నాయకులు కోల శ్రీనివాస్ ఆదివారం సాయంత్రం రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసైని కలిసి వినతి పత్రం అందజేశారు.
గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్తులల్లో ఏ,బి,సి,డి వర్గీకరణ లేకపోవడం వల్ల రాజ్యంగ ఫలాలను బిసిలోని ఏ గ్రూపు ఉన్న సామాజిక వర్గం ప్రజలు అందుకోలేకపోతున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు.