తెలంగాణ RahulGandhi: ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ రాహుల్ శ్రీకారం !!

RahulGandhi: ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ రాహుల్ శ్రీకారం !!

Rahul Gandhi: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి రాహుల్ గాంధీ వరంగల్ లో శుక్రవారం శ్రీకారం చుడుతున్నారు. ఆయన పర్యటనతో రాజకీయంగా మైలేజ్ సంపాదించడానికి తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది.అన్ని రాజకీయ పార్టీల్లో రాహుల్ గాంధీ పర్యటన పైనే చర్చ జరుగుతుంది.సెంటిమెంట్ రాజకీయాలు ‘తల్లివేరు’గా ఉన్న టీఆర్‌ఎస్‌ను అదే సెంటిమెంట్ తో దెబ్బకొట్టాలన్నది టీపీసీసీ కాన్సెప్ట్.ఓయూ విద్యార్థులు తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన విషయంలో ఎవరికీ భిన్నాభిప్రాయం లేదు. ‘ఓయూ’ కేంద్రంగా రాజకీయం నడపాలని,అధికార టిఆర్ఎస్ ను డిఫెన్సులో పడేయాలని టీపీసీసీ భారీ వ్యూహాన్ని రచించింది.

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు ‘పికప్’ కాలేకపోతున్నదో రాహుల్ గాంధీ తన పర్యటనలో తెలుసుకోబోతున్నారు.పార్టీ కార్యకర్తలతో,పొలిటికల్ అఫైర్స్ కమిటీతోనూ ఆయన సమావేశమవుతారు. అనుమతి లభించకపోయినా రాహుల్ గాంధీని ఓయూకు తీసుకెళ్లడానికే రాష్ట్ర కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. రాహుల్ గాంధీ ఓయూకి రాకుండా అడ్డుకుంటున్నారన్న ప్రచారాన్ని జనాల్లోకి బలంగా తీసుకువెళ్లనున్నది. రాహుల్ గాంధీ ఓయూ పర్యటనకు అనుమతిని ఓయూ వైస్ ఛాన్సలర్ తిరస్కరించారు. ఇందుకు గాను నిరసన చేపట్టిన విద్యార్థులను అరెస్ట్ చేశారు. వాళ్ళు చంచల్ గూడ జైలులో ఉన్నారు. విద్యార్థి నాయకులపై అక్రమ కేసులు పెట్టారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి, గీతారెడ్డి తదితర నాయకులు చంచల్ గూడ జైలుకు వెళ్లి పరామర్శించారు. జైలు సూపరింటెండెంట్ ను కలిసి మే7న రాహుల్ గాంధీ ములాఖత్ కావడానికి అనుమతి కోరారు.రాహుల్ ను చంచల్ గూడ సెంట్రల్ జైలు, ఉస్మానియా యూనివర్సిటీకి తీసుకు వెళ్లాలన్న ప్రణాళికను అమలుచేయాలని సంకల్పించారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలతో 7న గాంధీ భవన్ లో రాహుల్ గాంధీతో లంచ్ మీటింగ్ ఏర్పాటు చేశారు.రాహుల్ గాంధీ రైతు కుటుంబాలతో ముచ్చటించనున్నారు. రైతు డిక్లరేషన్ ను ప్రకటించనున్నారు. తెలంగాణపై రాహుల్ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారని ఆయన నిర్ణయించారు. ఢిల్లీలో జరిపిన సమావేశాలు,పార్టీ నాయకులతో సమీక్ష,వరంగల్ సభకు హాజరవుతుండడం.రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకు పూనుకున్నారు.ఆయనకు ఎదురుతిరిగే అసమ్మతి నాయకులకు చెక్ పెట్టనున్నారు.

రాహుల్ గాంధీ ఢిల్లీ సమావేశం ‘వర్కవుట్’ అవుతోంది. ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే జగ్గారెడ్డి సహా అసమ్మతి నాయకులు నిశ్శబ్దాన్ని ఆశ్రయించారు. పార్టీ నాయకులను ఒక్క తాటిఫై నడిపేందుకు రాహుల్ బృందం ప్రయత్నిస్తోంది.టీపీసీసీ పదవి ఆశించి భంగపడిన పార్టీ ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డిని పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా నియమించడం అందులో భాగంగా జరిగినదే. రాహుల్ గాంధీ 2019 ఎన్నికల తర్వాత తొలిసారిగా మే 6,7 తేదీల్లో పర్యటిస్తున్నారు. పార్టీ డిజిటల్‌ సభ్యత్వ నమోదులో దేశంలోనే తెలంగాణ ప్రధమ స్థానంలో ఉంది. సభ్యత్వ నమోదు ముగిసే సమయానికి 40 లక్షలకు పైగా సభ్యత్వాలు నమోదయ్యాయి.

గత మూడు నాలుగు నెలల్లో రాష్ట్ర రాజకీయాలు కేసీఆర్, బీజేపీ చుట్టూ పరిభ్రమిస్తున్నవి.తాజాగా రాహుల్ గాంధీ పర్యటన చుట్టూ రాజకీయాలు కేంద్రీకృతమవుతున్నవి. ఈ పరిణామం కాంగ్రెస్ లో ఉత్తేజం నింపుతోంది.రాహుల్ గాంధీ పర్యటనతో కాంగ్రెస్ ‘ప్రధాన స్రవంతి’ లోకి వచ్చినట్టు కనిపిస్తోంది.నిన్న మొన్నటిదాకా కాంగ్రెస్ వెనుక బెంచీలో ఉన్న వాతావరణం కనిపించింది. తాజాగా బీజేపీని ఓవర్ టేక్ చేసి ముందుకు దూసుకుపోవడానికి కార్యాచరణ ప్రణాళికను రేవంత్ రెడ్డి అమలు చేయనున్నారు.

తెలంగాణలో బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీకి గట్టి పునాదులున్న విషయాన్ని ఎవరూ విస్మరించరాదు. చాలా నియోజకవర్గాల్లో ‘పొటెన్షియల్ ‘ అభ్యర్థులు కూడా ఉన్నారు.పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలున్నారు. ఇరవై శాతానికి పైగా స్థిరమైన ఓటు బ్యాంకు ఉన్నది. అధికారపార్టీతో పాటు ఇతర పార్టీల నుంచి ప్రముఖులు, ఉద్యమ నేపధ్యం ఉన్న నాయకులను బీజేపీ ఆకర్షిస్తున్నది.ఈటల రాజేందర్,జిట్టా బాలకృష్ణారెడ్డి,భిక్షమయ్య గౌడ్ వంటి వారంతా బీజేపీలో చేరిపోతున్నారు కానీ కాంగ్రెస్ లో చేరేందుకు వెనుకాడుతున్నారు. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం బలహీనంగా ఉండడం, కాంగ్రెస్,టిఆర్ఎస్ మధ్య పొత్తులు ఉంటాయన్న అనుమానంతో వారు బీజేపీ వైపు మొగ్గు జూపుతున్నారు.అందుకే కాంగ్రెస్ కూడా సీనియర్ నాయకుడు జానారెడ్డి నాయకత్వంలో ‘చేరికల కమిటీ’ ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించినా వాళ్ళు కాంగ్రెస్ లోనే ఉంటారన్న హామీ లేదు.తిరిగి టిఆర్ఎస్ కు వెళ్ళిపోతారని ప్రజల్లో బలంగా నాటుకుపోయింది.

కాంగ్రెస్ పార్టీ ఇంటా,బయటా పలు సవాళ్లను ఎదుర్కుంటున్నది.రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలోనూ ఆ పార్టీ పరిస్థితి దారుణంగా ఉన్నది.కాగా తెలంగాణలో కాంగ్రెస్ దూకుడు పెంచింది..రాహుల్ పర్యటనతో దూకుడు ఉధృతి ఇంకా పెరగవచ్చు. రాహుల్ తెలంగాణ పర్యటనలో ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారన్నా అంశంపై చర్చ జరుగుతున్నది.మసకబారిన పార్టీని తిరిగి గాడిలో పెట్టవలసి ఉన్నది. .

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని ఆ పార్టీ సీనియర్లు భావిస్తున్నారు.2023 ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరుపై నాయకులు,కార్యకర్తలకు రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేయనున్నారు.ఇదిలా ఉండగా టిఆర్ఎస్ ‘వ్యూహాత్మక తప్పిదం’ మూలంగానే బీజేపీ పుంజుకుంటుందన్న అభిప్రాయాన్ని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.దుబ్బాక,హుజురాబాద్ ఉపఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ పెర్ఫార్మెన్స్ ను తక్కువ అంచనా వేశారా ? లేక ఉద్దేశ పూర్వకంగానే బిజెపి ‘బలపడే’ విధంగా పరోక్ష ప్రణాళికను అమలు చేశారా ? అనే అంశాలపై భిన్నాభిప్రాయాలున్నవి.

కాంగ్రెస్ ను ‘ఖతం’ చేయాలన్న ధోరణి బీజేపీ పుంజుకోవడానికి కారణమవుతున్నట్టు ఒక విశ్లేషణ ఉన్నది.అందువల్ల కాంగ్రెస్ కూడా పుంజుకోవడమే తమకు రాజకీయంగా ప్రయోజనం కలిగిస్తుందని టిఆర్ఎస్ నిర్మాత కేసీఆర్,పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భావిస్తు ఉండవచ్చు.ప్రభుత్వంపై ఉండే వ్యతిరేకతను విపక్షాలు ఏ మేరకు చీల్చితే ఆ మేరకు పార్టీ విజయావకాశాలు మెరుగుపడవచ్చునన్న ‘థియరీ’ పై చర్చలు జరుగుతున్నవి. కాంగ్రెస్,బీజేపీ,బీఎస్పీ,ఆప్,షర్మిల పార్టీ తదితర రాజకీయపక్షాలు ‘యాంటీ ఇంకంబెన్సీ’ ఓట్లు చీల్చుకుంటే ‘సానుకూల’ ఓట్లతో గట్టెక్కవచ్చునన్న టిఆర్ఎస్ భావనను తోసిపుచ్చలేం.మొత్తమ్మీద చతికిలపడిన కాంగ్రెస్ బలోపేతం కావడం తమకు అవసరమని అధికార పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నారు.ముక్కోణపు పోటీని టిఆర్ఎస్ కోరుకుంటున్నట్టుగా అర్ధం చేసుకోవడం కష్టమేమీ కాదు.

Zakeer,Editor,
Bunker News:

Also Read:

వర్సిటీల్లో అధ్యాపకుల పదవీ విరమణపై కీలక నిర్ణయం…

స్మితా సబర్వాల్‌ కు హైకోర్టు షాక్… ఆ పని చెయ్యాల్సిందే

RELATED

Avani: ఘనంగా జయరాజు ‘అవని’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ…

Jayaraju: ప్రజా వాగ్గేయకారులు, ప్రకృతి కవి జయరాజు రచించిన "అవని" ఇంగ్లీష్ పుస్తకావిష్కరణ కార్యక్రమం శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ పుస్తకాన్ని ప్రముఖ దర్శకులు బి నర్సింగరావు,...

మతాలను రాజకీయం చేయొద్దు

మతం ఉచ్చులో బందీ అయ్యి అన్య మతస్తులను రెచ్చగొట్టే విధానాలకు స్వస్తి పలకాలి. రాజకీయ పార్టీలు, ఆధ్యాత్మిక సంస్థలు మతాలను రాజకీయం చేయొద్దు. మతం వ్యక్తిగతమని, సామూహిక మైన దైనా సమ్మతమైన జీవన విధానానికి...

KTR: ప్రధాని మోడీ గారు.. తెలంగాణ నుంచి పాఠాలు నేర్చుకోండి

● ఆవో-దేఖో-సీకో (Aao-Dhekho-Seekho) అంటూ ప్రధానమంత్రి మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ● జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి వికాసం...

Avani: ఘనంగా జయరాజు ‘అవని’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ…

Jayaraju: ప్రజా వాగ్గేయకారులు, ప్రకృతి కవి జయరాజు రచించిన "అవని" ఇంగ్లీష్ పుస్తకావిష్కరణ కార్యక్రమం శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ పుస్తకాన్ని ప్రముఖ దర్శకులు బి నర్సింగరావు,...

మతాలను రాజకీయం చేయొద్దు

మతం ఉచ్చులో బందీ అయ్యి అన్య మతస్తులను రెచ్చగొట్టే విధానాలకు స్వస్తి పలకాలి. రాజకీయ పార్టీలు, ఆధ్యాత్మిక సంస్థలు మతాలను రాజకీయం చేయొద్దు. మతం వ్యక్తిగతమని, సామూహిక మైన దైనా సమ్మతమైన జీవన విధానానికి...

KTR: ప్రధాని మోడీ గారు.. తెలంగాణ నుంచి పాఠాలు నేర్చుకోండి

● ఆవో-దేఖో-సీకో (Aao-Dhekho-Seekho) అంటూ ప్రధానమంత్రి మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ● జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి వికాసం...

కార్పొరేషన్ చైర్మన్లుగా ఆ ముగ్గురు నియామకం

రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. తెలంగాణ ఫుడ్స్ చైర్మన్‌గా మేడె రాజీవ్ సాగర్, తెలంగాణ అధికార భాషా సంఘం చైర్మన్‌గా మంత్రి శ్రీదేవి, తెలంగాణ ఉర్దూ అకాడమీ...