Karimnagar: కోటి యాభై లక్షలు రోడ్డు పాలు…

0
77

చొప్పదండి మున్సిపాలిటీ పరిధిలోని పాత ఎదురగట్ట నిర్మాణం నాణ్యత పూర్తిగా లోపించడంతో రోడ్డు మొత్తం గుంతలుగా మారిందని, కనీస అర్హత లేని విద్యాసంస్థల యజమానులైన కాంట్రక్టర్ లకు ఇవ్వడం వల్లనే కోటి యాబై లక్షలు నీటిపలు అయ్యాయని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ ఆరోపించారు. మంగళవారం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణాన్ని సందర్శించారు.

అనంతరం బండారి శేఖర్ మాట్లాడుతూ అయ్యప్ప కన్స్ట్రక్షన్ పేరుతోటి ప్రైవేట్ విద్యా సంస్థ యజమాన్యాలకు రోడ్ల నిర్మాణం కాంట్రాక్టు ఇవ్వడం వలన కనీసం నియమ నిబంధన పాటించకుండా నాణ్యతలేని రోడ్డును నిర్మించారని ఆరోపించారు. చిన్నపాటి వర్షానికి రోడ్డు ఇరువైపులా పగిలిపోవడం గుంతలు పడడం, కల్వర్ట్లు పూర్తిగా చెడిపోయ్యాయని అన్నారు.

అధికారులు కాంట్రాక్టర్ల యొక్క నిర్లక్ష్యం ఫలితంగా రోడ్డు మెత్తం అస్తవ్యస్తంగా తయారైందని ప్రజల సొమ్ము వృధా అయ్యిందని ఆరోపించారు. అయ్యప్ప కన్స్ట్రక్షన్ ను బ్లాక్ లిస్టులో పెట్టాలని, కాంట్రక్టర్ లపై క్రిమినల్ కేసులు పెట్టాలని, రోడ్డు నిర్మాణానికి వృధా చేసిన డబ్బులును కక్కించాలని డిమాండ్ చేశారు. ఈ రోడ్డు నిర్మాణంపై జిల్లా కలెక్టర్ కు, క్వాలిటీ కంట్రోల్ మరియు విజిలెన్స్ వాళ్ళకి దరఖాస్తు పెడతామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా నాయకులు బెక్కంటీ రమేష్, చొప్పదండి నియోజకవర్గ నాయకులు గొల్లపల్లి ప్రశాంత్, కుమార్, ఏ. మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here