కమ్యునిస్టు విప్లవ కారులు కా. తరిమెల నాగిరెడ్డికి విప్లవ జోహార్లు- గోలి కృష్ణ

0
129

కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి ఒక సంపన్నమైన కుటుంబంలోజన్మించారు. అయన తన జీవితాంతం వరకు భారత దేశంలో విప్లవోద్యమ నిర్మాణాన్ని, విప్లవ కారుల ఐక్యం చేసే విప్లవ కృషిని కొనసాగిస్తూ 1976 జూలై 28న
అమరులైనారు. కామ్రేడ్ దేవులపల్లి వెంకటేశ్వరరావు సహచర కామ్రేడ్ గా భారత విప్లవ ప్రజా పంథా రూపకల్పనలో అయన ఒకరు. అయన ఉమ్మడి కమ్యునిస్టు పార్టీలో జాతీయ సమితి సభ్యులుగా పని చేసినారు.
1968- 69 సం: రాల కాలంలో విప్లవ కారుల కమిటీకి కన్వీనర్ గాను, 1975 ప్రారంభంలో భారత కమ్యునిస్టు విప్లవ కారుల సమన్వయ కమిటీకి కన్వీనర్ గా వ్యవహరించారు.

భారత కమ్యునిస్టు విప్లవ కారుల సమైక్యతా కేంద్రం ( మార్క్సిస్టు – లెనినిస్ట్ )ఏర్పాటులో ప్రముఖ పాత్ర వహించి,అయన అమరులయ్యేనాటికి కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు. 1952 లో నీలం సంజీవరెడ్డిని ఓడించి, అనంతపురం నియోజకవర్గం నుండి యం.ఎల్. ఏ గా గెలిచారు. 1957 నుండి1962 వరకు అనంతపురం నియోజక వర్గం నుండి పార్లమెంట్ సభ్యులుగానూ, 1962 పుట్లూరు. నియోజక వర్గం,1967 లో అనంత పురం నుండి యం.ఎల్. ఏ.గా గెలిచి 1969 మార్చి 16 దాకా కొనసాగి, తన సుదీర్ఘ అసెంబ్లీ,పార్లమెంటరీ జీవితంలో వచ్చిన అనుభవాలతో,” పార్లమెంట్లు,అసెంబ్లీలు బాతాఖానీ షాపులనీ” పార్లమెంట్ పంథాను తిరస్కరిస్తూ రాజీనామా చేసినారు. దోపిడి వర్గ పాలనకు వ్యతిరేకంగా ప్రజల ప్రత్యక్ష కార్యాచరణ ద్వారా సమీకరించి,విప్లవోద్యమ నిర్మాణానికి పూనుకున్నారు.

కా.తరిమెల నాగిరెడ్డి సుమారు నాలుగు దశాబ్దాల పాటు సాగిన అయన రాజకీయ జీవితమే ఒక గొప్ప పోరాటం. ముందు బ్రిటీష్ వలస పాలకులతో,తరువాత కాంగ్రెసు పాలకులతో అయన సాగించిన పోరాటం ఉజ్వలమైనది.ఈ పోరాటంలో అయన గడించిన అనుభవాలు అమూల్యమైనవి. అనుభవ సుసంపన్నమైనవి. అయన విద్యార్థి దశ ఋషి వ్యాలి స్కూల్ తో మొదలైనది. సంపన్న వర్గాలకు చెందిన విద్యార్థులు చదువుకొనే స్కూల్ అది. ఆ స్కూల్లోనీ విద్యార్థులకు చదువుతో పాటు జీవితంలో ఉండవలసిన ఉత్తమ క్రమశిక్షణ,సత్య సందత లాంటి సంస్కార యుతమైన జీవితాన్ని అలవర్చుకోవడానికి స్కూల్ నందు శిక్షణ ఇచ్చే వారు. ఆ స్కూల్లో కా. టి.యన్. మంచి విద్యార్థిగా రాణించారు. కా. టి.యన్.1937 -38 లో కాశీ ( బెనారస్ ) విశ్వ విద్యాలయ, విద్యార్థి యూనియన్ అధ్యక్షునిగా ఎన్నికైనారు. వాళ్ళ అమ్మకు వ్రాసిన ఉత్తరంలో తనకు 260 ఓట్లు రాగా, తన ప్రత్యర్థికి 66 ఓట్లు వచ్చాయని వ్రాసినాడు.దీన్ని బట్టి కా, నాగిరెడ్డిగారికి విద్యార్థి దశనుండే నాయకత్వ లక్షణాలు ఎంత మెండుగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చును.

అయన మంచి వక్త,పార్లమెంటులోనూ అసెంబ్లీలోనూ అయన చేసిన ప్రసంగాలు విషయ సంపదతో కూడుకొని
ఉండేవి.సునిషిత పరిశీలన,అపరిమిత పరిశోధన,అనిర్వచిత పరిజ్ఞానం,నిర్దిష్ట అవగాహణ కలిగిన వారు.అందుకే కామ్రేడ్ నాగిరెడ్డి గారు తన ప్రసంగాల ద్వారా విలువైన మాటలను అయధాలుగా ప్రజల మనసులో నింపగలిగేవారు.కామ్రేడ్ నాగిరెడ్డి గారు శాస్త్రీయ సిద్ధాంతమైన మార్క్సిజాన్ని అధ్యయనం చేసి ఆచరించిన కమ్యూనిస్టు నాయకులలో ముఖ్యులు అయన జీవిత కాలం 59 సం: రాలే అయినా ఈ కాలంలో ఒక నిజమైన మార్క్సిస్టు – లెనినిస్ట్ గా అయన కమ్యూనిస్టు విప్లవోద్యమానికి చేసిన కృషి అపారమైనది.

మార్క్సిస్టు – లెనినిస్ట్ దృక్పథంతో ” తాకట్టులో భారత దేశం ” అనే గ్రంధం, దేశంలో సామ్రాజ్యవాద దోపిడి,అర్ధవలస పరిస్థితులను శాస్త్రీయ పరిశీలనా దృష్టితో,రాయడం అయన విషయ పరిజ్ఞానానికి దర్పణంగా నిలుస్తోంది.ఈ రోజుల్లో దోపిడి పాలక వర్గాల నికృష్టమైన దోపిడిని,ప్రజలు అనుభవించే దారుణమైన బాధలు గూర్చి వర్ణించి చెప్పడమే మార్క్సిజమని అనుకొనే వారున్నారు.ఇలాంటి వర్ణనలు చేసే వారిలో మార్క్సిస్టు పార్టీలో,ఇతర మేధావి వర్గంలో అనేక మంది కనపడతారు. వారి దృష్టిలో దోపిడిని అర్ధం చేసుకోవడం దాన్ని గురించి చెప్పడం మాత్రమే మార్క్సిజంగా భావిస్తారు.వర్గ పోరాటాలను నిర్మించి,శ్రామిక వర్గ నాయకత్వాన ముందు జనతా ప్రజాతంత్ర విప్లవాన్ని,ఆ తర్వాత శ్రామిక వర్గ నియంతృత్వాన్ని స్థాపించి సోషలిజాన్ని నిర్మించాలనే లక్ష్యాలను,ఆచరణను కలిగి ఉండరు.

కాగా,మన దేశంలో వర్తక, వ్యాపారం కోసం ప్రవేశించిన బ్రిటీష్ సామ్రాజ్య వాదులు పూడలిజంతో రాజీ చేసుకొన్నారు.పలితంగా ఫ్యూడల్ వ్యతిరేక భుర్జువా ప్రజాతంత్ర విప్లవం మన దేశంలో పరిపూర్తీ కాలేదు. కాబట్టి,ఇది చెప్పి ఆచరించినప్పుడే వారు నిజమైన మార్క్సిస్టు – లెనినిస్ట్ లు అవుతారు.భారత దేశ దోపిడి సామాజిక పరిస్థిలకు మార్క్సిజాన్ని అన్వయిచని వారు, మార్క్సిజం నుండి వైదొలగిన వారంతా మార్క్స్ గురించి,మార్క్సిజాన్ని గురించి ప్రతి రోజు వల్లిస్తూ తాము మార్క్సిజాన్ని అనుసరిస్తున్నట్లు చెప్పుకుంటారు.ఇది చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్మడం లాంటిదే అంటే అతిశయోక్తి కాదేమో! కారల్ మార్క్స్ అభివృద్ది చెందిన యూరప్ పెట్టుబడి దారీ దేశ సమాజాల గురించి చేసిన విశ్లేషణలు,సూత్రీకరణలు అర్థ వలస,అర్థ ఫ్యూడల్ భూస్వామ్య వ్యవస్థ గల మన దేశ సమాజానికి అన్వయించ బడతాయని స్వీయ మానసిక దృష్టిని కొందరు ప్రదర్శిస్తున్నారు. రష్యాలో లెనిన్ ఆ దేశ నిర్దిష్ట పరిస్తితులకు మార్క్సిజాన్ని అన్వయించి పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాద అతున్నత దశలో కార్మిక వర్గ సాయుధ తిరుగు బాటు ద్వారా విప్లవం విజయ వంతం చేసినారు.

అర్థ వలస, అర్థ ఫ్యూడల్,వెనుక బడిన దేశమైన చైనాలో మావో వ్యవసాయక విప్లవం,దీర్ఘకాల ప్రజా యుద్ద పంథా ద్వారా విప్లవాన్ని విజయ వంతం చేసి మార్క్సిజాన్ని మరితంగా అభివృద్ది చేసినారు.విప్లవాలు విజయ వంతమైన ఆ రెండు దేశాల్లోని సామాజిక పరిస్తితులకు మార్క్సిజాన్ని అన్వయించి మరింతగా సుసపన్నం చేసిన అంశాన్ని చూడ వచ్చును.అర్థ వలస,అర్థ ఫ్యూడల్ భూస్వామ్య వ్యవస్థ కలిగిన భారత దేశంలో కూడా వ్యవసాయక విప్లవం,దీర్ఘ కాల ప్రజాయుద్ద పంథా ద్వారా విప్లవం విజయ వంతం చేయాలనే కమ్యూనిస్టు విప్లవ కారులు మావో ఆలోచనా విధానాన్ని తమ ప్రాపంచిక దృక్పదంగా స్వీకరించినారు.ఈ ఐదు దశాబ్దాల కాలంలో దేశంలో భూకేంద్రి కరణలో కొన్ని మార్పులు జరిగినవి. వ్యవసాయంలో పెట్టుబడి దారీ సంభందాలు అభివృద్ది అయినాయి.

తెలంగాణలో విప్లవ కమ్యునిస్టు ఉద్యమాల ప్రభావంతో ఫ్యూడల్ దోపిడి బందనా రుపాల్లో కొన్ని మార్పులు జరిగినవి. గ్రామాల్లో నయా భూస్వామ్య వర్గం అభివృధి చెందినది.ఈ పరిస్థితిని సువిశాలమైన భారత దేశానికి సార్వత్రికం చేయలేము.ఈ నాటికి దేశ జి.డి.పి.లో వ్యవసాయ రంగానిదే అత్యధిక వాటా.60 శాతం మంది ప్రజలు వ్యవసాయ ఉత్పత్తి రంగంలో పాల్గొంటున్నారు.వారినివిప్లవోద్యమానికి సిద్దం చేయకుండా,వారు పాల్గొనకుండా ఏ విప్లవం విజయవంతం కాదు. వ్యవసాయమే ప్రధాన ఉత్పత్తి రంగమైన మన దేశంలో మౌలిక మార్పులు జరగ కుండా దేశాభివృద్ధికి చోటే ఉండదు.దేశంలో భూస్వామ్య విధానం రద్దుకాలేదు,ప్రజల చెతుల్లోకి భూములు రాలేదు.ఇప్పటికీ వ్యవసాయక విప్లవం దున్నే వానికి భూమి – భూస్వామ్య విధానం రద్దు, కేంద్ర నినాదం యొక్క ప్రాసంగికత తగ్గలేదు.ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నుండి బి.టి. రణదివ్వే పంథాగా చలా మని అయిన కార్మిక వర్గ తిరుగు బాటు పంథా,ప్రస్తుతం సోషలిస్టుల పేరుతో ప్రతిపాదించ బడుతున్న సోషలిస్టు విప్లవ పంథా భారత విప్లవాన్ని ఇంకా దశాబ్దాలుగా వాయిదా వేయడానికి మాత్రమేననే విషయం సుస్పష్టం.

అర్థ,ఫ్యూడల్ భూస్వామ్య వ్యవస్థ యొక్క కబందహస్తాల నుండి దేశం విముక్తి పొందలేదు.పలితంగా
దేశం పారిశ్రామిక అభివృద్ది సాధించలేదు.ప్రపంచ ఆకలి శూచికలో 116 దేశాలలో మన దేశం ఆఫ్రికన్ దేశమైన నైజీరియా తరువాత మనది101 వ స్థానం.భారత దేశంలో ప్రతి రోజూ ఎడు వేలు, సంవత్సరానికి 25 లక్షల మంది ప్రజలు ఆకలితో చనిపోతున్నారు. ( జస్టీస్ లావు నాగేశ్వరరావు సుప్రీం కోర్టు న్యాయ మూర్తి ) భారత దేశంలో భూస్వామ్యంతో పాటు ప్యూడల్ వ్యవస్థగత రూపంగా కుల వవ్యవస్థ కొనసాగు తుంది. దోపిడి పాలక వర్గాల వారు,పార్లమెంటరీ ప్రతిపక్షాల వారు,కులాల బూర్జువా వర్గ నాయకులు,కుల సంఘాల వారు ఈ దేశంలో కుల వ్యవస్థను నిర్మూలించ బడాలని కోరుకోవడం లేదు.కుల వ్యవస్థ పునాదుల మీద తమ దోపిడి ప్రయోజనాలను,అధికార దాహాన్ని తీర్చుకోవాలని ప్రయత్నింస్తున్నారు.

ప్రజల్లో కుల చీలికలను పెంపొందించేందుకు క్రింది కులాల పెటీ బూర్జువా శక్తులను కులం కార్డుతో రెచ్చగొట్టి తమ స్వార్థ పూరిత రాజకీయ ప్రయోజనాలకు సాధనాలుగా వాడుకుంటున్నారు. క్రింది కులాల్లో రాజకీయ విబజన,కులవిబజన రెండు ఉన్నాయి.కుల విబజన దానంతట అదే ప్రమాదం కాదు.కానీ కుల తత్వం ప్రమాదకరం.”కులతత్వం రాజకీయ నీచుడి మొదటి అస్త్ర”గా కా.డి.వి. ఒక పత్రిక ఇంటర్వ్యులో పేర్కొన్నారు. దోపిడి పాలక వర్గాల వారు తమ ఎన్నికల అవసరాల కోసం డా: అంబేడ్కర్ ను అనునిత్యం స్తుతిస్తూ కుల వ్యవస్థ బల పడడం కోసం అనేక నిర్మాణ యుత చర్యలు తీసుకొంటన్నారు కులవ్యవస్థ మన దేశంలో భౌతిక పునాధి అంశం,ఉపరి తల అంశం కాదు.

ఒక అవశేషం ఎంత మాత్రం కాదు.సాంఘిక సంస్కరణ వాద ఉద్యమాలు, కులాంతర వివాహాలు,చట్టాల ద్వారా కుల వ్యవస్థ నిర్మూలించ బడదనే శతాబ్దాల అనుభవంలో రుజువుతోంది.కుల వ్యవస్థ నిర్మూలించ బడక పోగా,అస్తిత్వ, ఆత్మగౌరవ,ఉపకుల ఉద్యమాల పేరుతో కొత్త రూపాల్లో తలెత్తు తున్నది.ఈ కొత్త రూపాల్లో భాగమే లాల్ – నీల్ ఐక్యత నినాదం.” శ్రామిక వర్గ ప్రజలను వర్గ పోరాటం నుండి దారి మళ్లించడానికి చేసే కుట్ర పూరిత ప్రయత్నం “.ఈ కుట్రలో విప్లవోద్యమం నుండి వైదొలగిన మాజీలు,మార్క్సిజం యొక్క వర్గ దృక్పథాన్ని,స్పృహను వదులుకున్న కమ్యూనిస్టులు అన బడే వారు కొందరు ఉన్నారు.కార్మిక వర్గ నాయకత్వాన జరిగే భారత సామాజిక విప్లవం మాత్రమే దోపిడి వ్యవస్థకు పునాధిగా ఉన్న ఈ రాజ్యాంగాన్ని,కులవ్యవస్థను నిర్మూలించ గలదు. ఇందుకు సన్నాహక కృషిగా కమ్యూనిస్టు విప్లవ కారులు”విప్లవ దృక్పదం” తో దేశంలో అన్ని రంగాల ప్రజలతో స్థిరమైన విప్లవోద్యమాలను నిర్మించి ఆతిమంగా ఉన్నత స్థాయి పోరాటానికి ప్రజలను సిద్దం చెయాల్సి ఉన్నది.

ఇటీవల కాలంలో కమ్యూనిస్టుల ఐక్యత పేరుతో విభిన్న దొరనులకు ప్రాతినిధ్యం వహించే మాజీలు,వివిధ అంశాలతో నిర్మాణాలతో విభేదించి దూరంగా ఉన్న విప్లవ శక్తులు,మత వాద ఫాసిస్టు పాలక వర్గాల నుండి ప్రమాదం అనే పార్లమెంటరీ దృక్పదం గల కమ్యూనిస్టులచే ప్రయత్నాలు మొదలు అయినాయి. ఈ ఐక్యతకు” కమ్యునిస్టు ప్రణాళిక ప్రాసంగికత కమ్యునిస్టుల ఐక్యత “అనేది చర్చ నీయాంశం. వర్గ దోపిడిని గుర్తిస్తున్నాము
అంటే,కమ్యునిస్టు ప్రణాళిక యొక్క ప్రాసంగికత వుంటుందని,ఇది ప్రాదమికంగా గుర్తించని కమ్యూనిస్టులు ఎవ్వరు ఉండరు. అందులోని ప్రాముఖ్యం గల అంశం” సకల దేశ శ్రామికులార ఏకం కండి,మీకు పోయేది ఏమీలేదు బానిస సంకెళ్లు తప్ప” ఈ స్పిరిట్ ను గుర్తించడానికి నికి భారత సామాజిక విప్లవం పట్ల అంకిత భావం,విప్లవ నిజాయితీ,ఆన్నింటికి మించి కమ్యూనిస్టు ధృడ విశ్వాసం అవసరం. ముఖ్యంగా ఈ ఐక్యతకు కనీస రాజకీయ ప్రాతిపదిక,సూత్ర బద్దమైన వైఖరి అవసరం.ఈ సూత్ర బద్ద వైఖరి ఐక్యతకు తొలి మెట్టుగా వుంటుంది.

ఆ తరువాత నిర్మాణ ఐక్యతకు దారి తీస్తుంది.ఇది లేని ఐక్యత ప్రయత్నాలు “ఎండ మావిలో నీటి కోసం ప్రయత్నంచడం లాంటిదే “నని రుజువైనది. మనది సువిశాల అధిక జనాభ కలిగిన దేశం.అగ్ర రాజ్యం అమెరికాతో సాహా,ఇతర సామ్రాజ్యవాదులంతా మనదేశాన్ని తమ పైనాన్స్ పెట్టుబడులతో మనదేశాన్ని కొల్లగుడుతూ ఉన్నారు.ఇక్కడ దళారీ బడా బూర్జువా,భూస్వామ్య పాలక వర్గాలు సామ్రజ్యవాదుల దోపిడీకి దేశాన్ని ఒక ప్లేగ్రౌండ్ గా మార్చినారు. మనది స్వతంత్ర పెట్టు బడిదారి దేశం ఎంత మాత్రం కాదు.విదేశీ శాస్త్రీయ సంస్కృతి పేరుతో సామ్రాజ్య వాద సిద్దాంతాలు, వారి సంస్కృతి దేశంలో శర వేగంగా వ్యాపిస్తున్నది. భారతీయ సంస్కృతి పేరుతో సనాతన, ప్యూడల్, మతతత్వ,తిరోగమన అభివృద్ది నిరోధక సిద్దాంతాలు, సంస్కృతులను బి.జె.పి. పాలకులు,పాలు పోసి పెంచుతున్నారు.భారత ప్రజానికంలోనీ అత్యుత్తమ లక్షణాలను కాపాడుతూ,విదేశీ,స్వదేశీ అభివృద్ది నిరోధక సిద్ధాంతాలకు,సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడాలి.

కమ్యునిస్టు విప్లవ కారులు,భారత జనతా ప్రజాతంత్ర విప్లవం కోసం నిజాయితీ,త్యాగ నిరతితో పని చేసే ఇతర విప్లవ శక్తులతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. కామ్రేడ్, టి. యన్. తన విద్యార్థి దశలో బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించినారు.తరువాత భారత దోపిడి పాలక వర్గాలకు వ్యతిరేకంగా రాజీ లేని పోరాటం సాగించారు.కమ్యూనిస్టు ఉద్యమంలో రివిజనిజానికి,నయా రివిజనిజానికి వ్యతిరేకంగా,విప్లవ కారుల్లో అతివాద దుస్సాహాసిక,ఖతం కార్యక్రమానికి,అదేసమయంలో మితవాద,అతివాద,అవకాశ వాదానికి వ్యతిరేకంగా పోరాడి,కమ్యునిస్టు విప్లవోద్యమానికి నాయకత్వం వహించారు.అరు దశాబ్దాల పాటు జీవించి,
విద్యార్థి దశలోనే విప్లవ రాజకీయాల్లో ప్రవేశించి,చివరి నిముషం దాకా విప్లవానికి అంకితమై అమరులైన కామ్రేడ్ నాగిరెడ్డి గారు కమ్యునిస్టు విప్లవ కారులకు నాయకులుగా ఉండడం ఎంతో గర్వకారణం.అయన వర్ధంతి సందర్భంగా అమరులు కా,టి.యన్.గారికి విప్లవ జోహార్లు
అర్పిస్తునాం.

Also Read…

హిందూ మతం – హైందవం – హిందూత్వ ఒకటి కాదు !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here