గురుకుల డిగ్రీ కాలేజీలో మొక్కలు నాటిన వనజీవి రామయ్య

0
93

Vanajeevi Ramaiah: టీఎస్ డబ్ల్యూ ఆర్ డి సి ఖమ్మం కళాశాలలో స్వచ్ఛ గురుకులం ఐదవ రోజు కార్యక్రమంలో భాగంగా చెట్లను నాటే కార్యక్రమానికి పద్మశ్రీ వనజీవి రామయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలని నాటి, తమ జీవిత అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. కళాశాల ప్రిన్సిపల్ బి.ఝాన్సీ రాణి, అధ్యాపకులు, విద్యార్థులు రామయ్యను ఘనంగా సన్మానించి, తమ కళాశాల ఆతిథ్యాన్ని స్వీకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో కోలాహలంగా పాల్గొన్నారు.

అనంతరం తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. స్వచ్ఛ గురుకులంలో భాగంగా పర్యవేక్షించడానికి ఎంపీడీవో సురేష్ కళాశాలకు విచ్చేసి, కాళోజీ జయంతి వేడుకల్లో పాలుపంచుకొని , జ్యోతి ప్రజ్వలన గావించి పూలమాలని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ విద్యార్థులకు పరిశుభ్రత గురించిన అవగాహనను కల్పిస్తూ, పరిశుభ్రంగా ఉంటే అనారోగ్యాల బారిన పడరని తెలియజేశారు. అలాగే కళాశాలలో ఉన్న గడ్డి మొక్కలను తొలగించడానికి డోజర్ ని, చెత్తని డంపు చేయటానికి ప్రతినెలా ట్రాక్టర్ ని పంపిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎంపీడీవో మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ బి. ఝాన్సీ రాణి, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here