క్రీడలు సింగిల్స్‌‌లో సత్తా చాటిన లక్ష్య సేన్... మొదటిసారి ఈ టైటిల్‌ను గెలుచుకుని రికార్డులను బద్దలు గొట్టాడు.

సింగిల్స్‌‌లో సత్తా చాటిన లక్ష్య సేన్… మొదటిసారి ఈ టైటిల్‌ను గెలుచుకుని రికార్డులను బద్దలు గొట్టాడు.

భారత యువ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు లక్ష్య సేన్ ఆదివారం జరిగిన ఇండియా ఓపెన్-2022 పురుషుల సింగిల్స్ టైటిల్‌ ఫైనల్‌లో ప్రపంచ ఛాంపియన్ లోహ్ కీన్ యూను ఓడించాడు. ఈ మ్యాచ్‌లో లక్ష్య సేన్ 24-22, 21-17 తేడాతో విజయం సాధించగా.. ఈ టైటిల్‌ను గెలుచుకున్న మూడో భారత ఆటగాడిగా నిలిచాడు. అతని కంటే ముందు 1981లో ప్రకాష్ పదుకొణె, ఆ తర్వాత 2015లో కిదాంబి శ్రీకాంత్ తొలి సూపర్ 500 ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకున్నారు. గతేడాది ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని సాధించి లక్ష్య సేన్ మెరుపులు మెరిపించాడు. ప్రస్తుతం ఈ టైటిల్‌ను తన సొంతం చేసుకుని పాత రికార్డులను అధిగమించాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఇద్దరు ఆటగాళ్ల రికార్డు 2-2గా ఉంది. సింగపూర్ ఆటగాడితో ఆడిన గత మూడు మ్యాచ్‌ల్లో రెండింట్లో లక్ష్య సేన్ ఓడిపోయాడు. కానీ, ఆదివారం మెరుగైన ఆటతీరు కనబరిచి విజయం సొంతం చేసుకున్నాడు. ప్రపంచ చాంపియన్ ముందు లక్ష్య‌సేన్ దూకుడు షాట్లు ఆడి టైటిల్ గెలిచాడు. ఈ మ్యాచ్‌లో లక్ష్య 54 నిమిషాల్లో విజయం సాధించాడు.

 లక్ష్య కంటే ముందు HSBC BWF వరల్డ్ టూర్ టోర్నమెంట్ సిరీస్‌లో ఆడి పురుషుల డబుల్స్ టైటిల్‌ను భారత్‌కు చెందిన సాత్విక్‌ సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టిలు గెలుచుకున్నారు. ఈ టోర్నమెంట్ టైటిల్ మ్యాచ్‌ను భారతీయులు గెలవడమే కాకుండా, ఉన్నత ర్యాంక్ ఆటగాళ్లను ఓడించడం భారత క్రీడాకారుల ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించేదిగా ఉంది. రెండో సీడ్‌గా ఉన్న భారతీయులు రెండో గేమ్‌లో ఐదు గేమ్ పాయింట్లను కాపాడుకున్నారు. టాప్ సీడ్‌లు హెండ్రా సెటియావాన్, మహ్మద్ అహ్సన్‌లను 21-16, 26-24 తేడాతో ఓడించి తమ రెండవ సూపర్ 500 టైటిల్‌ను గెలుచుకున్నారు.

అంతకుముందు, మహిళల సింగిల్స్ టైటిల్‌ను థాయ్‌లాండ్‌కు చెందిన రెండో సీడ్ బుసానన్ ఒంగ్‌బమ్రుంగ్‌ఫాన్ 22-20, 19-21, 21-13తో స్వదేశానికి చెందిన సుపానిడా కాటెథాంగ్‌ను ఓడించింది. మహిళల డబుల్స్ టైటిల్‌ను థాయ్‌లాండ్‌కు చెందిన బెన్యాపా-నుంటకర్న్ అమ్సార్డ్ 21-13, 21-15తో రష్యాకు చెందిన అనస్తాసియా అక్చురినా-ఓల్గా మొరోజోవాపై ఓడించగా, సింగపూర్‌కు చెందిన భార్యాభర్తల జోడీ హీ యోంగ్ కై టెర్రీ-టాన్ వీ హాన్ మలేషియాపై మూడో స్థానంలో నిలిచారు. మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్‌లో 21-15, 21-18తో సీడ్ చెన్ టాంగ్ జీ, పెక్ యెన్ గెలుపొందారు.

RELATED

నీతి ఆయోగ్ ఒక నిరర్ధక సంస్థగా మారిపోయింది.. కేసీఆర్ ఆవేదన

నీతి ఆయోగ్ ఏర్పాటు చేసినప్పడు భారత్‌కు మంచి రోజులు వచ్చాయని తాను ఎంతో సంతోషించానని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్...

రేపటి నీతి ఆయోగ్‌ సమావేశాన్ని నేను బహిష్కరిస్తున్నా – సీఎం కేసీఆర్‌

రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. శనివారం ఆయన ప్రగతిభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నిర్ణయం చాలా బాధాకరమే...

ఆసియా ఖండంలోనే అరుదైన పోలీస్ భవనం

ఈ ఫోటోలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? మైక్రోసాఫ్ట్ లేదా అమెజాన్, టిసిఎస్, ఇన్ఫోసిస్, యాక్సెంచర్ లాంటి దిగ్గజాసంస్థలు తమ ప్రధాన కార్యాలయాన్ని నిర్మిస్తున్నట్లు అనిపించడంలేదూ? అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే....

నమ్మకద్రోహానికి వారసుడు రాజగోపాల్ రెడ్డి…

• కాంగ్రెస్ ను కాపాడుతున్నదే రేవంత్ రెడ్డి : టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షతో మునుగోడు ఎమ్మెల్యే అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. నేడు...