దేశంలో రెండు కోవిడ్ వేరియంట్లు సమాంతరంగా కొనసాగుతున్నాయి: ఐసీఎంఆర్ వైరాలజిస్ట్ డాక్టర్ టి జాకబ్

0
189

తెలుగడ్డా న్యూస్ టీమ్(టీఎన్టీ): కోవిడ్ తనను తాను అవిష్కరించుకునే క్రమంలో ఓమీక్రాన్ ఓ సంకర ఫలితమేనని ఐసీఎంఆర్ సెంటర్ ఆఫ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఇన్ వైరాలజీ శాస్త్రవేత్త డాక్టర్ టి జాకబ్ జాన్ అభిప్రాయపడ్డారు. పిటిఐ వార్తా సంస్థ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఓమీక్రాన్ వైరస్ వ్యూహన్ లాబ్ లో తయారైంది కాదని జాకబ్ జాన్ స్పష్టం చేశారు. కోవిడ్ జాతిలో ఒమిక్రాన్ సంకరజాతి ఫలితమని కాబట్టి దేశంలో ఇక ముందు ఏకకాలంలో రెండేసి రకాల కోవిడ్ వ్యాధులు కొనసాగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ రెండు కలిసి జాతీయ ఉపద్రవం గా మారనున్నాయని జాకబ్ తెలిపారు. మూడో ఉప్పెన మందగించే దిశగా నడుస్తోందా అన్న ప్రశ్నకు సమాధానంగా ఒమిక్రాన్ తొలుత పట్టణాలకు సోకిందనీ పట్టణాల్లోనే ముందు మందగిస్తుందని అభిప్రాయపడ్డారు. రానున్న కోవిడ్ వైరస్ రకాలు వేగంగా సంక్రమించినా ప్రాణాంతకం కాబోవన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు దేశంలో 271202 మందికి తాజా కోవిడ్ సంక్రమిస్తే అందులో 7743 మంది ఒమిక్రాన్ బారిన పడ్డట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం జారీ చేసిన వివరాలు వెల్లడించాయి. అయితే తెలంగాణా లోనే 2047 కేసులు నమోదు అయినట్టు వచ్చిన వార్తలు చూస్తే దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య యథావిధిగా తక్కువ చేసి చెబుతోందన్న సందేహాలు మరింత బలపడుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here