Uncategorized ఆసియా ఖండంలోనే అరుదైన పోలీస్ భవనం

ఆసియా ఖండంలోనే అరుదైన పోలీస్ భవనం

ఈ ఫోటోలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? మైక్రోసాఫ్ట్ లేదా అమెజాన్, టిసిఎస్, ఇన్ఫోసిస్, యాక్సెంచర్ లాంటి దిగ్గజాసంస్థలు తమ ప్రధాన కార్యాలయాన్ని నిర్మిస్తున్నట్లు అనిపించడంలేదూ? అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే.

ఏడు సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఒక మహత్తరమైన ఆలోచన వచ్చింది. రాష్ట్రంలో ఏ మూలాన ఏ నేరం జరిగినా, ఎలాంటి దుస్సంఘటన జరిగినా ఆ దృశ్యాలు, హైదరాబాద్ లోని పోలీస్ కార్యాలయంలో కనిపించాలి. స్థానిక పోలీసులు అజాగ్రత్తగా ఉన్నా, హైదరాబాద్ నుంచే సెంట్రల్ కమాండ్ పోలీసులు ఆ ఘటనను లోకల్ పోలీసు అధికారులను అప్రమత్తం చెయ్యాలి. రాష్ట్రంలోని అన్ని సిసిటివి కెమెరాలను, వ్యవస్థలను కేంద్ర కార్యాలయం నెట్ వర్క్ కు అనుసంధానం చెయ్యాలి. నేరాలను నియంత్రించడంలో ఈ కార్యాలయం కీలక పాత్ర పోషించాలి.

ఆలోచన వస్తే ప్రయోజనం ఏముంది ? ఆచరణలో పెట్టాలి కదా! వెంటనే పోలీస్ ఉన్నతాధికారులతో, నిపుణులతో సమావేశాలు ఏర్పాటు చేసారు కేసీఆర్. వాహనాలకు, భవనాలకు సుమారు తొమ్మిది వందల కోట్ల రూపాయలను మంజూరు చెయ్యడం, భవన నిర్మాణం మొదలు కావడం చకచకా జరిగిపోయింది. మధ్యలో కొరోనా కొన్నాళ్ళు బ్రేక్ వేసినప్పటికీ వెయ్యి కోట్ల రూపాయల ట్విన్ టవర్స్ భవనాలు రికార్డ్ సమయంలో పూర్తి చేయించడంలో కేసీఆర్ కీలకపాత్రను పోషించారు.

బంజారా హిల్స్ లో ఏడు ఎకరాల సువిశాల స్థలంలో 640 వేల చదరపు అడుగుల స్థలంలో ఇరవై అంతస్తుల భారీ భవనం నిర్మించబడింది. ఆసియా ఖండంలోనే ఇలాంటి భవనం లేదు. ఫోటో వోల్టిక్ రూఫ్ అనే అధునాత సాంకేతిక పద్ధతిలో భూమట్టానికి అరవై అడుగుల ఎత్తున నిర్మించబడింది. దీనిలో ముఖ్యమంత్రి, హోమ్ మంత్రి, డిజిపి, పోలీస్ కమిషనర్ లకు ప్రత్యేక ఆఫీసులు ఉంటాయి. ప్రజలు సందర్శించడానికి ఆరో అంతస్తుట్లో పబ్లిక్ గ్యాలరీ ఏర్పాటు చేశారు. హెలికాఫ్టర్ దిగడానికి హెలీప్యాడ్ నిర్మించబడింది. ఈ భవనంలో ఒకేసారి 1130 మంది ఉద్యోగులు కంప్యూటర్ల మీద పనిచేసే సదుపాయం ఉన్నది. తెలంగాణాలో తన కలలపంటగా రూపొందిన ఈ బృహద్భవనానికి రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభోత్సవం చేయనున్నారు.

ఇలాంటి ఆకాశహర్మ్యం దేశంలోనే మొదటిసారిగా పోలీసు శాఖకు తెలంగాణాలో నిర్మించబడింది. రాష్ట్రంలో శాంతిభద్రతల అదుపులో నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలని కేసీఆర్ ఇప్పటికే అనేకమార్లు పోలీసులకు స్పష్టం చేశారు.

కేసీఆర్ దూరదృష్టికి, పాలనాదక్షతకు, చిత్తశుద్ధికి, పట్టుదలకు ప్రతీకగా నిలిచిపోయే ఒక మాన్యుమెంట్ పోలీస్ కమాండ్ కంట్రోల్ భవనం.

ఇక్కడ ఒక విషయాన్నీ తప్పకుండా చెప్పుకోవాలి. కొందరు ముఖ్యమంత్రులు పదేళ్లు, పదునాలుగేళ్ళు పరిపాలించినా శంకుస్థాపనలే తప్ప ప్రారంభోత్సవాలు చెయ్యలేరు. ఎన్నేళ్లు అధికారం ఇచ్చినా ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి చెయ్యలేరు. కానీ కేసీఆర్ తీరే వేరు. ఆయన చేతిమీదుగా శంకుస్థాపన జరిగిన కాళేశ్వరం, మల్లన్నసాగర్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, యాదాద్రి, నూతన సచివాలయం, ప్రతి జిల్లాలోనూ సరికొత్త హంగులతో కలెక్టరేట్లు, ఎస్పీలకు కార్యాలయాలు…ఇలా ఒకటికాదు..రెండు కాదు…దేనికైతే శంకుస్థాపన చేశారో, తన చేతితోనే దాన్ని ప్రారంభించే అదృష్టం కూడా కేసీఆర్ దక్కించుకుని చరిత్ర సృష్టించారు.

RELATED

నీతి ఆయోగ్ ఒక నిరర్ధక సంస్థగా మారిపోయింది.. కేసీఆర్ ఆవేదన

నీతి ఆయోగ్ ఏర్పాటు చేసినప్పడు భారత్‌కు మంచి రోజులు వచ్చాయని తాను ఎంతో సంతోషించానని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్...

రేపటి నీతి ఆయోగ్‌ సమావేశాన్ని నేను బహిష్కరిస్తున్నా – సీఎం కేసీఆర్‌

రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. శనివారం ఆయన ప్రగతిభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నిర్ణయం చాలా బాధాకరమే...

ఆసియా ఖండంలోనే అరుదైన పోలీస్ భవనం

ఈ ఫోటోలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? మైక్రోసాఫ్ట్ లేదా అమెజాన్, టిసిఎస్, ఇన్ఫోసిస్, యాక్సెంచర్ లాంటి దిగ్గజాసంస్థలు తమ ప్రధాన కార్యాలయాన్ని నిర్మిస్తున్నట్లు అనిపించడంలేదూ? అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే....

నమ్మకద్రోహానికి వారసుడు రాజగోపాల్ రెడ్డి…

• కాంగ్రెస్ ను కాపాడుతున్నదే రేవంత్ రెడ్డి : టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షతో మునుగోడు ఎమ్మెల్యే అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. నేడు...